సోలోగా చిందేస్తున్న మెగాస్టార్ | no heroine for chiranjeevi in bruceli | Sakshi
Sakshi News home page

సోలోగా చిందేస్తున్న మెగాస్టార్

Published Fri, Sep 11 2015 11:56 AM | Last Updated on Sun, Sep 3 2017 9:12 AM

సోలోగా చిందేస్తున్న మెగాస్టార్

సోలోగా చిందేస్తున్న మెగాస్టార్

చాలా రోజులుగా తన 150వ సినిమా విషయంలో ఊరిస్తూ వస్తున్న మెగాస్టార్ చిరంజీవి కథ కుదరకపోవటంతో మనసు మార్చుకున్నాడు. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న 'బ్రూస్లీ' సినిమాలో అతిథి పాత్రలో అలరించనున్నాడు. తొలుత సినిమాలో చిన్న సీన్ మాత్రమే చేస్తాడని భావించినా, చిరు ఎంట్రీ తో సినిమాకు వస్తున్న హైప్ గుర్తించి  మెగాస్టార్ తో ఓ పాట కూడా చేయించాలని డిసైడ్ అయ్యారు చిత్రయూనిట్.

చాలా రోజుల తరువాత చిరంజీవి వెండితెర మీద చిందేస్తుండటంతో ఆ పాట గ్రాండ్ గా తెరకెక్కించడానికి అన్ని రకాలా ఏర్పాట్లు చేస్తోంది బ్రూస్లీ టీం. చిరుతో పోటీగా చిందేసే అందాల భామ కోసం చాలామంది హీరోయిన్లను పరిశీలించి ఫైనల్ గా గోవా బ్యూటి ఇలియానాకు ఫిక్స్ అయ్యారు. ఈ సాంగ్ కోసం ఇలియానాకు భారీ రెమ్యూనరేషన్ ఇవ్వటానికి కూడా రెడీ అయ్యారు. అయితే చిరు రీ ఎంట్రీ సాంగ్ కావటంతో పార్టనర్ లేకుండా చిరు ఒక్కడు చిందేస్తేనే ఆడియన్స్ కు కిక్ ఉంటుందని భావించిన మూవీ టీం చిరుతో సోలో సాంగ్ చేయించాలని భావిస్తున్నారట.

ప్రస్తుతానికి యూనిట్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోయినా బ్రూస్లీ సినిమాలో చిరు చేయబోయేది సోలో సాంగ్ అన్నది కన్ఫామ్ అన్న టాక్ వినిపిస్తుంది. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. రామ్చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement