
‘దేవదాసు’ చిత్రంతో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమయ్యారు గోవా బ్యూటీ ఇలియానా. ఆమె టాలీవుడ్‌కి వచ్చి 12ఏళ్లు అవుతున్నా ఇప్పటి వరకూ తన పాత్రకు డబ్బింగ్ చెప్పలేదు. తాజాగా ‘అమర్ అక్బర్ ఆంటొని’ సినిమా కోసం తొలిసారి తెలుగు పలుకులు పలుకుతున్నారామె. రవితేజ, ఇలియానా జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటొని’. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 16న విడుదలవుతోంది.
ఆరేళ్ల కిందట విడుదలైన ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రం తర్వాత బాలీవుడ్ వెళ్లిన ఇలియానా ‘అమర్ అక్బర్ ఆంటొని’ సినిమాతో టాలీవుడ్‌కి రీ–ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో ఇలియానా చేసిన పాత్రకు ఆమెతోనే డబ్బింగ్ చెప్పించాలని శ్రీను వైట్ల అనుకున్నారు. నాలుగు రోజుల్లోనే ఇలియానా డబ్బింగ్ పార్ట్‌ని పూర్తి చేయడం విశేషం. ఈ సినిమా ప్రీ–రిలీజ్ ఫంక్షన్‌ని రేపు (శనివారం) నిర్వహించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: వెంకట్ సి.దిలీప్, సహనిర్మాత: ప్రవీణ్ మార్పురి.
Comments
Please login to add a commentAdd a comment