Bipasha Basu, Karan Singh Grover Shares Daughter Devi's Mukhe Bhaat Ceremony - Sakshi
Sakshi News home page

కూతురి అన్నప్రాసన ఫోటో.. అభిమానులతో షేర్‌ చేసుకున్న హీరోయిన్‌

Published Sun, Jun 11 2023 1:46 PM | Last Updated on Sun, Jun 11 2023 4:25 PM

Bipasha Basu Celebrates Daughter Devi Annaprashan Ceremony - Sakshi

బాలీవుడ్ హీరోయిన్ బిపాషా బసు 2016లో హీరో  కరణ్ సింగ్ గ్రోవర్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. గతేడాది నవంబర్ 12న పండంటి పాపకు ఆమె జన్మనిచ్చింది. తమ గారాలపట్టికి 'దేవి బసు సింగ్ గ్రోవర్' అనే పేరును ఇప్పటికే ఖరారు చేశారు.  ఈ జంట తల్లిదండ్రుల క్లబ్‌లో చేరినప్పటి నుంచి, వారి ఆనందానికి అవధులు లేవనే చెప్పవచ్చు. వారిద్దరూ తమ పాపతో ఎంతగానో ఎంజాయ్‌ చేస్తున్నారు. తాజాగా బుజ్జాయి అన్నప్రాసన వేడుకను ఘనంగా నిర్వహించారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని ఫోటోలతో పాటు వీడియోలను అభిమానులతో పంచుకున్నారు.

(ఇదీ చదవండి:  మూడేళ్ల కిందట రహస్యంగా రెండో పెళ్లి.. పాపకు జన్మనిచ్చిన ప్రభుదేవా భార్య!)

ఈ వేడుకలో  బిపాషా, కరణ్ కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు పాల్గొన్నారు. బంగారు రంగులో ఉండే డ్రెస్‌తో ఆ బుజ్జాయి ఎంత క్యూట్‌గా ఉందో అంటూ ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. వారి కెరీర్ విషయానికి వస్తే, బిపాషా బసు గత కొంతకాలంగా సినిమాలకు విరామం ఇచ్చింది. కరణ్ సింగ్ గ్రోవర్ మాత్రం  హృతిక్ రోషన్-దీపికా పదుకొనే నటించిన ఫైటర్ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నాడు.

(ఇదీ చదవండి: హీరోయిన్‌ మెటిరియల్‌ కాదన్న నెటిజన్‌.. అదే రేంజ్‌లో రిప్లై ఇచ్చిన అనుపమ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement