అవకాశాల కోసం అర్ధనగ్నంగా.. | Ileana D'Cruz poses nude in bathtub for her boyfriend | Sakshi
Sakshi News home page

అవకాశాల కోసం అర్ధనగ్నంగా..

Jan 25 2017 1:33 AM | Updated on Sep 5 2017 2:01 AM

అవకాశాల కోసం అర్ధనగ్నంగా..

అవకాశాల కోసం అర్ధనగ్నంగా..

ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలన్న సామెత తెలిసినా కొందరు దాన్ని ఆచరించలేరు.

ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలన్న సామెత తెలిసినా కొందరు దాన్ని ఆచరించలేరు. దక్షిణాదిలో మంచి స్థాయికి చేరుకున్న హీరోయిన్లు ఇక్కడ అవకాశాలను కాలదన్నుకుని బాలీవుడ్‌ మోహంతో అక్కడ అవకాశాల కోసం నానా తంటాలు పడుతుండడం చూస్తునే ఉన్నాం. బాలీవుడ్‌లో ప్రవేశించిన అతి కొందరు నటీమణులే సక్సెస్‌ అయ్యారు. అదీ కొన్ని చిత్రాలకే పరిమితం. మరి కొందరు ఒకటి రెండు చిత్రాలతోనే సరిపెట్టుకున్నారు. అలా టాలీవుడ్‌లో ఒక వెలుగు వెలిగిన నటి ఇలియానా దక్షిణాది అవకాశాలను వలదని, బాలీవుడ్‌ రంగప్రవేశం చేసింది. అక్కడ తొలి చిత్రం బర్ఫీ చిత్రం ఈ గోవా సుందరికి మంచి పేరునే తెచ్చి పెట్టింది. దీంతో అక్కడ తన భవిష్యత్‌ ఉజ్వలమేనని కలలు కనేసింది కూడా.

అయితే అనుకున్నవన్నీ జరిగితే అది జీవితం ఎందుకవుతుంది. అమ్మడు ఐదేళ్లలో ఐదు హిందీ చిత్రాలను మాత్రమే చేసింది. ఆ తరువాత బాలీవుడ్‌ ఇలియానా పక్కన పెట్టేసింది.దీంతో ఎక్కడ పారేసుకున్నానో అక్కడే వెతుక్కోవడానికి ప్రయత్నాలు మొదలెట్టిందని సమాచారం. అందుకు ఇలియానా ఎంచుకున్న విధానం ఎప్పుడూ ఏదో ఇక సంచలన చర్యలతో వార్తల్లో ఉండడం. చాలా మంది వాడుకునే ట్రిక్కే ఇది.

ఇలియానా తన బాయ్‌ఫ్రెండ్‌తో దిగిన ఫొటోలను ఇంటర్నెట్‌లో పోస్ట్‌ చేయడం, సెక్స్‌ గురించి మాట్లాడడం లాంటి చీప్‌ ట్రిక్కులను పాఠిస్తోంది. ఇలాంటివి ఈ నాజూకు అమ్మడిని వార్తల్లోకెక్కిస్తున్నాయి గానీ, అవకాశాలు మాత్రం రావడంలేదు. దీంతో చివరి ప్రయత్నంగా ఈ భామ ఈత దుస్తులతో కూడిన ఫొటోలను, పూర్తి నగ్న ఫొటోలను ఇంటర్నెట్‌కు విడుదల చేసింది. తను బాత్‌రూమ్‌ టబ్‌లో నగ్నంగా స్నానం చేస్తున్న ఫొటోలు సోషల్‌ మీడియాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. మరి అవన్నా ఇలియానాకు అవకాశాలను అందిస్తాయే లేక వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదన్న చింతకు గురవుతుందో చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement