
హెడ్డింగ్ చదివి ఆశ్చర్యపోయారా? మరేం లేదు.. ఇలియానా క«థానాయికగా నటించనున్న కొత్త చిత్రం పేరు అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ. రణ్‌దీప్ హుడా, ఇలియానా జంటగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇలియానా నటించిన ‘ముబారకాన్’ సినిమాకు కథ–స్క్రీన్‌ప్లేను అందించిన బల్వీందర్ సింగ్ జంజ్వా ఈ చిత్రంతో దర్శకునిగా మారుతున్నారు. మన దేశంలో మనిషి రంగు గురించి పదే పదే మాట్లాడుతూ ఉండటాన్ని కథావస్తువుగా తీసుకుని వినోద ప్రధానంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. హర్యానా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో వర్ణ వివక్షపై పోరాడే యువతి పాత్రలో ఇలియానా కనిపిస్తారు.
ఈ సినిమా గురించి ఇలియానా మాట్లాడుతూ– ‘‘హీరోయిన్ తెల్ల బుగ్గలే హీరోకి ఎందుకు అందంగా కనబడతాయో? అయినా ఇదంతా పాత మాట. ఇప్పుడు ‘అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ’ అనేది కొత్త మాట. ఒక బలమైన పాయింట్‌తో దర్శకుడు కథ తయారు చేశారు. అయితే ఏదో బోధించినట్లుగా కాకుండా సినిమా మొత్తాన్ని వినోదాత్మకంగానే చూపించబోతున్నారు. నాకు నచ్చింది అదే. ఒక మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం’’ అన్నారు. ‘‘తెల్లగా ఉన్న అమ్మాయిలంతా అందంగా ఉండాలనేం లేదు, అలాగే అందంగా ఉన్నవాళ్లంతా తెల్లగా ఉండాలని లేదు. అర్థం కాలేదా? మా సినిమా విడుదలయ్యాక అన్నీ అర్థం అవుతాయి. వెయిట్ చేయండి’’ అన్నారు రణ్‌దీప్ హుడా. వచ్చే నెల ఈ చిత్రం షూటింగ్‌ని ఆరంభించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment