ఇటలీలో ఆటాపాటా | Director Sreenu Vaitla and Gopichand to Begin Shoot In Italy | Sakshi
Sakshi News home page

ఇటలీలో ఆటాపాటా

Published Mon, Sep 25 2023 3:46 AM | Last Updated on Mon, Sep 25 2023 3:46 AM

Director Sreenu Vaitla and Gopichand to Begin Shoot In Italy - Sakshi

గోపీచంద్‌ ఇటలీకి మకాం మార్చారు. శ్రీనువైట్ల దర్శకత్వంలో గోపీచంద్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చిత్రాలయం స్టూడియోస్‌ పతాకంపై వేణు దోనెపూడి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆదివారం (సెప్టెంబరు 24) శ్రీనువైట్ల బర్త్‌ డే. ఈ సందర్భంగా ఇటలీలో శ్రీనువైట్ల అండ్‌ టీమ్‌ లొకేషన్స్‌ను ఫైనలైజ్‌ చేస్తున్న వీడియోను చిత్రయూనిట్‌ విడుదల చేసింది.

నేటి నుంచి ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ సౌత్‌ ఇటలీలోని మాంటెరా లొకేషన్స్‌లో ప్రారంభం కానుంది. మేజర్‌ షూటింగ్‌ను విదేశాల్లోనే కంప్లీట్‌ చేస్తారట చిత్రయూనిట్‌. గోపీచంద్‌పై ముందుగా ఓ యాక్షన్‌ సీన్‌ను ప్లాన్‌ చేశారట శ్రీనువైట్ల. ఆ తర్వాత ఓ పాటని కూడా చిత్రీకరించనున్నారని భోగట్టా. ఈ చిత్రంలో కావ్యాథాపర్‌ హీరోయిన్‌గా నటిస్తారనే ప్రచారం సాగుతోంది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement