ఒకే బ్యానర్లో రెండు సినిమాలు | srinuvaitla 2 films in c kalyan banner | Sakshi
Sakshi News home page

ఒకే బ్యానర్లో రెండు సినిమాలు

Published Sun, Dec 13 2015 12:24 PM | Last Updated on Sun, Sep 3 2017 1:57 PM

ఒకే బ్యానర్లో రెండు సినిమాలు

ఒకే బ్యానర్లో రెండు సినిమాలు

వరుస ఫెయిల్యూర్స్తో కష్టాల్లో పడ్డ శ్రీనువైట్ల ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాడు. రచయితలతో వివాదాలు, తరువాత మహేష్ బాబుతో చేసిన ఆగడు సినిమా ఫెయిలవ్వటం, తిరిగి కోన టీంతో కలిసినా.. బ్రూస్ లీ సినిమా పరాజయం పాలవ్వటం లాంటి సమస్యల తరువాత శ్రీనువైట్ల డీలా పడిపోయాడు. కొద్ది రోజులుగా మీడియాకు దూరంగా ఉంటున్న శ్రీనువైట్ల తిరిగి సినిమా మొదలెట్టే ఆలోచనలో ఉన్నాడు.

జ్యోతిలక్ష్మి సినిమాతో నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సి.కళ్యాణ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్, వరుణ్ తేజ్ల కాంభినేషన్లో లోఫర్ సినిమాను నిర్మించాడు. ఈ నెల 17న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా సక్సెస్ మీద ఎంతో నమ్మకంగా ఉన్న కళ్యాణ్ తరువాత శ్రీనువైట్ల దర్శకత్వలో సినిమా నిర్మించడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఫెయిల్యూర్స్లో ఉన్నా.. దర్శకుడిగా శ్రీనువైట్లకు స్టార్ ఇమేజే ఉంది. ఈ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని వరుసగా రెండు సినిమాలు చేయడానికి అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు కళ్యాణ్. మరి ఈ సినిమాలతో అయిన శ్రీనువైట్ల సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement