
రవితేజ
అమెరికాలో నెల రోజులపాటు ఫుల్ స్పీడ్‌లో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ షూటింగ్‌లో రవితేజ బిజీగా ఉన్నారని తెలుసు. మరి అక్కడ షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసి ఇండియా తిరిగెప్పుడొస్తారు? సరిగ్గా తెలియదు కదా. మేం చెప్తాం. దాదాపు పదేళ్ల తర్వాత శ్రీను వైట్ల, రవితేజ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. ఇలియానా కథానాయికగా నటిస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యర్నేని, మోహన్ చెరుకూరి, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం అమెరికాలో జరుగుతుంది. నెలరోజుల పాటు జరగనున్న ఈ చిత్రీకరణ సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో కంప్లీట్ కానుంది. సెప్టెంబర్ 5న ఇండియా తిరిగిరానున్నారు చిత్రబృందం. ఈ అమెరికా షెడ్యూల్‌తో ఒక్క పాట మినహా షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ఆ మిగిలిన ఒక్క సాంగ్‌ను హైదరాబాద్‌లో షూట్ చేయనున్నారు. సెప్టెంబర్ 27న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం: యస్.యస్. తమన్
Comments
Please login to add a commentAdd a comment