దేశభక్తుడా.. విద్రోహా.. హంతకుడా..? | Akshay Kumars Rustom trailer | Sakshi
Sakshi News home page

దేశభక్తుడా.. విద్రోహా.. హంతకుడా..?

Published Thu, Jun 30 2016 10:38 AM | Last Updated on Mon, Sep 4 2017 3:49 AM

దేశభక్తుడా.. విద్రోహా.. హంతకుడా..?

దేశభక్తుడా.. విద్రోహా.. హంతకుడా..?

బాలీవుడ్ యాక్షన్ స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ పీరియాడికల్ డ్రామా రుస్తుం. 1959లో నేవీలో సేవలందించిన ఆఫీసర్ కేఎం నానావతి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో అక్షయ్ కుమార్ నేవీ ఆఫీసర్ రుస్తుం పవ్రీగా నటిస్తున్నాడు. అక్షయ్ సరసన ఇలియానా హీరోయిన్గా నటిస్తోంది.

1959 నాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్టుగా తెరకెక్కించారు దర్శకుడు టిను సురేష్ దేశాయ్. జీ టివి సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకొని రిలీజ్కు రెడీ అవుతోంది. ఆగస్టు 12న గ్రాండ్ రిలీజ్కు రెడీ అవుతున్న రుస్తుం థియట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

నావల్ ఆఫీసర్ లుక్లో డాషింగ్గా కనిపిస్తున్న అక్షయ్ ఫస్ట్ లుక్తోనే ఆకట్టుకున్నాడు. ఇక టీజర్లో రుస్తుం దేశభక్తుడా..? విద్రోహా..? హంతకుడా..? అంటూ సంధించిన ప్రశ్నలు సినిమా మీద మరింత ఆసక్తి కలిగిస్తున్నాయి. అక్షయ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న రోబో 2 సినిమాలో విలన్గా నటిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement