హల్చల్ చేస్తున్న పవర్స్టార్ లిటిల్ ప్రిన్స్ | here is pawan star's lil daugter | Sakshi
Sakshi News home page

హల్చల్ చేస్తున్న పవర్స్టార్ లిటిల్ ప్రిన్స్

Published Tue, Apr 5 2016 1:05 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

హల్చల్ చేస్తున్న పవర్స్టార్ లిటిల్ ప్రిన్స్ - Sakshi

హల్చల్ చేస్తున్న పవర్స్టార్ లిటిల్ ప్రిన్స్

హైదరాబాద్: పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ రెండవ  కుమార్తె  ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ  పెళ్లి  వేడుకల్లో  సందడి చేసిన ఈ చిన్నారి ఫోటోలను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. పవన్, అన్నా లెజెనివా ల ముద్దుల తనయ 'పోలెనా'  ఫోటోలు  ఇప్పటి వరకు ఎక్కడా కనిపించలేదు.  దీంతో తమ అభిమాన హీరో  లిటిల్ ప్రిన్స్ తాజా  ఫోటోలతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
 
మెగా ఫ్యామిలీ   ఘనంగా నిర్వహించిన శ్రీజ- కళ్యాణ్   వేడుకల్లో పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజెనివా కొత్త కళను తీసుకొచ్చిందని అభిమానులు మురిసిపోయారు.  మరోవైపు ఈ లిటిల్ ప్రిన్స్.. అల్లు అర్జున్ కొడుకు అయాన్, ఇతర మెగా ఫ్యామిలీ పిల్లలతో ఆడుకుంటూ సందడి చేసింది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement