Ileana D'Cruz Shares First Pictures Of Her Baby Bump After Pregnancy Announcement, Pics Viral - Sakshi
Sakshi News home page

Ileana D'Cruz Baby Bump Pics: ఇలియానా బేబీ బంప్.. ఇన్‌స్టాలో పోస్ట్ వైరల్!

Published Fri, May 12 2023 9:32 PM | Last Updated on Sat, May 13 2023 8:41 AM

Ileana D Cruz Shares latest Baby Bump Photos Goes Viral - Sakshi

దేవదాసు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన గోవా బ్యూటీ ఇలియానా. తొలి సినిమాతోనే గుర్తింపు పొందిన ఈమె ఆ తర్వాత పోకిరి సినిమాతో స్టార్ హీరోయిన్ క్రేజ్ దక్కించుకుంది. కెరీర్‌ ఆరంభించిన అతి తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. స్టార్‌ హీరోలతో పాటు యంగ్‌స్టర్స్‌తోనూ జతకట్టిన ఈ భామ ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ టాలీవుడ్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టేసి బాలీవుడ్‌కు మారింది. అయితే తెలుగుతో పోలిస్తే అక్కడ ఆశించిన స్థాయిలో సక్సెస్‌ సాధించలేదు. దీంతో కొంతకాలం సినిమాలకు బ్రేక్‌ ఇచ్చింది.

(ఇది చదవండి: రూమ్‌కు రమ్మని రెండు సార్లు పిలిచాడు: నిర్మాతపై నటి సంచలన ఆరోపణలు)

అయితే సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఇలియానా ఇటీవలే తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ అని చెప్పడంతో‌ చేయడంతో అభిమానులతో పాటు నెటిజన్స్ కూడా  షాక్‌ అయ్యారు. తాజాగా మరోసారి తన బేబీ బంప్‌ను షేర్‌ చేసింది ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఇలియానా షేర్‌ చేసిన ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. దీనికి బాలీవుడ్ నటి అతియాశెట్టి లవ్‌ సింబల్‌ను జతచేసింది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇలియానాకు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరని కొందరు ప్రశ్నిస్తున్నారు. 

కాగా.. ఇలియానా ఇటీవల రాపర్-సింగర్ బాద్షాతో కలిసి ఒక మ్యూజిక్ వీడియోలో కనిపించింది. ఆమె చివరిసారిగా అభిషేక్ బచ్చన్‌తో కలిసి నటించిన ది బిగ్ బుల్ (2019)లో కనిపించింది. తర్వాత రణదీప్ హుడాతో కలిసి అన్‌ఫెయిర్ అండ్ లవ్లీలో కనిపించనుంది.

(ఇది చదవండి: గోపీచంద్ 'రామబాణం'.. ఆ డిలీటెడ్ సీన్స్ మీరు చూశారా?)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement