
హీరోయిన్ ఇలియానాకు ఓ పోలీసాఫీసర్ ప్రేమసంకెళ్లు వేయబోతున్నారట. రణ్‌దీప్ హుడా హీరోగా ‘ముబారకన్’ (2017), ‘సాండ్ కీ ఆంఖ్’ (2019) చిత్రాలకు స్క్రీన్‌ప్లే అందించిన బిల్విందర్ సింగ్ దర్శకత్వంలో ‘అన్ ఫెయిర్ అండ్ లవ్లీ’ అనే ఓ చిత్రం తెరకెక్కుతోందని బాలీవుడ్ సమాచారం. ఇందులో హీరోయిన్ పాత్రకు ఇలియానాను సంప్రదించగా ఆమె అంగీకరించారని తాజా బాలీవుడ్ కబురు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ హర్యానాలో ప్రారంభమైందట. ఇందులో రణ్‌దీప్ హుడా పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నారని టాక్. త్వరలో ఇలియానా కూడా సెట్‌లో జాయిన్ అవుతారు. అయితే ‘అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ’ చిత్రంలో ముందుగా జోయా హుస్సేన్‌ను (రానా హీరోగా నటించిన తాజా చిత్రం ‘అరణ్య’ చిత్రంలో ఓ కీలకపాత్రలో నటించారు) హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ ఆమె కాల్షీట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఇలియానాను తీసుకున్నారని బాలీవుడ్ వర్గాల కథనం.
Comments
Please login to add a commentAdd a comment