ఇండియా రిటర్న్‌ | amar akbar anthony america shooting completed | Sakshi
Sakshi News home page

ఇండియా రిటర్న్‌

Published Thu, Sep 6 2018 12:29 AM | Last Updated on Thu, Sep 6 2018 12:29 AM

amar akbar anthony america shooting completed - Sakshi

రవితేజ

అమెరికాలో పని ముగించుకొని ఇండియా రిటర్న్‌ అయ్యారు అమర్‌ అక్బర్‌ ఆంటొని. ఈ ట్రిప్‌లో వాళ్లు ఏం సందడి చేశారన్నది స్క్రీన్‌ మీద తెలుసుకోవాల్సిందే. శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అమర్‌ అక్బర్‌ ఆంటొని’. ఇందులో రవితేజ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. ఇలియానా కథానాయికగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, మోహన్‌ చెరుకూరి, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. నెల రోజుల పాటు అమెరికాలో షూటింగ్‌ జరిపిన చిత్రబృందం ఆ షెడ్యూల్‌ని ముగించుకొని ఇండియా రిటర్న్‌  అవుతున్నారు. ఈ షెడ్యూల్‌తో ఒక్క పాట మినహా సినిమా షూటింగ్‌ కంప్లీట్‌ అయిందని సమాచారం. మిగిలిన సాంగ్‌ కూడా సెట్‌ సాంగ్‌ అని, నెక్ట్స్‌ వీక్‌లో షూట్‌ చేయనున్నారట. అక్టోబర్‌ 5న రిలీజ్‌ కానున్న ఈ చిత్రానికి సంగీతం: యస్‌.యస్‌.తమన్, కెమెరా: వెంకట్‌ సి.దిలీప్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement