
క్రైమ్ డ్రామాలో మధ్యమధ్య వచ్చే రొమాన్స్.. హృదయంపై పూలజల్లులా కురుస్తుంది. మార్చి 16న వస్తున్న బాలీవుడ్ మూవీ ‘రైడ్’లో.. 1980ల నాటి హై–ప్రొఫైల్ ఐటీ దాడుల మధ్య అజయ్‌దేవగణ్, ఇలియానా డిసౌజాల మధ్య కనిపించబోయే ప్రణయ సన్నివేశం అలాంటి పూలజల్లే. లక్నోలోని గోమతీ నదీతీరంలో ఈ భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలను స్వర్గీయ స్వరకారుడు నుస్రత్ ఫలే అలీఖాన్ మేనల్లుడు రహత్ ఫతే అలీఖాన్ స్వరబద్ధం చేశారు.
నుస్రత్ పాపులర్ సాంగ్ ‘సను ఏక్ పల్..’ గీతానికిది పునఃసృష్టి. సరిగ్గా వాలెంటైన్స్ వేళకు గాలిలో లీలగా వినిపిస్తున్న ఈ ప్రేమాలాపనను మొదట వేరే చిత్రం కోసం తీసిపెట్టుకున్నారు. అనుకోకుండా ఇది అజయ్‌దేవగణ్ చెవుల్లో పడి, ఆయన బలవంతంపై ‘రైడ్’లోకి వచ్చేసింది! ‘నా ప్రియతమా, నువ్వు లేకుండా నా మనసుకు శాంతి లేదు. నువ్వు లేకుండా నా హృదయానికి స్పందన లేదు’ అని ఈ పాటకు అర్థం.
Comments
Please login to add a commentAdd a comment