‘అమర్‌ అక్బర్‌ ఆంటొని’ కాన్సెప్ట్‌ పోస్టర్‌ | Amar Akbar Anthony Concept Poster Release | Sakshi
Sakshi News home page

Published Wed, Aug 15 2018 1:43 PM | Last Updated on Wed, Aug 15 2018 1:46 PM

Amar Akbar Anthony Concept Poster Release - Sakshi

ర‌వితేజ హీరోగా న‌టిస్తున్న ‘అమ‌ర్ అక్బర్ ఆంటొని’ కాన్సెప్ట్ పోస్టర్ విడుద‌లైంది. శీనువైట్ల ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కుతుంది ఈ చిత్రం. కాన్సెప్ట్ పోస్టర్ ని చాలా ఆస‌క్తిక‌రంగా డిజైన్ చేసాడు ద‌ర్శకుడు శ్రీనువైట్ల‌. ఓ ఉంగ‌రం.. రాజు రాణి బొమ్మలతో డిజైన్‌ చేసిన టైటిల్ లోగో సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది. 

ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం అమెరికాలో జ‌రుగుతుంది. ప్రస్తుతం న్యూయార్క్ లో షెడ్యూల్ జ‌రుగుతుంది. లాంగ్‌ గ్యాప్‌ తరువాత ఇలియానా ఈ చిత్రంతో టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇస్తున్నారు.విజ‌య్ సి దిలీప్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండ‌గా.. హ్యాట్రిక్ విజ‌యాల‌తో దూసుకుపోతున్న మైత్రి మూవీ మేక‌ర్స్ అమ‌ర్ అక్బర్ ఆంటొనిని నిర్మిస్తున్నారు. అక్టోబ‌ర్ 5న ఈ చిత్రం విడుద‌ల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement