నేను కాజల్‌కి వ్యతిరేకం!
నేను కాజల్‌కి వ్యతిరేకం!
Published Sat, Sep 14 2013 11:52 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
‘‘బాలీవుడ్ అల్లాటప్పా పరిశ్రమ కాదు. ఇక్కడ అందగత్తెలకు కొదవ లేదు. అందుకే ‘బర్ఫీ’కి అవకాశం వచ్చినప్పుడు కొంచెం సంశయించాను. ఓ అభద్రతాభావంతో ఆ సినిమా చేశాను. కానీ సినిమా విడుదలైన తర్వాత వచ్చిన స్పందనకు నా మనసులో ఉన్న భారమంతా పోయింది. ఏం ఫర్వాలేదు.. బాలీవుడ్‌లో నిలదొక్కుకోవచ్చనే నమ్మకం కలిగింది’’ అంటున్నారు ఇలియానా. ఈ గోవా సుందరి నటించిన మలి హిందీ చిత్రం ‘ఫటా పోస్టర్ నిఖ్‌లా హీరో’ విడుదలకు సిద్ధమైంది.
ఈ చిత్రం గురించి ఇలియానా చెబుతూ - ‘‘ఇందులో నా పాత్ర పేరు కాజల్. ఇలియానాకి ఈ కాజల్ పూర్తి వ్యతిరేకం. నా మనసు తెరిచిన పుస్తకం కాదు. నాకు ఎక్కువమంది స్నేహితులు లేరు. స్కూల్ డేస్‌లో ఎవరైతే ఫ్రెండ్స్‌గా ఉన్నారో, వాళ్లే ఇప్పుడూ కంటిన్యూ అవుతున్నారు. నేను పార్టీ యానిమల్‌ని కాదు. కానీ కాజల్ ఇందుకు పూర్తిగా విరుద్ధం. నేను కానిది చేయాలి కాబట్టి థ్రిల్ అనిపించింది’’ అన్నారు.
ఇదిలా ఉంటే సొట్టబుగ్గల సుందరి దీపికా పదుకొనే ఫిట్‌నెస్ ట్రైనరే ఇలియానాకి కూడా ట్రైనింగ్ ఇస్తున్నారట. బాలీవుడ్‌లో దీపికానే హాట్ గాళ్ అని ఇలియానా చెబుతూ - ‘‘దీపికాకి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తున్నారో నాకూ అలాంటి శిక్షణే ఇవ్వండి. నేను కూడా అంత హాట్‌గా మారాలని మా శిక్షకునితో సరదాగా గొడవ పడుతుంటాను’’ అన్నారు.
Advertisement
Advertisement