‘‘నా మైండ్‌లోని ఆలోచనలు నన్ను మానసికంగా ఎంత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పటికీ ఒక్కసారి నేను వర్కౌట్స్ చేయడం ప్రారంభిస్తే అవన్నీ మాయమైపోతాయి. అంతేకాదు నా లక్ష్యానికి నేను మరింత దగ్గరగా వస్తున్నానన్న భావన కలుగుతుంది’’ అంటున్నారు ఇలియానా. ‘వ్యాయామానికి రోజూ ఎంత సమయం కేటాయిస్తారు? అనే ప్రశ్నను ఇలియానా ముందుంచితే – ‘‘ప్రస్తుతం ఆన్‌లైన్ వర్కౌట్ ప్రోగ్రామ్ చేస్తున్నాను.
ప్రతి రోజూ ఓ కొత్త వర్కౌట్‌ను ట్రై చేస్తున్నాను. నా వర్కౌట్ సమయం అన్ని రోజులూ ఒకేలా ఉండదు. ఒకరోజు 75 నిమిషాలు, మరో రోజు 45 నిమిషాలు.. ఇలా రోజు రోజుకీ తేడా ఉంటుంది. ఒక్కో రోజు జస్ట్ యోగా మాత్రమే చేస్తాను. ఫిట్‌గా ఉండటానికి, మానసిక ఆరోగ్యం బాగుండేందుకు మీరు (అభిమానులు) వర్కౌట్స్ చేసి చూడండి. వచ్చే ఫలితం మీకు సంతోషాన్ని ఇస్తుంది’’ అని పేర్కొన్నారు ఇలియానా.
Comments
Please login to add a commentAdd a comment