బ్యాంకులకు సంబంధించిన వడ్డీ రేట్లు, వాయిదాలు, రుణాలు, వార్షిక లావాదేవీలు వంటి అంశాలపై విషయ పరిజ్ఞానం పెంచుకునే పనిలో బిజీగా ఉన్నారట కథానాయిక కీర్తీ సురేష్. ఎందుకంటే తన తర్వాతి చిత్రం కోసం ఆమె బ్యాంకు ఉద్యోగినిగా మారబోతున్నారు. మహేశ్‌బాబు హీరోగా ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు కీర్తీ సురేష్. ఇందులో బ్యాంకు ఉద్యోగిని పాత్రలో కీర్తి నటించబోతున్నారని సమాచారం. ఈ సినిమా కథ బ్యాంకు మోసాల బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని, ఒక బ్యాంకు మేనేజర్ తనయుడిగా మహేశ్‌బాబు పాత్ర ఉండబోతుందని టాక్. ఈ ఏడాది చివర్లో షూటింగ్‌ను ఆరంభించాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment