మహేష్కు జోడిగా రీ ఎంట్రీ..? | Mahesh babu to romance ileana in vamsi paidipally movie | Sakshi
Sakshi News home page

మహేష్కు జోడిగా రీ ఎంట్రీ..?

Published Sun, Sep 3 2017 2:35 PM | Last Updated on Sun, Sep 17 2017 6:20 PM

మహేష్కు జోడిగా రీ ఎంట్రీ..?

మహేష్కు జోడిగా రీ ఎంట్రీ..?

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ అందుకొని తరువాత బాలీవుడ్ చెక్కేసిన ముద్దుగుమ్మ ఇలియానాకు ఇంకా బ్యాడ్ టైం కొనసాగుతూనే ఉంది. భారీ ఆశలతో బాలీవుడ్ బాట పట్టిన ఈ భామకు అక్కడ కూడా పెద్దగా అవకాశాలు రాకపోవటంతో సౌత్ వైపు చూస్తోంది. సౌత్లో కొత్త తారలు పాతుకుపోవటంతో ఇలియానాకు ఛాన్స్ ఇచ్చేవారే కరువయ్యారు.

ఇటీవల ఒకటి రెండు బాలీవుడ్ సినిమాలతో పరవాలేదనిపించినా.. వరుస ఆఫర్లు మాత్రం పలకరించలేదు. అయితే తాజాగా ఈ గోవా బ్యూటీకి సౌత్ నుంచి ఓ క్రేజీ ఆఫర్ వచ్చిందన్న టాక్ వినిపిస్తోంది. అది కూడా తన కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ అయిన పోకిరి కాంబినేషన్ లో కావటం విశేషం. ప్రస్తుతం స్పైడర్, భరత్ అనే నేను సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉన్న మహేష్, ఆ తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25వ సినిమా చేయనున్నాడు.

ఇప్పటికే ప్రీ ప్రొడ్రక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమాను దిల్ రాజు, అశ్వినిదత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా లో హీరోయిన్ గా ఇలియానాను తీసుకునే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. పోకిరి సినిమాతో బాక్సాఫీస్ దుమ్ము దిలిపిన ఈ కాంబినేషన్ మరోసారి మ్యాజిక్ రిపీట్ చేసే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. మరి తెలుగు ప్రేక్షకులు మరిచిపోయిన ఇలియానాతో జోడి కట్టేందుకు మహేష్ ఓకె చెప్తాడో.. లేదో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement