
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) నెట్‌ఫ్లిక్స్ ఇండియాపై సంచలన వాఖ్యలు చేశాడు. నెట్‌ఫ్లిక్స్ ఇండియా(Netflix India)లో పనిచేసే పై స్థాయి అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లోనయ్యారని, వారు నైతికంగా అవినీతిపరులేనని విమర్శించాడు. నెట్‌ఫ్లిక్స్ యూకేలో స్ట్రీమింగ్ అవుతున్న ‘అడోలసెన్స్’ అనే వెబ్ సిరీస్‌ని ప్రశంసిస్తూ.. ఇలాంటి ప్రాజెక్టులను భారత్‌లో నెట్‌ఫ్లిక్స్ సంస్థ తిరస్కరిస్తోందని ఆరోపించాడు. నెట్‌ఫ్లిక్స్ ఇండియా దర్శకుల సృజనాత్మక స్వేచ్ఛను అణచివేస్తోందని, కమర్శియల్ కంటెంట్‌ను మాత్రమే ప్రోత్సహిస్తోందని కశ్యప్ మండిపడ్డాడు.
అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ‘మాక్సిమం సిటీ’ వెబ్ సిరీస్‌ని నెట్‌ఫ్లిక్స్ 2024లో రద్దు చేసిన సంగతి తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్ నిర్ణయాన్ని అనురాగ్ అప్పుడే వ్యతిరేకించాడు. తాజాగా మరోసారి నెట్‌ఫ్లిక్స్‌పై తనకున్న అసంతృప్తిని ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు. ‘మాక్సిమం సిటీ’ రద్దుకు రాజకీయ ఒత్తిళ్లే కారణమని ఆయన ఆరోపించాడు. సృజనాత్మక స్వేచ్ఛపై నెట్‌ఫిక్స్ ఆంక్షలు విధిస్తోందని విమర్శించాడు.
దీనికి యూకే వెబ్ సిరీస్ అడోలసెన్స్‌ని ఉదాహరణగా చూపించాడు. ఈ వెబ్ సిరీస్ మార్చి 13 నుంచి నెట్‌ఫ్లిక్స్ యూకేలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ యుక్త వయస్సు యొక్క చీకటి అంశాలను, ఆన్‌లైన్ ద్వేషం, మరియు సామాజిక సమస్యలను చూపిస్తుంది.ఇలాంటి సాహసోపేతమైన కథను నెట్‌ఫ్లిక్స్ ఇండియా అణచివేస్తోందని ఆయన ఆరోపించారు.
‘మాక్సిమం సిటీ’ కథేంటి?
సుఖ్దేవ్ సింగ్ సంధు రాసిన "మాక్సిమం సిటీ: బాంబే లాస్ట్ అండ్ ఫౌండ్" పుస్తకం ఆధారంగా అనురాగ్ కశ్యప్ ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేశాడు. ఈ సిరీస్‌లో ముంబై నగరం యొక్క చీకటి కోణాలను చూపించాలని భావించారు. అయితే, 2024లో నెట్‌ఫ్లిక్స్ ఈ సిరీస్‌ను రద్దు చేసింది, దీనిపై కశ్యప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.అలాగే ‘సేక్రెడ్ గేమ్స్’మూడో సీజన్ కోసం కూడా నెట్‌ఫ్లిక్స్‌తో చర్చలు జరిగాయి. కానీ కంటెంట్‌తో పాటు బడ్జెట్‌పై వివాదాలు రావడంతో నెట్‌ఫ్లిక్స్ ఈ ప్రాజెక్టును కూడా రద్దు చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment