మహేశ్ బాబు పక్కా మాస్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటివరకూ ఎన్నో మాస్ పాత్రల్లో కనిపించారు. అయితే ఇప్పుడు చేయబోతున్నది మాస్ కా బాప్‌లా ఉంటుందట. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ చిత్రంలో నటిస్తున్నారు మహేశ్. మరోవైపు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయ్యారు. రాజమౌళి సినిమా ప్రారంభించేలోపు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారట. ఈ సినిమాకి ‘స్టేట్ రౌడీ’ అనే టైటిల్‌ని అనుకుంటున్నట్లు తెలిసింది. ఇందులో మహేశ్ పక్కా మాస్ రౌడీ పాత్రలో కనిపిస్తారట. ఇక ‘స్టేట్ రౌడీ’ అంటే.. గతంలో చిరంజీవి నటించిన ‘స్టేట్ రౌడీ గుర్తుకు రాకమానదు. 1989లో విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. మరి... మహేశ్‌కి ‘స్టేట్ రౌడీ’ టైటిలే షురూ అవుతుందా? వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment