Ileana Dcruz Flaunts Baby Bump in Mirror Selfies - Sakshi
Sakshi News home page

Ileana: ఇలియానా బేబీ బంప్‌.. మొత్తానికి ఎవరో చెప్పేసిందిగా!

May 26 2023 8:00 PM | Updated on May 26 2023 8:26 PM

Ileana DCruz flaunts baby bump in mirror selfies - Sakshi

దేవదాసు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన గోవా బ్యూటీ ఇలియానా. తొలి సినిమాతోనే గుర్తింపు పొందిన ఈమె ఆ తర్వాత పోకిరి సినిమాతో యూత్‌ క్రష్‌గా మారింది. కెరీర్‌ ఆరంభించిన అతి తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. కానీ ఆ తర్వాత టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్‌కు మకాం మార్చింది. అయితే తెలుగుతో పోలిస్తే అక్కడ ఆశించిన స్థాయిలో సక్సెస్‌ సాధించలేదు. దీంతో కొంతకాలం సినిమాలకు బ్రేక్‌ ఇచ్చింది.

(ఇది చదవండి: ఇలియానాకు ప్రెగ్నెన్సీ.. రైడ్‌కు వెళ్లిన ముద్దుగుమ్మ!)

ఇటీవలే సోషల్ మీడియాలో తాను గర్భం ధరించినట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చింది. పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ కావడంతో అవాక్కయ్యారు. తాజాగా మరోసారి తన బేబీ బంప్‌ను ప్రదర్శించింది ముద్దుగుమ్మ. మిర్రర్ ముందు సెల్ఫీ దిగుతూ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. అంతే కాకుండా 'ఇట్స్ ఆల్ ఏబౌట్ ఎంజెల్స్' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. అంటే పరోక్షంగా ఆమెకు పుట్టబోయే బిడ్డ గురించి హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇలియానాకు పుట్టబోయేది కూతురే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే ఇలియానా ప్రెగ్నెన్సీ అనౌన్స్‌ చేసినప్పటి నుంచి ఆ బిడ్డకు తండ్రి ఎవరన్న దానిపై జోరుగా చర్చ నడుస్తుంది.  గతంలో హీరోయిన్‌ కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌తో ఇలియానా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు, వీరిద్దరూ కలిసి కత్రినా, విక్కీలతో కలిసి మాల్దీవులకు వెకేషన్‌కు వెళ్లారు. కానీ ప్రెగ్నెన్సీ బయటపెట్టినా ఇంతవరకు తన రిలేషన్‌ షిప్‌ స్టేటస్‌ మాత్రం ఇలియానా రివీల్‌ చేయకపోవడం గమనార్హం.

(ఇది చదవండి: విషాదం.. ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ కన్నుమూత)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement