srinuvaitla
-
ఇటలీలో ఆటాపాటా
గోపీచంద్ ఇటలీకి మకాం మార్చారు. శ్రీనువైట్ల దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చిత్రాలయం స్టూడియోస్ పతాకంపై వేణు దోనెపూడి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆదివారం (సెప్టెంబరు 24) శ్రీనువైట్ల బర్త్ డే. ఈ సందర్భంగా ఇటలీలో శ్రీనువైట్ల అండ్ టీమ్ లొకేషన్స్‌ను ఫైనలైజ్ చేస్తున్న వీడియోను చిత్రయూనిట్ విడుదల చేసింది. నేటి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సౌత్ ఇటలీలోని మాంటెరా లొకేషన్స్‌లో ప్రారంభం కానుంది. మేజర్ షూటింగ్‌ను విదేశాల్లోనే కంప్లీట్ చేస్తారట చిత్రయూనిట్. గోపీచంద్‌పై ముందుగా ఓ యాక్షన్ సీన్‌ను ప్లాన్ చేశారట శ్రీనువైట్ల. ఆ తర్వాత ఓ పాటని కూడా చిత్రీకరించనున్నారని భోగట్టా. ఈ చిత్రంలో కావ్యాథాపర్ హీరోయిన్గా నటిస్తారనే ప్రచారం సాగుతోంది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. -
‘అమర్ అక్బర్ ఆంటొని’ కాన్సెప్ట్ పోస్టర్
రవితేజ హీరోగా నటిస్తున్న ‘అమర్ అక్బర్ ఆంటొని’ కాన్సెప్ట్ పోస్టర్ విడుదలైంది. శీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతుంది ఈ చిత్రం. కాన్సెప్ట్ పోస్టర్ ని చాలా ఆసక్తికరంగా డిజైన్ చేసాడు దర్శకుడు శ్రీనువైట్ల. ఓ ఉంగరం.. రాజు రాణి బొమ్మలతో డిజైన్ చేసిన టైటిల్ లోగో సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం అమెరికాలో జరుగుతుంది. ప్రస్తుతం న్యూయార్క్ లో షెడ్యూల్ జరుగుతుంది. లాంగ్ గ్యాప్ తరువాత ఇలియానా ఈ చిత్రంతో టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇస్తున్నారు.విజయ్ సి దిలీప్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న మైత్రి మూవీ మేకర్స్ అమర్ అక్బర్ ఆంటొనిని నిర్మిస్తున్నారు. అక్టోబర్ 5న ఈ చిత్రం విడుదల కానుంది. -
‘ఇష్టంగా సంతోషంగా ఆనందంగా’
రచయితలుగా ఘనవిజయాలు సాధించిన చాలా మంది సినీ ప్రముఖులు దర్శకులుగానూ సత్తా చాటుతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ లాంటి వారు టాప్ డైరెక్టర్స్‌గా ఎదిగారు. తాజాగా మరో స్టార్ రైటర్ దర్శకుడిగా మారేందుకు రెడీ అవుతున్నాడు. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన పలు విజయవంతమైన చిత్రాలకు కోన వెంకట్‌తో కలిసి రచయితగా పనిచేసిన గోపీమోహన్ దర్శకుడి తొలి సినిమాను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. చాలా కాలంగా దర్శకుడిగా తొలి ప్రయత్నం చేసేందుకు రెడీ అవుతున్న గోపీమోహన్ ప్రేమికుల రోజు సందర్భంగా మరో అప్ డేట్ ఇచ్చారు. గతంలోనే సినిమా టైటిల్ ‘ఇష్టంగా సంతోషంగా ఆనందంగా’ అని ప్రకటించిన గోపీమోహన్ ‘ఈ కథని ఇష్టంగా సంతోషంగా ఆనందంగా మీకు చెప్పాలని నా మనసు కోరుకుంటోంది. అతి త్వరలో మీకు నచ్చిన తారాగణంతో షూటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తాను. నన్ను ప్రోత్సహిస్తున్న నా మిత్రులకు ,నా ప్రియమైన భాగస్వామికి వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు. ఈ కథని ఇష్టంగా సంతోషంగా ఆనందంగా మీకు చెప్పాలని నా మనసు కోరుకుంటోంది. అతి త్వరలో మీకు నచ్చిన తారాగణంతో షూటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తాను. నన్ను ప్రోత్సహిస్తున్న నా మిత్రులకు ,నా ప్రియమైన భాగస్వామికి వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు. Celebrate Friendship & Love. Happy Valentines Day 💕💐 pic.twitter.com/UeWPqN15PO — Gopi Mohan (@Gopimohan) 14 February 2018 -
మాస్ హీరోతో టాలెంటెడ్ హీరోయిన్
రాజా ది గ్రేట్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రవితేజ, త్వరలో టచ్ చేసి చూడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో పాటు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘నేల టికెట్’ సినిమాలో నటిస్తున్నాడు. నేల టికెట్ తరువాత స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాలో రవితేజ సరసన నివేథా థామస్‌ను హీరోయిన్ గా ఫైనల్ చేసే ఆలోచన ఉన్నారు చిత్రయూనిట్. జెంటిల్మన్, నిన్నుకోరి సినిమాలతో టాలెంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నివేథ.. సినిమాల ఎంపికలో సెలెక్టివ్‌గా ఉంటోంది. వరుసగా హిట్ సినిమాల్లో నటించిన ఈ భామ ప్రస్తుతం తెలుగులో ఒక్క సినిమా కూడా చేయటం లేదు. రవితేజ సినిమాలో తన క్యారెక్టర్ నచ్చటంతో నటించేందుకు అంగీకరించిందట నివేథ. ఈ సినిమాలో రవితేజ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు ‘అమర్ అక్బర్ ఆంటోని’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. నీ కోసం, వెంకీ, దుబాయ్ శీను లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను అందించిన రవితేజ, శ్రీనువైట్ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కావటంతో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. కొంతకాలంగా ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్న శ్రీనువైట్ల ఈ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు. -
న్యూ ఇయర్‌కి టీజర్, సంక్రాంతికి ట్రైలర్
ఈ ఏడాది కొత్త సంవత్సరం వేడుకల్లో సందడి అంతా మెగా హీరోలదే కనిపిస్తోంది. ఇప్పటికే చిరు, పవన్‌లు కొత్త సినిమాలతో హవా చూపిస్తుండగా ఇప్పుడు రేసులోకి యంగ్ మెగా హీరోలు కూడా చేరిపోయారు. చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150 సింగిల్స్ యూట్యూబ్ రికార్డ్ల దుమ్ముదులుపుతున్నాయి. రేసులోకి వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రీ లుక్, ఫస్ట్ లుక్లతో హవా చూపిస్తున్నాడు. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఈ రేసులోకి అడుగుపెట్టాడు. కొత్త ఏడాదికి రెండు రోజుల ముందే తన కొత్త సినిమా మిస్టర్ టైటిల్ లోగోను రిలీజ్ చేసిన వరుణ్, న్యూ ఇయర్ రోజు టీజర్‌ను రిలీజ్ చేస్తున్నాడు. ఈ సినిమా స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. సినిమా రిలీజ్‌కు చాలా సమయం ఉండటంతో సంక్రాంతికి ట్రైలర్‌ను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అదే సమయంలో మరో మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న విన్నర్ సినిమా ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
ఒకే బ్యానర్లో రెండు సినిమాలు
వరుస ఫెయిల్యూర్స్‌తో కష్టాల్లో పడ్డ శ్రీనువైట్ల ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాడు. రచయితలతో వివాదాలు, తరువాత మహేష్ బాబుతో చేసిన ఆగడు సినిమా ఫెయిలవ్వటం, తిరిగి కోన టీంతో కలిసినా.. బ్రూస్ లీ సినిమా పరాజయం పాలవ్వటం లాంటి సమస్యల తరువాత శ్రీనువైట్ల డీలా పడిపోయాడు. కొద్ది రోజులుగా మీడియాకు దూరంగా ఉంటున్న శ్రీనువైట్ల తిరిగి సినిమా మొదలెట్టే ఆలోచనలో ఉన్నాడు. జ్యోతిలక్ష్మి సినిమాతో నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సి.కళ్యాణ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్, వరుణ్ తేజ్‌ల కాంభినేషన్లో లోఫర్ సినిమాను నిర్మించాడు. ఈ నెల 17న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా సక్సెస్ మీద ఎంతో నమ్మకంగా ఉన్న కళ్యాణ్ తరువాత శ్రీనువైట్ల దర్శకత్వలో సినిమా నిర్మించడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఫెయిల్యూర్స్‌లో ఉన్నా.. దర్శకుడిగా శ్రీనువైట్లకు స్టార్ ఇమేజే ఉంది. ఈ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని వరుసగా రెండు సినిమాలు చేయడానికి అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు కళ్యాణ్. మరి ఈ సినిమాలతో అయిన శ్రీనువైట్ల సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి. -
శ్రీనువైట్లపై భార్య ఫిర్యాదు, విత్‌డ్రా!
హైదరాబాద్ ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్లపై గృహహింస కేసు నమోదు అయింది. తన భర్త వేధిస్తున్నారంటూ శ్రీనువైట్ల భార్య సంతోష రూప వారం క్రితం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు 498/A, 323A సెక్షన్ల కేసు నమోదు చేశారు. శ్రీనువైట్ల మానసికంగా చిత్రహింసలకు గురి చేయటంతో పాటు, భౌతిక దాడికి పాల్పిడినట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే వారిద్దరి మధ్య పెద్దలు రాజీ కుదిర్చినట్లు సమాచారం. దీంతో సంతోష రూప తన ఫిర్యాదును ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన 'బ్రూస్ లీ' సక్సెస్ టాక్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. -
నెట్లో చిరు సీన్ లీక్
ఎన్నో రోజులుగా మెగా అభిమానులు ఎదురుచూస్తున్న పండగరోజు రానే వచ్చింది. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన బ్రూస్ లీ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చేశాడు. సినిమా రిజల్ట్ సంగతి ఎలా ఉన్నా, బ్రూస్ లీ లో చిరు చేసిన క్యారెక్టర్‌కు మాత్రం భారీ స్పందన వస్తోంది. అభిమానులు కూడా తమ అభిమాన కథనాయకుడిని చాలా రోజుల తరువాత వెండితెర మీద చూసి పండగ చేసుకుంటున్నారు. కొంత మంది అభిమానులు అత్యుత్సాహంతో చిరు ఎంట్రీ సీన్‌ను సెల్ ఫోన్ కెమెరాల్లో బందించి సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు. అయితే వెంటనే స్పందించిన చిత్రయూనిట్, ఆ వీడియోలను తొలగించే పనిలో ఉన్నారు. చిరు 150వ సినిమాకు టీజర్‌గా చిరు చేసిన స్పెషల్ క్యారెక్టర్ మెగాస్టార్ మెగా లాంచ్‌కు మంచి కిక్ ఇచ్చింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన బ్రూస్ లీ, డివైడ్ టాక్ తో స్టార్ట్ అయినా వసూళ్ల పరంగా మాత్రం మంచి రిజల్ట్స్ చూపిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లో కూడా సత్తా చాటుతున్న బ్రూస్ లీ మెగా అభిమానులను అలరిస్తోంది. -
'బ్రూస్ లీ' మూవీ రివ్యూ
టైటిల్: బ్రూస్ లీ జానర్: ఫ్యామిలీ యాక్షన్ డ్రామా తారాగణం: రామ్ చరణ్, చిరంజీవి (అతిథి పాత్ర), రకుల్ ప్రీత్ సింగ్, కృతీకర్బందా దర్శకత్వం: శ్రీనువైట్ల సంగీతం: ఎస్ ఎస్ థమన్ నిర్మాత: డివివి దానయ్య గోవిందుడు అందరివాడేలే సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న రామ్ చరణ్ మరోసారి ఫ్యామిలీ డ్రామానే నమ్ముకొని చేసిన సినిమా బ్రూస్ లీ. మెగా అభిమానులకు నచ్చే మాస్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉన్న ఈ సినిమా సక్సెస్ మీద చిత్రయూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ముఖ్యంగా చిరు గెస్ట్ అప్పియరెన్స్ కూడా సినిమా మీద అంచనాలను భారీగా పెంచింది. ఆగడు లాంటి డిజాస్టర్ తరువాత శ్రీను వైట్ల తనని తాను ప్రూవ్ చేసుకోవటానికి తెరకెక్కించిన సినిమా బ్రూస్ లీ. ఇలా అన్ని రకాలుగా భారీ అంచనాలు ఉన్న బ్రూస్ లీ ఆడియన్స్‌ను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం.. కథ: చిన్నప్పటి నుంచి బ్రూస్ లీ యాక్షన్ చూసి ఆకర్షితుడైన హీరో కార్తీక్ (రామ్ చరణ్) తన పేరును కూడా బ్రూస్ లీగా మార్చేసుకుంటాడు. కార్తీక్‌ది అందమైన కుటుంబం అమ్మ (పవిత్ర లోకేష్), నాన్న రామచంద్రరావు (రావు రమేష్), అక్క (కృతి కర్బందా). కార్తీక్ తండ్రి, జయరాజ్ (సంపత్), వసుంధర (నదియా)కు చెందిన వసుంధర ల్యాబ్స్‌లో పనిచేస్తుంటాడు. అదే సమయంలో కార్తీక్ కూడా స్టంట్ మాస్టర్‌గా పనిచేస్తూ తండ్రికి సహాయపడుతుంటాడు. వీడియో గేమ్ డెవలపర్ రియా (రకుల్ ప్రీత్ సింగ్)కు పోలీస్‌నే పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉంటుంది. అయితే అదే సమయంలో కార్తీక్‌ను చూసిన రియా తొలిచూపులోనే ఇష్టపడుతుంది. కార్తీక్‌నే హీరోగా పెట్టి ఓ గేమ్ డెవలప్ చేస్తుంది. అదే సమయంలో పోలీస్‌నే పెళ్లి చేసుకోవాలనే తన పిచ్చి వల్ల అనుకోని సమస్యలను ఎదుర్కొంటుంది. ఆ సమస్యల నుంచి రియాను కాపాడాలనుకున్న కార్తీక్... దీపక్ రాజ్ (అరుణ్ విజయ్) గ్యాంగ్‌తో గొడవ పడతాడు. వసుంధర ల్యాబ్స్‌లో పనిచేస్తున్న రామచంద్రరావు కూతురు కృతిని ఆ కంపెనీ ఓనర్ జయరాజ్ తన కోడలిగా చేసుకోవాలనుకుంటాడు. ఆ సమయంలో జయరాజ్‌కు సంబందించి కొన్ని నిజాలు బయటికి వస్తాయి. ఒకేసారి జయరాజ్, దీపక్ రాజ్‌ల నుంచి కార్తీక్ కుటుంబానికి సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యల నుంచి కార్తీక్ అలియాస్ బ్రూస్ లీ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు, అసలు విలన్లతో బ్రూస్ లీకి ఉన్న శతృత్వం ఏంటి. అన్నదే మిగతా కథ. నటీనటులు : రామ్ చరణ్ ఈ సినిమాలో చాలా ఫ్రెష్ లుక్ లో కనిపించాడు. గత సినిమాల మాదిరిగానే డ్యాన్స్‌లు, ఫైట్లలో తన మార్క్ చూపించాడు. అయితే కొత్తగా కామెడీ ట్రై చేసిన చరణ్ మంచి విజయం సాధించాడు. నటనకు పెద్దగా అవకాశం లేకపోయినా రకుల్ తన అందాలతో మాత్రం బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా పాటల్లో రకుల్ చేసిన గ్లామర్ షో సినిమాకు బిగెస్ట్ ప్లస్ పాయింట్. చెర్రీ సిస్టర్‌గా కృతి ఆకట్టుకుంది. తన పరిధి మేరకు మెప్పించింది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అరుణ్ విజయ్ చిన్న పాత్రే అయినా ఆకట్టుకున్నాడు. యంగ్ విలన్ గా మెప్పించాడు. బ్రహ్మనందం కామెడీ రొటీన్‌గా ఉంది. రావు రమేష్, పవిత్రా లోకేష్, సంపత్, నదియా, బ్రహ్మజీ, పోసాని కృష్ణమురళి మెప్పించారు. సినిమాకు మెయిన్ హైలైట్ చిరు గెస్ట్ అప్పియరెన్స్, ఆరేళ్ల తరువాత మేకప్ వేసుకున్న చిరు ఏజ్ ఏ మాత్రం పెరగలేదా అనిపించాడు. పర్ఫార్మెన్స్‌లోనూ యాక్షన్ సీక్వన్స్లోనూ చెర్రీకి పోటీ ఇచ్చి 150 సినిమా మీద ఆశలు కల్పించాడు. ఇక 'జస్ట్ టైం గ్యాప్ అంతే, టైమింగ్‌లో మాత్రం గ్యాప్ ఉండదు' లాంటి పంచ్‌లు విసిరిన చిరు 5 నిమిషాల పాటు థియేటర్లలో కేక పెట్టించాడు. సాంకేతిక నిపుణులు : ఆగడు తరువాత శ్రీను వైట్ల చేస్తున్న సినిమా కావటంతో రూట్ మార్చి కొత్త తరహా కథ చేస్తాడని భావించిన ఆడియన్స్‌కు నిరాశే కలుగుతుంది. మరోసారి రొటీన్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శ్రీను. అయితే కథనంలో మాత్రం తన మార్క్‌తో ఆకట్టుకున్నాడు. ఫస్టాఫ్ వరకు బాగానే సాగినా, సెకండాఫ్‌లో మాత్రం ఆడియన్ను కథతో కనెక్ట్ చేయలేకపోయారు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. తక్కువ టైంలోనే మంచి అవుట్ పుట్ ఇచ్చాడు మనోజ్ పరమహంస. పాటలు, నేపధ్య సంగీతం ఓ కమర్షియల్ సినిమాకు కావాల్సిన స్థాయిలో ఉన్నాయి. సెకండాఫ్ లో ఇంకాస్త ఎడిట్ చేసి ఉంటే బాగుండనిపించింది. ఫైట్స్ బ్రూస్ లీ అన్న టైటిల్ ను జస్టిఫై చేసేలా ఉన్నాయి. విశ్లేషణ : రొటీన్ కథ కథనాలకు కొత్త సాంకేతిక జోడించి తెరకెక్కించిన సినిమా బ్రూస్ లీ. క్వాలిటీ పరంగా మెప్పించినా, అభిమానులు ఆశించిన స్ధాయి సినిమాగా అలరించలేకపోయింది. ముఖ్యంగా సినిమాలో కీలకమైన ట్విస్ట్‌ను ఫస్టాఫ్‌లోనే రివీల్ చేయటంతో సెకాండఫ్ ఇంట్రస్టింగ్‌గా అనిపించదు. ఇక కామెడీతో పాటు సిస్టర్ సెంటిమెంట్ కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. కొన్ని పాత్రలకు సరైన జస్టిఫికేషన్ ఇవ్వలేకపోవటం కూడా సినిమాకు మైనస్. ఫస్టాఫ్ మాస్ ఆడియన్స్‌ను మెప్పించటంతో పాటు, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ చాలా బాగా రావటంతో ఆడియన్స్ కాస్త సంతృప్తి పడతారు. ప్లస్ పాయింట్స్: చిరంజీవి గెస్ట్ అప్పియరెన్స్ చరణ్ ఫ్రెష్ లుక్ రకుల్ గ్లామర్ సినిమాటోగ్రఫీ మైనస్ పాయింట్స్ : సెకండాఫ్ కామెడీ ట్రాక్ ఎడిటింగ్ ఓవరాల్ గా బ్రూస్ లీ మెగా అభిమానులను మెప్పించే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ -
నిర్మాణ రంగంలోనూ మెగా మార్క్
యంగ్ హీరో రామ్ చరణ్ హీరోగానే గాక నిర్మాణ రంగంలోనూ తన మార్క్ చూపించాలనుకుంటున్నారు. అందుకే ఒకేసారి రెండు నిర్మాణ సంస్థలను స్థాపించి నిర్మాణం రంగంలోనూ హవా కొనసాగించాలనుకుంటున్నారు. చిరు రీ ఎంట్రీ సినిమాను తన సొంతం నిర్మాణ సంస్థ ద్వారా తెరకెక్కిస్తున్న చరణ్, తరువాత కూడా వరుసగా సినిమాలు నిర్మించడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. చిరు 150 వ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్న చరణ్.. వైట్ హార్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చిన్న సినిమాలను నిర్మించడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ బ్యానర్‌పై 5 కోట్ల లోపు బడ్జెట్‌తో సినిమాలను తెరకెక్కించనున్నారు. ఈ బ్యానర్ ద్వారా కొత్త నటీనటులను, దర్శకులను, సాంకేతిక నిపుణులను పరిచయం చేయడానికి రెడీ అవుతున్నారు మెగా పవర్ స్టార్. చరణ్ ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన బ్రూస్ లీ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. అక్టోబర్ 16న రిలీజ్ అవుతున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. -
సోలోగా చిందేస్తున్న మెగాస్టార్
చాలా రోజులుగా తన 150వ సినిమా విషయంలో ఊరిస్తూ వస్తున్న మెగాస్టార్ చిరంజీవి కథ కుదరకపోవటంతో మనసు మార్చుకున్నాడు. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న 'బ్రూస్లీ' సినిమాలో అతిథి పాత్రలో అలరించనున్నాడు. తొలుత సినిమాలో చిన్న సీన్ మాత్రమే చేస్తాడని భావించినా, చిరు ఎంట్రీ తో సినిమాకు వస్తున్న హైప్ గుర్తించి మెగాస్టార్ తో ఓ పాట కూడా చేయించాలని డిసైడ్ అయ్యారు చిత్రయూనిట్. చాలా రోజుల తరువాత చిరంజీవి వెండితెర మీద చిందేస్తుండటంతో ఆ పాట గ్రాండ్ గా తెరకెక్కించడానికి అన్ని రకాలా ఏర్పాట్లు చేస్తోంది బ్రూస్లీ టీం. చిరుతో పోటీగా చిందేసే అందాల భామ కోసం చాలామంది హీరోయిన్లను పరిశీలించి ఫైనల్ గా గోవా బ్యూటి ఇలియానాకు ఫిక్స్ అయ్యారు. ఈ సాంగ్ కోసం ఇలియానాకు భారీ రెమ్యూనరేషన్ ఇవ్వటానికి కూడా రెడీ అయ్యారు. అయితే చిరు రీ ఎంట్రీ సాంగ్ కావటంతో పార్టనర్ లేకుండా చిరు ఒక్కడు చిందేస్తేనే ఆడియన్స్ కు కిక్ ఉంటుందని భావించిన మూవీ టీం చిరుతో సోలో సాంగ్ చేయించాలని భావిస్తున్నారట. ప్రస్తుతానికి యూనిట్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోయినా బ్రూస్లీ సినిమాలో చిరు చేయబోయేది సోలో సాంగ్ అన్నది కన్ఫామ్ అన్న టాక్ వినిపిస్తుంది. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. రామ్‌చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తుంది.