నేనింతే! | I do not want to be fooled by the friendship of the chances and the closure is close. | Sakshi
Sakshi News home page

నేనింతే!

Published Mon, Jul 10 2017 12:25 AM | Last Updated on Tue, Sep 5 2017 3:38 PM

నేనింతే!

నేనింతే!

సినిమా ఇండస్ట్రీలో ఛాన్స్‌ పట్టాలన్నా, ఇంకో ఛాన్స్‌ వెతుక్కుంటూ తలుపు తట్టాలన్నా హీరోయిన్లకు మంచి పరిచయాలు తప్పనిసరి అనేది ఫిల్మ్‌నగర్‌ పబ్లిక్‌ సీక్రెట్‌. నలుగురిలో కలుపుగోలుగా ఉంటేనే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నెగ్గుకు రాగలరని అంటుంటారు. అందుకే ఇండస్ట్రీలో జరిగే పార్టీలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నది కొందరి అభిప్రాయం. ‘‘నేను ఆ టైప్‌ కాదు’’ అని ఇలియానా సూటిగా సుత్తి లేకుండా చెప్పేశారు.

ఇంకా ఈ బ్యూటీ మాట్లాడుతూ– ‘‘ఛాన్సుల కోసం లేనిపోని స్నేహం నటించి, క్లోజ్‌గా మూవ్‌ కావడం నాకిష్టం లేదు. ఫలానా హీరోతో క్లోజ్‌గా ఉంటే ఛాన్స్‌ వస్తుందని, హీరోలతో పార్టీలకు వెళితే రికమండ్‌ చేస్తారని ఆలోచించను. నా టాలెంట్‌ మీద నమ్మకం ఉంది. ఎవరైనా దాన్ని గుర్తించి ఛాన్స్‌ ఇస్తే ఓకే. లేకపోతే ఫర్వాలేదు. వేరేవాళ్ల సంగతి నాకు తెలీదు. నేనింతే’’ అన్నారు. అందం గురించి ఇలియానా చెబుతూ – ‘‘హిందీలో ‘బర్ఫీ’ చేశాక, ఓ డాక్టర్‌ని కలిశా. అతను ‘మీ ముఖంపై లాఫింగ్‌ లైన్స్‌ ఉన్నాయి. వాటిని పోగొట్టేందుకు సర్జరీ చేయించుకుంటే బాగుంటుంది’ అని సలహా ఇచ్చాడు. ఆపరేషన్‌ చేయించుకుని, అందం పెంచుకోవాల్సిన అవసరం లేదనుకున్నా. అందుకే ఒప్పుకోలేదు’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement