cheap tricks
-
సోషల్ మీడియాలో క్రేజ్ కోసం యువకుడి వికృత చేష్టలు
-
చీప్ ట్రిక్స్ తో దొరికిపోయిన మాలోకం
-
వ్యక్తిత్వ హననమే బాబు వ్యూహం.. అస్త్రాలుగా ఎల్లో మీడియా, ఐటీడీపీ
రాజకీయంగా ఎదుర్కొనడం కష్టమైనపుడు ఎదుటివారి వ్యక్తిత్వాన్ని డ్యామేజ్ చేయడం చంద్రబాబు నైజం. మొదటి నుంచి ఆయన వ్యవహార తీరే అంత. అప్పటి ఎన్టీయార్ నుంచి నేటి వైఎస్ జగన్మోహన్రెడ్డి వంటి ఎంతోమందిని అదే విధంగా వ్యక్తిత్వాలను దెబ్బతీసే వార్తలు తమ అనుకూల మీడియాలో రాయించడం, విపరీతంగా ప్రచారంలోకి తేవడం, టీవీల్లో చర్చలు జరపడం.. ఇదే ఆయన రాజకీయ శైలి. ముందుగా ఆర్థికంగా కాస్త వెనుకబడిన వాళ్లలో హుషారైన వాళ్లను గుర్తించడం.. వారిని మెల్లగా దువ్వి తమ లైన్లోకి తెచ్చుకోవడం.. పక్షులకు గింజలు వేసి మచ్చిక చేసుకున్నట్లు ఈ యువత అవసరాలు గమనించి అప్పుడప్పుడు కాస్త డబ్బు సాయం చేసి వారిని మెల్లగా తమ వాళ్లుగా చేసుకోవడం.. ముందుగా అసలు పేర్లు మార్చేయడం.. కొత్త పేర్లతో గుర్తింపు తీసుకురావడం ఆ తరువాత అంచలంచెలుగా వారి మెదళ్లలోకి అవతలివారి గురించి విషాన్ని, విద్వేషాన్ని ఎక్కించడం. అప్పుడు వారు పూర్తిగా తమ కంట్రోల్లోకి వచ్చాక వారిని మానవ బాంబులు మాదిరిగా మర్చి అవతలివారి మీద ప్రయోగించడం.. దీనికి వెనక నుంచి అన్ని అండదండలూ అందిస్తూ వేడుక చూస్తూ పెద్దలు ఎంజాయ్ చేయడం. ఎన్టీయార్, లక్ష్మీపార్వతి, చిరంజీవికి తప్పని ఎల్లో మీడియా దాడి ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చింది మరి అప్పట్లో.. కేవలం ఎల్లో మీడియాతోనే అవతలివారి మీద బురదజల్లి ప్రజల్లో వారిని చులకన చేసేవారు. చివరికి ఎన్టీయార్‌ను సైతం వ్యక్తిత్వంల్లేని మనిషిగా చిత్రీకరించి తమ పత్రికల్లో పేజీలకొద్దీ వార్తలు రాసేవారు. ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత ఆయన భార్య లక్ష్మీ పార్వతీని ఇప్పటికీ వేధిస్తున్నారు. ఇక అప్పట్లో రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవిని అలాగే దిగజార్చారు. అనంతరం దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆ తరువాత వైయస్ జగన్.. ఇలా తమ మార్గానికి అడ్డుగా వచ్చిన ప్రతి వారిని ఇలానే వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ వెళ్లారు. ఆనాడు ఎన్టీయార్‌ను బాధ్యత లేని వ్యక్తిగా, నైతిక విలువలు లేని వ్యక్తిగా చెబుతూ పేజీలకొద్దీ వార్తలు వండి వార్చారు. ఇంకా అయన భార్య లక్ష్మి పార్వతి కూడా రాజ్యాంగేతర శక్తి, రాష్ట్ర ప్రజల పాలిట దెయ్యం భూతం అన్నట్లుగా మీడియాలో రాసి ప్రజలను భయపెట్టి ఆమె వ్యక్తిత్వాన్ని దెబ్బతీశారు. ఇక చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఇబ్బందుల్లో ఉన్నపుడు జెండా పీకేద్దాం అంటూ చిరంజీవిని అసమర్థుడిగా చిత్రించి పార్టీ క్యాడర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశారు. చదవండి: కేసీఆర్ కోపాన్ని చూడాల్సి వస్తుందని ఈనాడు