మాస్‌ హీరోతో టాలెంటెడ్‌ హీరోయిన్‌ | Raviteja to romance with Nivetha Thomas | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 30 2018 2:31 PM | Last Updated on Tue, Jan 30 2018 2:34 PM

Nivetha Thomas Raviteja - Sakshi

నివేథ థామస్‌, రవితేజ

రాజా ది గ్రేట్ సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న రవితేజ, త్వరలో టచ్ చేసి చూడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో పాటు కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో ‘నేల టికెట్‌’ సినిమాలో నటిస్తున్నాడు. నేల టికెట్‌ తరువాత స్టార్ డైరెక్టర్‌ శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించనున్న ఈ సినిమాలో రవితేజ సరసన నివేథా థామస్‌ను హీరోయిన్‌ గా ఫైనల్‌ చేసే ఆలోచన ఉన్నారు చిత్రయూనిట్‌. 

జెంటిల్‌మన్‌, నిన్నుకోరి సినిమాలతో టాలెంటెడ్‌ హీరోయిన్‌ గా పేరు తెచ్చుకున్న నివేథ.. సినిమాల ఎంపికలో సెలెక్టివ్‌గా ఉంటోంది. వరుసగా హిట్ సినిమాల్లో  నటించిన ఈ భామ ప్రస్తుతం తెలుగులో ఒక్క సినిమా కూడా చేయటం లేదు. రవితేజ సినిమాలో తన క్యారెక్టర్‌ నచ్చటంతో నటించేందుకు అంగీకరించిందట నివేథ. ఈ సినిమాలో రవితేజ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు ‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’ అనే టైటిల్‌ ను పరిశీలిస్తున్నారు. 

నీ కోసం, వెంకీ, దుబాయ్ శీను లాంటి సక్సెస్‌ ఫుల్ చిత్రాలను అందించిన రవితేజ, శ్రీనువైట్ల కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కావటంతో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్‌ అయ్యింది. కొంతకాలంగా ఫెయిల్యూర్స్‌ తో ఇబ్బంది పడుతున్న శ్రీనువైట్ల ఈ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement