పెళ్లయిందని అక్క, వదిన పాత్రలు ఇస్తున్నారు! | Ileana Fires On Media On her Secret Life With Andrew Kneebone | Sakshi
Sakshi News home page

అవి వ్యక్తిగతం!

Published Mon, Jun 11 2018 8:57 AM | Last Updated on Mon, Jun 11 2018 12:13 PM

Ileana Fires On Media On her Secret Life With Andrew Kneebone - Sakshi

ఆండ్రూతో ఇలియానా

తమిళసినిమా: సంచలన నటీమణుల్లో ఇలియానా ఒకరని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే మీడియాపై విరుచుకుపడటం కూడా ఈ అమ్మడికి అలవాటే. టాలీవుడ్‌లో హీరోయిన్‌గా నటిస్తున్నప్పుడు ఎలాంటి ఆరోపణలు చేయని ఈ బ్యూటీ ఎప్పుడైతే బాలీవుడ్‌కు మూటాముల్లు సర్దుకుందో అప్పటి నుంచి దక్షిణాది చిత్రపరిశ్రమపై విమర్శలు గుప్పించడం మొదలెట్టింది. ఒక టైమ్‌లో కోలీవుడ్‌ను పట్టించుకోలేదు. అలాంటిది బాలీవుడ్‌లోనూ ఈ జాణను పక్కన పెట్టేయడంతో ఇప్పుడు మళ్లీ దక్షిణాదిపై దృష్టి సారించింది. అలా ఒక తెలుగు చిత్రంలో నటించే అవకాశాన్ని కూడా దక్కించుకుంది. తమిళంలో విజయ్‌ నటించిన తెరి చిత్ర తెలుగు రీమేక్‌లో రవితేజకు జంటగా నటించనుంది. ఇలియానా ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ నిపోన్‌ అనే అతనితో ప్రేమ కలాపాలు సాగిస్తున్నట్లు మీడియా కోడైకూస్తోంది.

ఇలియానా ఆండ్రూతో చెట్లాపట్టాలేసుకుని తిరుగుతుండడమే ఈ ప్రచారానికి కారణం. అయితే ఇటీవల ఇలియానా తన బాయ్‌ఫ్రెడ్‌ను రహస్యంగా పెళ్లి చేసుకుందనే ప్రచారం సోషల్‌మీడియాల్లో హల్‌చల్‌ చేస్తోంది. దీని గురించి అడిగితే ఇలియానా ఆగ్రహంతో ఊగిపోతోంది. ఆమె ఏమంటుందో చూద్దాం. ప్రేమ,పెళ్లి అన్నది నా వ్యక్తిగతం. ఈ విషయం గురించి మీడియా, సినిమా వాళ్లు ఎందుకు ఆసక్తి చూపుతున్నారు?  పెళ్లయిన నటి అని అక్క, వదిన పాత్రల్లో నటింపజేయాలని చూస్తున్నారా? నేను ఇంకా చాలా కాలం కథానాయకిగానే నటిస్తాను. దీన్ని నిరూపించి చూపిస్తాను. నా ప్రేమ గురించి ఇప్పటి వరకూ ఎక్కడా వెల్లడించలేదు. ఇకపై కూడా చెప్పను. ఇంకా చెప్పాలంటే నా వ్యక్తగత వ్యవహారాల గురించి చర్చంచడానికి ఇష్టపడను. అంటున్న ఇలియానా తన బాయ్‌ఫ్రెండ్‌లో సన్నిహితంగా ఉన్న ఫొటోలను తరచూ ఇంటర్నెట్‌లో విడుదల చేయడం ఎందుకు అని నెటిజన్ల ఇలియానాపై ఎదురుదాడి చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement