నేనూ లైంగిక వేధింపులకు గురయ్యా! | Ileana directly Said I suffered sexual abuse | Sakshi
Sakshi News home page

నేనూ లైంగిక వేధింపులకు గురయ్యా!

Published Sat, Feb 4 2017 1:47 AM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

నేనూ లైంగిక వేధింపులకు గురయ్యా! - Sakshi

నేనూ లైంగిక వేధింపులకు గురయ్యా!

నేనూ లైంగిక వేధింపులకు ప్రత్యక్షంగా గురయ్యానని నటి ఇలియానా అన్నారు. నిజం చెప్పాలంటే చాలా మంది హీరోయిన్లు ఇలాంటి దుశ్చర్యలకు గురవుతున్నారు. సినీ, బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనే నటీమణులు అభిమానం పేరుతో పెట్రేగిపోయే పిచ్చి వ్యామోహపరుల చిల్లర చేష్టలను భరిస్తున్నారు. మరి కొందరు మద పిచ్చిగాళ్లు ట్విట్టర్, ఫేస్‌బుక్‌ వంటి మాద్యమాలను దుర్వినియోగం చేస్తూ హీరోయిన్లపై పైశాచికత్వానికి పాల్పడుతున్నారు. ఈవ్‌ టీజింగ్‌ పేరుతో వేదనకు గురి చేస్తున్నారు.

ప్రముఖ నటీమణులు నయనతార, తమన్నా, తాప్సీ, నమిత, శ్రియ లాంటి వాళ్లు బహిరంగ ప్రాంతాల్లో అభిమానుల పిచ్చి చేష్టల బారిన పడ్డవారే. బాలీవుడ్‌ భామ దీపికాపదుకోనే ఆ మధ్య అభిమానులకు చిక్కి బాధకు గురయ్యారు. కత్రినాకైఫ్‌ సినిమా థియేటర్‌లోనూ, సోనాక్షిసిన్హా ఒక సినీ కార్యక్రమంలోనూ దురాభిమానుల బాధింపునకు గురయ్యారు.దీంతో చాలా మంది తమకు పర్సనల్‌గా బాడీగార్డ్‌లను ఏర్పాటు చేసుకుంటున్నారు. కొందరైతే ట్విట్టర్, ఫేస్‌బక్‌ ఎకౌంట్‌లను క్లోజ్‌ చేసుకుంటున్నారు.

మరి కొందరు అసభ్యంగా ప్రవర్తించేవారిపై పోలీసులకు ఫిర్యాదు చేసి తగిన చర్యలు తీసుకునేలా చేస్తున్నారు. మరో సెలబ్రిటి నటి ఇలియానా  తాను లైంగిక వేధింపులు ఎదర్కొన్నానని చెప్పారు.దీని గురించి తను చెబుతూ హీరోయిన్లను కొందరు చాలా చీప్‌గానూ, చులకనగానూ చూస్తున్నారన్నారు. ఈ పరిస్థితి మారాలన్నారు. తాను సోషల్‌ మీడియాలో ఈవ్‌ టీజింగ్‌కు గురయ్యానని చెప్పారు.కొందరైతే ఫోన్లు చేసి అసభ్యపదజాలాలతో హింసించేవారని అన్నారు.ఇలాంటివి తనను చాలా బా«ధించేవని, అలాంటి సమయాల్లో తన తల్లిదండ్రుల అండగా నిలబడడం ఎంతో మనశ్శాంతినిచ్చేదని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement