ప్రియుడిని సర్‌ప్రైజ్ చేసిన బిపాసాబసు
‘ఎలోన్’ చిత్రంతో ‘జంట’గా మారిన సెక్సీ తార బిపాసాబసు జతగాడు కరణ్‌సింగ్‌తో కలసి ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేసిందట. ఈ సినిమాలో కలసి చేసిన ఇద్దరూ ఆఫ్‌స్క్రీన్‌లో కూడా ఒకరికి ఒకరుగా తిరిగేస్తున్నారట. రీసెంట్‌గా కరణ్ 33వ బర్త్‌డేను గోవా బీచ్‌లో సెలబ్రేట్ చేసిందట బిపాసా! అది కూడా అతగాడికి తెలియకుండా గుట్టుగా అరేంజ్‌మెంట్స్ చేసేసిందట.
అన్నీ అనుకున్నట్టుగా జరిగుంటే... ముంబై నుంచి తన ఫ్రెండ్స్‌తో ఫ్లయిట్‌లో డెరైక్టుగా గోవాలో దిగి, అక్కడ మిడ్‌నైట్ అకేషన్ జరిపి ప్రియుడిని సర్‌ప్రైజ్ చేయాలన్నది ఈ చిలిపి చూపుల చిన్నదాని ప్లాన్. కానీ... అమ్మడు అతిగా నిద్దర పోవడం వల్ల ప్రోగ్రామ్ కాస్త అటూఇటూ అయినా... మొత్తానికి అర్ధరాత్రి 12 గంటలకు ముందే కరణ్ దరి చేరి హ్యాపీ బర్త్‌డేను మెమరబుల్‌గా మార్చినట్టు ముంబై మిర్రర్ కథనం. బాయ్‌ఫ్రెండ్ జతగా బిప్... తన క్లోజ్ ఫ్రెండ్స్ డిజైనర్ రాకీ, ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్ డేన్ పాండే, మోడల్ క్యాండిస్ పింటోలతో కలసి లాంగ్ డ్రైవ్‌కు వెళ్లిందట!