ఇలియానాకు ప్రెగ్నెన్సీ.. రైడ్‌కు వెళ్లిన ముద్దుగుమ్మ! | Ileana DCruz flaunts her baby bump as she goes on a drive video viral | Sakshi
Sakshi News home page

Ileana DCruz: బేబీ బంప్‌తో రైడ్ ఎంజాయ్ చేస్తోన్న ఇలియానా!

May 20 2023 8:54 PM | Updated on May 20 2023 9:37 PM

Ileana DCruz flaunts her baby bump as she goes on a drive video viral - Sakshi

గోవా బ్యూటీ ఇలియానా ఇటీవలే ప్రెగ్నెన్సీ ధరించినట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. పెళ్లి కాకముందే గర్భం ధరించనట్లు ప్రకటించడంతో ఫ్యాన్స్ షాకయ్యారు.  పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరంటూ కొంతమంది నెటిజన్స్‌ ప్రశ్నించారు కూడా. ఆ తర్వాత కూడా బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను పంచుకుంది ముద్దుగుమ్మ. అయితే తాజాగా మరో వీడియోను షేర్ చేసింది. బేబీ బంప్‌తో ఉన్న ఇలియానా కారులో వెళ్తున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. అంతే కాకుండా 'సన్ అవుట్, బంప్స్ అవుట్' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. 

(ఇది చదవండి: పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న ఇలియానా!)

కాగా.. గతంలో ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో ఇలియానా పెళ్లి అయింది. కొన్నాళ్లు కలిసి జీవించిన ఈ జంట.. 2019లో విడిపోయారు. అప్పట్నుంచి ఆమె సింగిల్ గానే ఉంటోంది. కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు రూమర్స్‌ వినిపించాయి. కానీ ఇలియానా మాత్రం ఎక్కడ అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతానికి అయితే ఇలియానా  లైఫ్ పార్టనర్ ఎవరనేది ఇప్పటి వరకు తెలియదు.

(ఇది చదవండి: పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ.. 72 గంటలే డెడ్ లైన్: స్టార్ హీరోయిన్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement