
‘రవితేజతో కలిసి మళ్లీ ఓ సినిమా చేయాలని ఉంది’ అని తాము నటించిన ‘కిక్’ సినిమా తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవల ఇలియానా పేర్కొన్నారు. సరదాగా అన్నారో.. ఆమె సంకల్ప బలానికి ఉన్న పవరో చెప్పలేం కానీ ఇలియానా తలచినదే జరిగింది. రవితేజ, ఇలియానా కలిసి నాలుగోసారి యాక్ట్ చేయబోతున్నారు. సోమవారం ‘సాక్షి’లో ‘‘రవితేజ సరసన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలో అనూ ఇమ్మాన్యుయేల్ ప్లేస్‌లో ఇలియానాను తీసుకోనున్నారని సమాచారం’’ అని ప్రచురించిన వార్త నిజమైంది. రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో వై.రవిశంకర్, నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి నిర్మిస్తున్నారు. తొలుత ఈ సినిమాలో హీరోయిన్‌గా అనూ ఇమ్మాన్యుయేల్‌ని అనుకున్నారు. డేట్స్ క్లాష్ రావడంతో ఆ ప్లేస్‌లోకి ఇలియానా వచ్చారు. విశేషం ఏంటంటే 2012లో రవితేజతో కలసి చేసిన ‘దేవుడు చేసిన మనుషులు’ తెలుగులో ఇలియానా లాస్ట్ సినిమా. ఆరేళ్ల తర్వాత మళ్లీ రవితేజ సినిమాతోనే రీ–ఎంట్రీ ఇవ్వనున్నారీ గోవా బ్యూటీ.
Comments
Please login to add a commentAdd a comment