
బిపాసా బసు, సన్నీ లియోన్, రాఖీ సావంత్.. వీళ్ల ముగ్గుర్లో ఒక కామన్ పాయింట్ ఉంది. ముగ్గురూ అందగత్తెలని తప్పించుకోవద్దు. ముగ్గుర్లో ఎవరు కనబడినా సినిమా పరుగులు తీస్తుందని చెప్పేయొద్దు. కేక పుట్టే క్యారెక్టర్లు చేశారని క్లాస్ పీకొద్దు. కొంచెం ఆలోచించండి. మీరు ఎవ్వరూ ఊహించలేని ఒక కామన్ పాయింట్ ఉంది. సాధారణంగా ఆ కామన్ పాయింట్ మగ మారాజుల దగ్గరే ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ! బీ సేఫ్. కాండోమ్ వాడండి.
ఇది మన ప్రభుత్వమే కాదు, ప్రపంచమంతా రన్ అవుతున్న కాంపెయిన్. అనవసరంగా జబ్బులు రాకుండా ఉండటానికి, అవసరం ఉన్నప్పుడే పిల్లల్ని కనడానికి బీ సేఫ్. కాండోమ్ వాడండి అని ప్రపంచంలో ఉన్న మగ మారాజులందరూ పుంజులై కూశారు. మన దగ్గర బిపాస, సన్నీ, ఇప్పుడు రాఖీ కాండోమ్ వాడమని ప్రకటనల్లో కనబడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment