
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు కాలర్ ఎగరేశాడు. మహర్షి మూవీని బ్లాక్‌బస్టర్ హిట్ చేసినందుకు చిత్రబృందంతోపాటు అభిమానులకు థ్యాంక్స్ చెప్పాడు. హైదరాబాద్‌లోని నొవాటెల్ హోటల్‌లో జరిగిన మహర్షి సక్సెస్ మీట్‌లో మహేష్‌తోపాటు మూవీ టీమ్ అంతా పాల్గొంది. ఈ సందర్భంగా దర్శకుడు వంశీ పైడిపల్లి భావోద్వేగానికి గురయ్యారు. తర్వాత మాట్లాడిన మహేష్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపాడు. మూడు భారీ నిర్మాణసంస్థలు కలిసి తన 25 సినిమా నిర్మించడం, అది పెద్ద హిట్ కావడం చాలా సంతోషానిచ్చిందన్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్‌కి, నటుడు అల్లరి నరేష్‌కి స్పెషల్‌గా థ్యాంక్స్ చెప్పాడు. తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్‌ని మహర్షి ఒక వారంలో దాటేయబోతోందన్నమహేష్‌బాబు.. సక్సెస్ మీట్‌లో కాలర్ ఎగరేశాడు.
Comments
Please login to add a commentAdd a comment