Karan Singh
-
కరణ్ సింగ్ (సీనియర్ మోస్ట్ లీడర్) రాయని డైరీ
లోకం మనల్ని పూర్తిగా పట్టించుకోవడం మానేసినప్పుడు లోకానికి మనం ఏదైనా కొత్తగా చేసి చూపించాలన్న తపన మన లోలోపల ఎందుకని అంత అర్థరహితంగా రేయింబవళ్లూ జ్వలిస్తూ ఉంటుంది?! ‘‘ఇదిగో.. చాణక్యపురిలోని న్యాయ్మార్గ్లో ఉన్న ‘మానస సరోవర్–3’ లో నేనింకా జీవించే ఉన్నాను..’’ అని లోకానికి గుర్తు చేయడానికా? లేదంటే, లోకం మనల్ని నిర్దయగా పట్టించుకోవడం మానేయడం వల్ల కాలం మనకు సమకూర్చిన అమూల్యమైన సమయాన్ని అంతకంతా సద్వినియోగం చేసి, ఆ సద్వినియోగ ఫలాన్ని లోకానికంతటికీ ప్రదర్శనకు పెట్టాలన్న ప్రతీకార భావన మనల్ని కొద్దిపాటిగానైనా స్థిమితంగా ఉండనివ్వక పోవడం వల్లనా? కారణం ఏదైనా నేనొక పొరపాటైతే చేశాను! తొంభై రెండేళ్ల వయసులో ఒక మనిషి పొరపాటు పని చేస్తే ఏమనుకోవాలి? ఏమైనా అనుకోవచ్చు. చూపు సన్నగిల్లిందని, మాట మెత్తబడిందని, వినికిడి మందగించిందనీ, ఆలోచన పలచనయ్యిందనీ.. ఏదైనా అనుకోవచ్చు. కానీ ఇవన్నీ కూడా నాలో చక్కగా పనిచేస్తూ ఉన్నప్పటికీ నేనెందుకు పొరపాటు చేసినట్లు?! తొంభై ఏళ్లు దాటిన వయసంటే.. నిరక్షరాస్యుడిని సైతం వేదవ్యాసుడిగా మార్చేసేటంతటి జీవితం! మరి ఇతిహాసాలను, ఉపనిషత్తులను అధ్యయనం చేసిన మనిషి ఇంకెంతలా మారి ఉండాలి! అసలు పొరపాటన్నదే చేయలేనంతగా కదా. కానీ నేను చేశాను. తొంభై రెండేళ్ల వయసుండీ; ఇతిహాసాలను, ఉపనిషత్తులను చదివి ఉండీ, పుస్తకం రాయడం అనే ఒక పెద్ద పొరపాటు చేశాను! పుస్తకం రాస్తున్నప్పుడు అనిపించ లేదు, పుస్తక ఆవిష్కరణప్పుడు అనిపించింది.. రాసి పొరపాటు చేశానని. ముండకోపనిషత్తుపై నేను రాసిన ఆ పుస్తకాన్ని ఆవిష్కరించింది గౌరవ భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్. ‘‘ధన్‌ఖడ్‌జీ.. నేనొక పుస్తకాన్ని రాశాను. ఆ పుస్తకాన్ని మీరే ఆవిష్కరించాలి..’’ అని మొదట నేను ఫోన్ చేసి చెప్పినప్పుడు ధన్‌ఖడ్.. పుస్తకం పేరేమిటని అడగలేదు! ‘‘ధన్‌ఖడ్‌జీ.. మీరు అనుమతిస్తే కనుక నా పుస్తకం పేరేమిటో కూడా మీకు ఇప్పుడే తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను..’’ అన్నాను. అప్పుడైనా ఆయన ‘‘సరే, చెప్పండి..’’ అనలేదు! ఉపరాష్ట్రపతి నివాస్‌లో పుస్తకావిష్కరణ జరిగింది. ‘‘పుస్తకం బాగుంది కరణ్‌జీ.. ‘ముండకోపనిషత్తు’ పైన కదా రాశారు..’’ అన్నారు ధన్‌ఖడ్.. పేజీలను తిరగేస్తూ. ముండకోపనిషత్తులో కాంగ్రెస్ పార్టీ గురించి ఉండదు. రాహుల్‌గాంధీ అసలే ఉండరు. ‘సత్యమేవ జయతే‘ అని మాత్రమే చెబుతుంది ముండకోపనిషత్తు. కానీ ధన్‌ఖడ్ రాహుల్‌గాంధీ గురించి మాట్లాడారు! రాహుల్ లండన్ వెళ్లి ఇండియా పార్లమెంటును విమర్శించడం ఏమిటని ప్రశ్నించారు. ‘‘ఇప్పుడు కూడా నేను మౌనంగా ఉంటే రాజ్యాంగ విలువల్ని ఎవరు కాపాడతారు?’’ అని అడిగారు! ‘‘పార్లమెంటుకు వ్యతిరేకంగా సాగుతున్న ఈ దుష్ప్రచారాన్ని ఎలా విస్మరించగలను?’’ అని అన్నారు. నా పుస్తకావిష్కరణకు నేను ధన్‌ఖడ్‌ను ఎంచుకుంటే, రాహుల్‌పై మండిపడేందుకు ధన్‌ఖడ్ నా పుస్తకావిష్కరణను ఎంచు కున్నారా?! ఐనా పుస్తకం రాయడం అనే పొరపాటును నేనెందుకు చేసినట్లు!! 1967లో నేను కాంగ్రెస్‌లో చేరాను. ఇప్పుడూ కాంగ్రెస్‌లోనే ఉన్నాను. కానీ కాంగ్రెస్‌కు నేనేమీ కాను. వర్కింగ్ కమిటీ లోనూ లేను. నన్నెవరూ ఏదీ అడగరు. ఏదీ నాకు చెప్పరు. పార్టీలో నేనిప్పుడు ఒక జీరో. పార్టీ నన్ను పూర్తిగా పట్టించుకోవడం మానేసిందని చెప్పి పార్టీకి నేనేదైనా కొత్తగా చేసి చూపించాలని తపించడం వల్లనే పుస్తకం రాయడం అనే ఇంత పెద్ద పొరపాటు నా వల్ల జరిగి ఉంటుందా?! -
బ్రిటీష్ రాజుతో పోరాడిన లెజెండ్‌పై సినిమా
బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన న్యాయవాది సి. శంకరన్ నాయర్ జీవితం వెండితెరకు రానుంది. ‘ది ఆన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ శంకరన్ నాయర్’ బయోపిక్కు కరణ్ సింగ్ త్యాగీ దర్శకత్వం వహించనున్నారు. ‘‘జలియన్ వాలాబాగ్ మారణకాండ’ వెనకాల దాగి ఉన్న నిజాలను దాచాలనుకున్న ఓ బ్రిటిష్ రాజుకు వ్యతిరేకంగా కోర్టులో పోరాడిన లెజెండ్ శంకరన్ నాయర్ జీవితంతో సినిమా తీయడం గౌరవంగా భావిస్తున్నాను. శంకరన్ మనుమడు రఘు, అతని భార్య పుష్ప కలిసి రాసిన ‘ది కేస్ దట్ షూక్ ద ఎంపైర్’ బుక్ ఆధారంగా ఈ చిత్ర కథనం ఉంటుంది. నటీనటుల వివరాలను త్వరలో వెల్లడిస్తాం’’ అన్నారు దర్శక–నిర్మాత కరణ్ జోహార్. చదవండి: Narappa: వారం రోజుల్లో ఫస్ట్ కాపీ రెడీ -
ట్రయినింగ్లో...సింగ్ ఈజ్ కింగ్
క్రీడాకారులు ఎవరైనా గెలవాలనే లక్ష్యంతో అహర్నిశలూ శ్రమించి పోటీల్లో పాల్గొంటారు. కానీ ఢిల్లీకి చెందిన కరణ్ సింగ్‌కు మాత్రం ఆ అదృష్టం దక్కలేదు. తాను ఎంతో కష్టపడి ప్రాక్టిస్ చేసినప్పటికీ పోటీలో పాల్గొనలేకపోయాడు. ఆరేళ్లపాటు శిక్షణ తీసుకుని దేశం తరపున అథ్లెటిక్స్‌లో పాల్గొనాలన్న కరణ్ కల విధి వక్రీకరించడంతో... అనేకమార్లు మోకాళ్ల గాయాలు, సర్జరీల మూలంగా ఆ ఆశలు ఆవిరైపోయాయి. ఇక ఎప్పటికీ తాను పోటీలలో పాల్గొనలేను అని తెలిసినప్పుడు ఎంతో బాధపడ్డాడు. అయినప్పటికీ ప్రతిభ ఉండి మరుగున పడిపోతున్న పిల్లలకు శిక్షణ ఇవ్వడం ద్వారా తన కలను నిజం చేసుకోవచ్చని అనుకున్నాడు కరణ్. అమెరికాలో అంతర్జాతీయ కోచ్‌ల వద్ద ఆరేళ్లపాటు శిక్షణ పొందిన కరణ్ అప్పటి తన అనుభవంతో ఊటీ జార్ఖండ్ ప్రాంతాల్లోని గిరిజన పిల్లలకు శిక్షణ ఇస్తూ వారిలోని ప్రతిభను వెలికి తీస్తున్నారు. మిడిల్, లాంగ్ డిస్టెన్స్, రన్నింగ్ కాంపిటీషన్లలో వీరిని బరిలో నిలిపేందుకు గట్టిగా తీర్చిదిద్దుతున్నారు. 2028 లా ఒలింపిక్స్ బరిలో ఈ పిల్లలను నిలపడం తన కల అని కరణ్ చెబుతున్నాడు. ఈ క్రమంలోనే తన సొంత ఊరు అయిన న్యూఢిల్లీ నుంచి ఊటీకి తన మకాం మార్చి 2018 ఆగస్టులో ఊటీలో ‘ఇండియన్ ట్రాక్ ఫౌండేషన్’(ఐటీఎఫ్)ను ఏర్పాటు చేశాడు. ఊటీ పరిసర ప్రాంతాల్లోని గిరిజన తండాల్లోని పిల్లలకు రన్నింగ్‌లో శిక్షణ ఇస్తున్నాడు. 10–16 ఏళ్ల వయసు ఉన్న పిల్లలందర్ని ఒక ఇంట్లో ఉంచి కరణ్, అతని భార్య ఇద్దరు కలిసి వారి బాగోగులు చూసుకుంటున్నారు. వీరి అవసరాలకయ్యే ఖర్చు మొత్తం వారే భరిస్తూ.. వారికి రన్నింగ్‌లో శిక్షణతోపాటు చదువుకునేందుకు అవకాశం కల్పిస్తూ సొంత పిల్లల్లా చూసుకుంటున్నారు. ఏటా ఇక్కడ చేరే పిల్లల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఐటీఎఫ్ ఏర్పాటు చేసేందుకు కరణ్‌కు మూడేళ్లు పట్టింది. ఐటీఎఫ్‌లో శిక్షణ పొందుతున్న పిల్లలు వివిధ పోటీలలో పాల్గొని విజయం సాధించడంతోపాటు స్టేట్ ఛాంపియన్, నేషనల్ క్రాస్ కంట్రీ ఛాంపియన్లుగా నిలుస్తున్నారు. 2028 లా ఒలింపిక్స్‌లో తమ అకాడమీ పిల్లలు తప్పక విజయం సాధిస్తారని కరణ్ చెబుతున్నారు. -
ఆమె అంగీకరిస్తే.. పార్టీ అధ్యక్షురాలు అవుతారు!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ రాజీనామా సమర్పించిన తర్వాత ప్రియాంక గాంధీ వాద్రా పార్టీ బాధ్యతలు చేపట్టాలన్న వాదనకు బలం చేకూరుతోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత కరణ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధ్యక్షురాలిగా ప్రియాంక బాధ్యతలు చేపడితే బలమైన నాయకురాలవుతారని, పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్తేజం వస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ప్రియాంక సరైన అభ్యర్థియేనా అని అడిగిన ప్రశ్నకు ‘ప్రియాంక చాలా తెలివైన మహిళ. సోన్‌భద్ర వ్యవహారంలో బాధితులను కలవడానికి వెళ్లిన సమయంలో ఆమె వ్యవహరించిన తీరు అభినందనీయం. చాలా బాగా మాట్లాడింది. తను అంగీకరిస్తే కచ్చితంగా పార్టీ పగ్గాలు చేపడుతుంది’ అని బదులిచ్చారు. పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ స్థానంలో యువ నేత అయితే బాగుంటుందని ఇటీవల పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్లు పీటీఐకిచ్చిన ఓ ఇంటర్వ్యూలో కరణ్ సింగ్ వ్యాఖ్యానించారు. అధ్యక్షుడి విషయంలో కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోని సీనియర్ నేతలంతా దీనిపై వీలైనంత త్వరగా ముందుకొచ్చి నిర్ణయం తీసుకోవాలన్నారు. కాగా, దీనిపై సీడబ్ల్యూసీ ఈనెల 10వ తేదీన సమావేశం కానున్నట్లు పార్టీ ఆదివారం ప్రకటించింది. -
కేంద్రం వైఖరిలో మార్పునకు ఇది సంకేతమా?
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్ 13వ రాష్ట్ర గవర్నర్‌గా సత్యపాల్ మాలిక్ గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెల్సిందే. పౌర అధికారులను, మాజీ సైనిక అధికారులను రాష్ట్ర గవర్నర్‌గా నియమించే సంప్రదాయానికి తెరదించి ఓ రాజకీయ అనుభవశాలిని గవర్నర్‌గా నియమించడం విశేషం. 1965లో తొట్టతొలి గవర్నర్‌గా కరణ్ సింగ్ నియామకం అనంతరం ఓ రాజకీయ వ్యక్తిని నియమించడం మళ్లీ ఇదే తొలిసారి. ప్రస్తుతం గవర్నర్ పాలనలో ఉన్న కశ్మీర్‌కు సత్యపాల్ మాలిక్‌ను నియమించడం పట్ల రాజకీయ వర్గాల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కశ్మీర్ సమస్యకు ఇంతకాలం సైనిక పరిష్కారాన్నే కోరుకున్న కేంద్రం వైఖరిలో వచ్చిన మార్పునకు ఇది సూచనని, రాజకీయ కోణం నుంచి కశ్మీర్ సమస్యను చూసేందుకు రాజకీయ అనుభవశాలిని నియమించారని ఎక్కువ మంది భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 72 ఏళ్ల మాలిక్ కొన్ని దశాబ్దాల తన రాజకీయ జీవితంలో పలు పార్టీలు మారారు. మాలిక్‌తోపాటు పలు పార్టీలకు సేవలిందించి ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న కేసీ త్యాగి కథనం ప్రకారం మాలిక్ ‘సోషలిస్ట్’గా మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి. ప్రస్తుతం జనతాదళ్ (యూ)లో కొనసాగుతున్న ఆయన మీరట్‌లో సోషలిస్ట్ యువజన నాయకుడిగా పనిచేశారు. భారత్‌తో సోషలిస్ట్ ఉద్యమాన్ని తీసుకొచ్చిన రామ్ మనోహర్ లోహియా, కశ్మీర్‌కు చెందిన షేక్ మొహమ్మద్ అబ్దుల్లాలతో స్ఫూర్తి పొందిన వ్యక్తి. సత్ప్రవర్తన కలిగిన మాలిక్ ఏ పార్టీలో కూడా తన పని విధానంలో చెడ్డ పేరు తెచ్చుకోలేదు. ఆయన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి లోక్‌దళ్ పార్టీ తరఫున 1974లో ఎన్నికయ్యారు. 1980లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1984లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1985లో యూపీ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 1986లో మరోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1987లో ఆయన వీపీ సింగ్ నాయకత్వంలోని జన్మోర్చాలో చేరారు. జన్‌మోర్చా జనతా దళ్‌లో విలీనమైన తర్వాత 1989లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత వీపీ సింగ్‌తో విభేదించి సమాజ్‌వాది పార్టీలో చేరారు. 2004లో బీజేపీలో చేరారు. 2017లో బిహార్ గవర్నర్‌గా నియమితులయ్యారు. వీపీ సింగ్ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు జనతాదళ్‌లో మాలిక్, త్యాగీలు కలసి పనిచేశారు. అప్పుడు కశ్మీర్ సమస్య పట్ల వీపీ ప్రభుత్వం దృక్పథం భిన్నంగా ఉండేదని, ఒక్క చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించకోగలమని కేంద్రం బలంగా విశ్వసించిందని త్యాగి తెలిపారు. సోషలిస్ట్, ఆపార రాజకీయ అనుభవం కలిగిన మాలిక్‌ను కశ్మీర్ గవర్నర్‌గా నియమించడం కశ్మీర్ రాజకీయ పార్టీల్లో కొత్త ఆశలు చిగురింపచేశాయి. కశ్మీర్‌కు ఇది మరో ప్రయోగం లాంటిదేనని, అయితే రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తిని నియమించడం మంచి ప్రత్యామ్నాయం అని, సమస్యను అర్థం చేసుకొని పరిష్కార మార్గం కనుగొనే అవకాశం ఉంటుందని నేషనలిస్ట్ కాంగ్రెస్ సీనియర్ లెజిస్లేచర్ అలీ మొహమ్మద్ సాగర్ అభిప్రాయపడ్డారు. కేంద్రం ఇష్టప్రకారమే ఈ నియామకం జరిగి ఉన్నట్లయితే మాలిక్ నియామకాన్ని హర్షించాల్సిందేనని ఆయన అన్నారు. సైనికేతర వ్యక్తిని నియమించడం పట్ల పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ బహిరంగంగానే హర్షం వ్యక్తం చేసింది. సత్ఫాలన అందించడంతో పాటు అన్ని పార్టీలను కలుపుకొని కశ్మీర్ సమస్య పరిష్కారం దిశగా మాలిక్ ముందడుగు వేస్తారని ఆ పార్టీ అదనపు అధికార ప్రతినిధి నజ్మూ సాకిబ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక సౌకర్యాలను కల్పిస్తున్న 35ఏ, 370 అధికరణలను ఎత్తివేయకుండా అడ్డుకుంటారన్న ఆశాభావం కూడా వ్యక్తం చేశారు. మాలిక్ నియామకం సరైందన్న రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి అశోక్ మాలిక్ కశ్మీర్ పట్ల పాక్ దృక్పథం మారిందనే అభిప్రాయంతోని ఏకీభవించలేదు. మాలిక్ నియామకాన్ని మామూలు విషయంగా తీసుకోకూడదని, ఇందులో కచ్చితంగా ఏదో మతలబే ఉంటుందని బీజేపీ నైజం బాగా తెల్సిన రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మాలిక్ సేవలను ఉపయోగించుకునే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు కేంద్రం కృషి చేయవచ్చని వారు భావిస్తున్నారు. కశ్మీర్ సమస్యకు రాజకీయ పరిష్కారానికి తాము వెరవమని చెప్పడానికి, మరోరకంగా రాష్ట్రంలో పార్టీ లక్ష్యాలను నెరవేర్చుకోవడం కోసమే మాలిక్‌ను కేంద్రం నియమించి ఉంటుందని కశ్మీర్ యూనివర్శిటీలోని పొలిటికల్ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ ఐజాజ్ వాణి అభిప్రాయపడ్డారు. అధికార రాజకీయాల కోసమే కేంద్రం ప్రయత్నించినట్లయితే కశ్మీర్ పరిస్థితి మరింత క్షీణించే ప్రమాదం ఉందని కూడా ఆయన హెచ్చరించారు. -
ఏఐసీసీలో కీలక నియామకాలు
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఏఐసీసీలో కీలక నియామకాలు చేపట్టారు. పార్టీ ట్రెజరర్‌గా రాజ్యసభ ఎంపీ అహ్మద్ పటేల్‌ను నియమించారు. ప్రధాన కార్యదర్శిగా నియమితులైన మోతీలాల్ ఓహ్రా స్థానంలో అహ్మద్ పటేల్ ఈ పదవిని చేపడతారు. సోనియా గాంధీకి కార్యదర్శిగా పనిచేసిన అహ్మద్ పటేల్ గతంలోనూ పార్టీ కోశాధికారిగా వ్యవహరించడంతో ఎన్నికల సమయంలో నిధుల సమీకరణకు ట్రెజరర్‌గా పటేల్ నియామకానికి రాహుల్ మొగ్గుచూపారు. ఇక కరణ్ సింగ్ స్ధానంలో పార్టీ విదేశీ వ్యవహారాల విభాగం చైర్‌పర్సన్‌గా మాజీ కేంద్ర మంత్రి ఆనంద్ శర్మను రాహుల్ నియమించారు. అసోం మినహా ఈశాన్య రాష్ట్రాలకు పార్టీ ఇన్చార్జ్గా లుజిన్హో సలేరియోను నియమించారు. పార్టీ అత్యున్నత నిర్ణాయక విభాగమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోకి మాజీ స్పీకర్ మీరా కుమార్‌ను శాశ్వత ఆహ్వానితులుగా నియమిస్తూ రాహుల్ నిర్ణయం తీసుకున్నారు. దిగ్విజయ్ సింగ్, జనార్థన్ ద్వివేది, కమల్ నాథ్, సుశీల్ కుమార్ షిండే వంటి సీనియర్లను తప్పిస్తూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి నూతన బృందాన్ని తీసుకున్న తర్వాత పార్టీలో సంస్థాగత మార్పులు చేపట్టారు. -
పిల్లాడిని చంపి నెలరోజులు సూట్‌కేసులోనే..
సాక్షి, న్యూఢిల్లీ : ఏడు సంవత్సరాల బాలుడిని చంపి... నెల రోజుల పాటు సూట్‌కేసులోనే దాచిన ఘటన నార్త్‌వెస్ట్ ఢిల్లీలోని స్వరూప్ నగర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అవదేశ్ శాక్య(27) అనే యువకుడు తాను అద్దెకున్న ఇంట్లోని ఆశీస్(7) అనే బాలుడిని జనవరి 6న హత్య చేశాడు. హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని నెలరోజుల పాటు సూట్‌కేసులోనే దాచి పెట్టాడు. తన కొడుకు కనిపించడం లేదని ఆశీష్ తండ్రి కరణ్ సింగ్ స్వరూప్‌నగర్ పోలీసుస్టేషన్లో జనవరి 6న ఫిర్యాదు దాఖలు చేశాడు. ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులకు, ఇంట్లో అద్దెకున్న అవదేశే ఈ హత్య చేసినట్టు తేల్చారు. ఆశీష్ తల్లిదండ్రులు అవదేశ్‌తో మాట్లాడవద్దని చెప్పేవారని, దానితో వారిపై కసితో అవదేశ్ ఈ అకృత్యానికి పాల్పడినట్టు పోలీసులు చెప్పారు. అవదేశ్‌ను అతని ఇంట్లోనే అరెస్ట్ చేసినట్టు నార్త్‌వెస్ట్ డీసీపీ అస్లమ్ ఖాన్ చెప్పారు. బాలుడి మృతదేహాన్ని ఎక్కడైనా పారేసి, డబ్బు కోసం బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేయాలనుకుంటున్నట్టు అవదేశ్ పోలీసుల ఇంటరాగేషన్‌లో అంగీకరించాడు. మూడు సంవత్సరాలు కరణ్ ఇంట్లో అద్దెకు... అవదేశ్ యూపీఎస్సీ పరీక్షల కోసం సిద్ధమవుతున్నాడని పోలీసులు చెప్పారు. అతను మూడు సంవత్సరాలుగా కరణ్ సింగ్ ఇంట్లో అద్దెకు ఉన్నాడని, ఈ మూడు సంవత్సరాల కాలంలో కరణ్ సింగ్, అతని కుటుంబసభ్యులకు అవదేశ్ సన్నిహితుడయ్యాడని తెలిపారు. కొన్ని నెలల కిందట అవదేశ్ ఇల్లు ఖాళీ చేసి అదే ప్రాంతంలో ఉన్న మరో ఇంటికి మారాడని వారు చెప్పారు. ఇల్లు మారిన తర్వాత కూడా కరణ్ సింగ్ ఇంటికి అవదేశ్ వచ్చి పోతుండేవాడు. అయితే కరణ్ సింగ్ తన కొడుకును అవదేశ్‌తో కలవనిచ్చేవాడు కాదని పోలీసు అధికారి చెప్పారు. జనవరి 6న అశీష్, అవదేశ్ ఇంటికి వచ్చి తన తండ్రి అతనితో మాట్లాడవద్దని చెప్పాడని తెలిపాడు. దీంతో అవదేశ్ ఒళ్లు తెలియని ఆగ్రహంతో ఆశీష్‌ను మప్లర్‌తో చంపి మృతదేహాన్ని సూట్‌కేసులో దాచిపెట్టాడు. ఫిర్యాదు ఇచ్చినప్పుడు కూడా తల్లిదండ్రుల పక్కనే... ఆశీష్‌ను చంపిన తరువాత కూడా అవదేశ్ ఏమీ తెలియని వాడిలా కరణ్ సింగ్ ఇంటికి రాకపోకలు సాగించాడు. తన కొడుకు కనిపించకుండా పోయాడని కరణ్ సింగ్ పోలీసుకలకు ఫిర్యాదు చేయడానికి వచ్చినప్పుడు కూడా అతని వెంట అవదేశ్ పోలీసు స్టేషన్‌కు వచ్చాడని పోలీసులు తెలిపారు. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండగా.. దాని గురించి అడిగిన పొరుగు వారికి ఇంట్లో ఎలుకలు చ్చాయని అతను బుకాయించాడు. ఆశీష్ కోసం గాలిస్తూ పోలీసులు ఆ ప్రాంతలో నిరంతరం తచ్చాడుతుండటంతో తాను మృతదేహాన్ని మరో చోటికి తీసుకెళ్లి పారేయలేకపోయాయని అవదేశ్ అంగీకరించాడు. అవదేశ్ పశ్చిమ ఉత్తరప్రదేశ్‌కు చెందిన వాడని, అతను సివిల్ సర్వీసు పరీక్షలు రాస్తున్నాడని పోలీసులు తెలిపారు. అతను మూడు సార్లు ప్రిలిమినరీ, రెండు సార్లు మెయిన్స్ పరీక్షలు రాశాడని పోలీసులు తెలిపారు. -
వయసు 8.. ఎత్తు 6.6 అడుగులు!
మీరట్: పుట్టినప్పుడే రెండడుగులు పొడువు, ఆరున్నర కిలోల బరువుతో ప్రపంచ రికార్డు సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన కరణ్ సింగ్ ఇప్పుడు ఎనిమిదేళ్ల వయస్సులో ఆరడుల ఆరు అంగుళాల ఎత్తు పెరిగి అందర్ని ఆశ్చర్యపరుస్తున్నారు. బడిలో తోటి విద్యార్థుల ముందు తాటి చెట్టంత పొడువు కనిపిస్తున్నాడు. భారత బాస్కెట్ బాల్ క్రీడాకారిణి అయిన ఈ బాలుడి తల్లి స్వెత్లాన్లా ఏడు అడుగుల రెండు అంగుళాల పొడవుతో దేశంలోనే అత్యంత పొడవైన మహిళగా రికార్డు నెలకొల్పారు. ఈ బాలుడి తండ్రి సంజయ్ ప్రస్తుం కుమారుడికన్నా కొంత పొడవుగా ఉన్నారు. తాను తల్లికి మించి పొడవు పెరగాలని తన తల్లిదండ్రులు కోరుకుంటున్నారని కరణ్ సింగ్ చెప్పారు. కానీ తన సైజు దుస్తులు, బూట్లు దొరక్క ఇప్పటికే ఇబ్బంది పడుతున్నానని, భవిష్యత్తులో మరెంత ఇబ్బంది ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడవ తరగతి చదువుతున్న కరణ్ సింగ్ 12 నెంబరు బూట్లు ధరిస్తూ పదవ తరగతి పిల్లలు ధరించే దుస్తులను వేసుకుంటున్నారు. ఇప్పటికే ‘గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో కరణ్ సింగ్ రెండు సార్లు ఎక్కారు. -
ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ.. మంత్రి కన్నుమూత
హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వంలోని కేబినెట్ మంత్రి కరణ్ సింగ్ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన వయసు 60 సంవత్సరాలు. కరణ్‌సింగ్‌కు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. వీరభద్రసింగ్ మంత్రివర్గంలో ఆయుర్వేద, సహకార శాఖల మంత్రిగా పనిచేయడంతో పాటు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన స్వస్థలమైన కుల్లులో అంత్యక్రియలు జరిగాయి. ఆయన కాలేయం, గొంతుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఎయిమ్స్‌లో ఇటీవలే చేరారు. కుల్లు రాజకుటుంబానికి చెందిన కరణ్ సింగ్.. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ సింగ్‌కు స్వయానా తమ్ముడు. 1998-2003 మధ్య బీజేపీ ప్రభుత్వంలో ఆయన విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. దాదాపు 27 ఏళ్ల పాటు బీజేపీలో ఉన్న తర్వాత 2009లో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. 2015లో కాంగ్రెస్ సీఎం వీరభద్రసింగ్ ఆయనను తమ కేబినెట్లోకి తీసుకున్నారు. కరణ్ సింగ్ మృతిపట్ల గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ సంతాపం తెలిపారు. -
హిమాచల్ ప్రదేశ్ మంత్రి కన్నుమూత
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్ మంత్రి కరణ్‌సింగ్ (59) అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందారు. ఈయనకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమారుడు 2012లో జరిగిన ప్రమాదంలో మృతిచెందారు. తమ స్వస్థలమైన కులుకు ఆయన భౌతిక కాయాన్ని తరలించి మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా సేవలందించారు. కులు రాయల్ ఫ్యామిలీకి చెందిన కరణ్‌సింగ్ బీజేపీ కీలక నాయకుడు, మహేశ్వర్‌సింగ్‌కు సోదరుడు. ఈయన బంజార్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1990, 1998లలో బీజేపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ధుమాల్ ప్రభుత్వంలో ప్రాథమిక విద్యా శాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి 2012లో ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. వీరభద్రసింగ్ కొలువులో 2015 ఆగస్టులో మంత్రిగా నియమితులయ్యారు. ఆయన మృతిపట్ల ముఖ్యమంత్రి వీరభద్రసింగ్, మాజీ ముఖ్యమంత్రి శాంతకుమార్, స్పీకర్ బీబీఎల్ బుటాయిల్, మంత్రులు, శాసనసభ్యులు, ప్రముఖ నాయకులు సంతాపం ప్రకటించారు. -
ప్రియుడిని సర్ప్రైజ్ చేసిన బిపాసాబసు
‘ఎలోన్’ చిత్రంతో ‘జంట’గా మారిన సెక్సీ తార బిపాసాబసు జతగాడు కరణ్‌సింగ్‌తో కలసి ఓ రేంజ్లో ఎంజాయ్ చేసిందట. ఈ సినిమాలో కలసి చేసిన ఇద్దరూ ఆఫ్‌స్క్రీన్‌లో కూడా ఒకరికి ఒకరుగా తిరిగేస్తున్నారట. రీసెంట్గా కరణ్ 33వ బర్త్‌డేను గోవా బీచ్‌లో సెలబ్రేట్ చేసిందట బిపాసా! అది కూడా అతగాడికి తెలియకుండా గుట్టుగా అరేంజ్మెంట్స్ చేసేసిందట. అన్నీ అనుకున్నట్టుగా జరిగుంటే... ముంబై నుంచి తన ఫ్రెండ్స్‌తో ఫ్లయిట్లో డెరైక్టుగా గోవాలో దిగి, అక్కడ మిడ్నైట్ అకేషన్ జరిపి ప్రియుడిని సర్ప్రైజ్ చేయాలన్నది ఈ చిలిపి చూపుల చిన్నదాని ప్లాన్. కానీ... అమ్మడు అతిగా నిద్దర పోవడం వల్ల ప్రోగ్రామ్ కాస్త అటూఇటూ అయినా... మొత్తానికి అర్ధరాత్రి 12 గంటలకు ముందే కరణ్ దరి చేరి హ్యాపీ బర్త్‌డేను మెమరబుల్‌గా మార్చినట్టు ముంబై మిర్రర్ కథనం. బాయ్‌ఫ్రెండ్ జతగా బిప్... తన క్లోజ్ ఫ్రెండ్స్ డిజైనర్ రాకీ, ఫిట్నెస్ ఎక్స్పర్ట్ డేన్ పాండే, మోడల్ క్యాండిస్ పింటోలతో కలసి లాంగ్ డ్రైవ్‌కు వెళ్లిందట! -
నేడు బీజేపీలోకి కరణ్ సింగ్ కుమారుడు
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ కాంగ్రెస్ సీనియర్ నేత కరణ్ సింగ్ కుమారుడు అజాతశత్రు సింగ్ ఆదివారం బీజేపీలో చేరనున్నారు. పార్టీ సీనియర్ నేతల సమక్షంలో అజాతశత్రు పార్టీలో చేరుతారని బీజేపీ జమ్మూకాశ్మీర్ ఇన్చార్జి అవినాశ్ రాయ్ ఖన్నా చెప్పారు. అజాతశత్రు చేరిక బీజేపీకి ఎంతో లాభిస్తుందని, జమ్మూకాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జమ్మూ ప్రాంతంలో బీజేపీ అవకాశాలు మరింత మెరుగుపడతాయని చెబుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసే యత్నంలో భాగంగా,.. బీజేపీనుంచి బహిష్కృతుడైన చిమన్ లాల్ గుప్తాను కూడా తిరిగి పార్టీలో చేర్చుకున్నారు. అవినాశ్ రాయ్ ఖన్నా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ,..అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందన్నారు. అజాత శత్రుతోపాటుగా, చిమన్ లాల్ గుప్తా కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. -
ఎదగడానికెందుకురా తొందర..
ఈ పాట మనోడు విన్నట్లు లేడు.. రోజురోజుకూ రేవులో తాటిచెట్టులా బారుగా ఎదిగిపోతున్నాడు. వీడి పేరు కరణ్ సింగ్. వయసు కేవలం 5 ఏళ్లే. వీడి పక్కన మరుగుజ్జుల్లా కనిపిస్తున్న వాళ్లు కరణ్‌సింగ్ క్లాస్మేట్స్. మామూలుగా కరణ్ వీళ్ల సైజులోనే ఉండాలి. కానీ ఇంతున్నాడు. కరణ్ మామూలోడు కాడు. పుట్టినప్పుడే గిన్నిస్ రికార్డు కొట్టాడు. 2008లో వీడు పుట్టినప్పుడు 7 కిలోల బరువు, 2 అడుగుల కన్నా ఎక్కువ ఎత్తున్నాడట. దీంతో అప్పట్లో అత్యంత పొడవైన, బరువైన శిశువు కింద గిన్నిస్ బుక్‌లోకి ఎక్కాడు. మళ్లీ గిన్నిస్ వాళ్లు టేపు పట్టుకుని లెక్కేస్తే.. ప్రస్తుతం ప్రపంచంలో 5 ఏళ్ల వయసున్న పిల్లల్లో కరణే అందరికన్నా ఎక్కువ ఎత్తు ఉంటాడట. వీళ్లింట్లో కూడా అందరూ బాగా హైట్ ఉన్నవారే. కరణ్ తండ్రి సంజయ్ సింగ్ ఎత్తు 6 అడుగుల 6 అంగుళాలు అయితే.. వాళ్లమ్మ స్వెత్లానా హైట్ 7 అడుగుల 2 అంగుళాలు. -
అరుణ్ జైట్లీకి ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు!
న్యూఢిల్లీః సీనియర్ బీజేపీ నేత, ప్రస్తుత కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, కాంగ్రెస్ వృద్ధనేత కరణ్ సింగ్, జనతాదళ్ (యునైటెడ్) నాయకుడు శరద్ యాదవ్‌లు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డులు అందుకోనున్నారు. నేడు(మంగళవారం) ఢిల్లీలో జరగనున్న కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వారికి ఈ అవార్డులు ప్రదానం చేస్తారు. 2010లో రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడి బాధ్యతలు నిర్వర్తించినందుకు గుర్తింపుగా జైట్లీని ఈ అవార్డుకు ఎంపికచేశారు. 2011వ సంవత్సరానికి కరణ్ సింగ్‌ను, 2012వ సంవత్సరానికి శరద్ యాదవ్‌ను ఈ అవార్డును అందించనున్నారు. వీరు ముగ్గురు ఉత్తమపార్లమెంటేరియన్ అవార్డులకు ఎంపికైనట్టు గత ఏడాది మార్చిలోనే ప్రకటించారు. ఈ అవార్డుల ప్రదానం కార్యక్రమానికి, రాజ్యసభ చైర్మన్ హోదాలో ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ప్రధాని నరేంద్ర మోడీ తదితరులు హాజరవుతారు. ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ 1994లో ఈ అవార్డులను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. -
18 ఏళ్ల క్రితం కేసులో ఇద్దరికి ఏడాది జైలుశిక్ష
న్యూఢిల్లీ: పద్దెనిమిదేళ్ల క్రితం ఓ మార్కెట్లో మూడు దుకాణాలు కేటాయించేందుకు బీజేపీ ఎమ్మెల్యే కరన్ సింగ్ తన్వర్‌కు రూ.ఆరు లక్షల లంచం ఇవ్వజూపిన ఇద్దరు వ్యక్తులను స్థానిక కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. అలాగే 1995లో జరిగిన ఈ కేసులో ఢిల్లీ వాసులు జస్బీర్ సింగ్ చావ్లా, షోయబ్ అహ్మద్‌కు తలా లక్ష రూపాయల జరిమానాను ప్రత్యేక సీబీఐ జడ్జి రాజీవ్ మెహ్రా విధించారు. ఈ నెల 30 వరకు ఈ కేసులో అప్పీల్ చేసుకునేందుకు దోషులకు వెసులుబాటు లేదన్నారు. జామా మసీద్‌లో చేప, కోళ్ల మార్కెట్ కమిటీ అడ్మినిస్ట్రేటర్‌గా వ్యవహరిస్తున్న తన్వర్ కావాలనే రాజకీయ కక్ష్యతో తమను ఈ కేసులో ఇరికించారన్న నిందితుల వాదనను తోసిపుచ్చారు. సీబీఐ వర్గాల కథనం ప్రకారం... మూడు దుకాణాలు కేటాయించేందుకు ఎమ్మెల్యే తన్వర్‌కు రూ.ఆరు లక్షల లంచం ఇవ్వజూపామని విచారణలో నిందితులు ఒప్పుకున్నారు. మొదటగా రూ.రెండు లక్షలు, దుకాణాలు కేటాయించిన తర్వాత రూ.నాలుగు లక్షలు ఇస్తామని బేరం పెట్టారన్నారు. ఈ విషయాన్ని తన్వర్ సీబీఐకి ఫిర్యాదు చేయగా వలపన్ని పట్టుకున్నారు. 1995 అక్టోబర్ 16న నరైనాలోని తన్వర్ కార్యాలయానికి వచ్చిన చావ్లా, అహ్మద్‌లు రూ.రెండు లక్షలు ఇవ్వబోయారు. అక్కడే ఉన్న సీబీఐ అధికారులు వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే కరోల్ బాగ్‌కు యూత్ కాంగ్రెస్ మైనార్టీ సెల్ విభాగానికి చావ్లా కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నాడు.