భయపడిందా? ఇక వైఎస్సార్‌ను సైతం అవినీతిపరుడిగా నిరూపించడానికి ఎల్లో మీడియా ఎన్ని పాట్లు పడిందో అందరికి తెలిసిందే. చివరిగా వైఎస్ జగన్‌ని రాజకీయంగా అణగదొక్కేందుకు చేయని ప్రయత్నం లేదు. ఆయన్ను ప్రజలు ఆమోదించి ఆయన్ను సీఎంగా ఎన్నుకున్నా ఎల్లో మీడియా ఒప్పుకోవడం లేదు.. రోజూ కాకుల మాదిరి వెంటాడి పొడుస్తూ వేధిస్తూ అయన వ్యక్తిత్వాన్ని దిగజార్చే కథనాలు వండుతూనే ఉన్నారు. ఆ వార్తలను మళ్ళీ తమ ఛానెళ్లలో చర్చకు పెడతారు. నిజమని నమ్మిస్తారు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక యువతను ఇలాగే రెచ్చగొట్టి అవతలివారి కుటుంబాల్లోని మహిళలను సైతం అవమానించేలా పోస్టులు పెట్టిస్తారు. కొన్నాళ్ల పాటు వారికి డబ్బులు ఇస్తూ ప్రోత్సహించి బయటి నుంచి అన్నీ గమనిస్తూ ఉంటారు. నష్టపోతే వీళ్ళు.. లాభపడితే పెద్దలు.. ఈ దుష్ట యజ్ఞంలో వ్యక్తిత్వాన్ని కోల్పోయి, శలభాల్లా మాడిపోయినవాళ్లు ఎందరో.. తెలుగుదేశం వారి సోషల్ మీడియా నెట్ వర్క్ (ఐటీడీపీ) పనితీరు ఇలాగే ఉంటుంది.. పాపం ఇబ్బందుల్లో ఉండే కొందరు యువతను ఇలాగే కాసిన్ని డబ్బులు ఇచ్చి వారిని తమ గ్రూపులోకి తెచ్చుకుంటారు.. వారి అసలు పేర్లు.. చివరికి కులం పేర్లు సైతం మార్చేసి, ఉన్మాదులుగా మార్చేసి ఎదుటివారి మీద విషం కక్కేలా శిక్షణ ఇస్తారు. అవతలివారి వ్యక్తిత్వాలను డ్యామేజ్ చేస్తారు. సోషల్ మీడియా లేని రోజుల్లో ఎదుటివారి వ్యక్తిత్వాలను డ్యామేజ్ చేసే బాధ్యత ఎల్లో మీడియా చూసుకునేది. చదవండి: ‘ఈనాడు’ అసలు బాధ అదేనా?.. ఎందుకీ పడరాని పాట్లు..! తమ పెంపుడు కుక్కలా మాదిరిగా వారిని వాడుకుని ఎదుటివారిమీద ఇష్టానుసారం దాడులు చేసేటపుడు అవేమీ తప్పుగా వారికి అనిపించదు.. తప్పుల్లా కనిపించవు. తప్పు ఏదీ ఎక్కువ కాలం సాగదు కాబట్టి ఏదోరోజు వారు దొరికిపోవడమో.. ఓపిక నశించి ఎదురుదాడి జరగడమో అవుతుంది. ఇక అప్పుడు ఎక్కడలేని నటులంతా వచ్చి ఏడ్చి తమవాళ్లను ఎదుటివాళ్లు వేధిస్తున్నారని మళ్లీ మీడియాలో, ఛానెళ్లలో రోదనలు పెడతారు. యుద్ధం మొదలు పెట్టేటపుడే దాని పర్యవసానాలు ఏ స్థాయిలో ఉంటాయో గమనించాలి.. ఒకసారి ఇటు నుంచి ప్రతిదాడి మొదలైతే తట్టుకోలేని, చేతగాని పరిస్థితులు ఉన్నపుడు యుద్ధమే మొదలు పెట్టకూడదు. పాపం ఇలాగే చాలామంది యువత డబ్బులు, తాత్కాలిక ప్రయోజనాలకు ఆశపడి కేసులు, కోర్టుల బారినపడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ -
టీడీపీ సెల్ఫ్‌గోల్: చీప్ ట్రిక్స్‌తో పోరాటం
ప్రజల మనసులో స్థానం సంపాదించుకునేందుకు ప్రజాపోరాటం ఎంచుకోవడం ఓ మార్గం. బలమైన వ్యక్తులను ఢీకొన్నట్లుగా ప్రగల్భాలు పలుకుతూ ప్రత్యామ్నాయంగా సెల్ఫ్‌గోల్ కొట్టడం మరో ఎత్తుగడ. మొదటి కోవకు చెందిన నాయకులు సుస్థిర స్థానం సొంతం చేసుకోగా, రెండో మార్గంలో ఉన్నవారు చీప్‌ట్రిక్స్‌తో కాలం గడపడం సర్వసాధారణం. అచ్చం అలాంటి వ్యవహారమే తెలుగుదేశం పార్టీలో తెరపైకి వస్తోంది. ఉనికి కోసం ఆరాటపడుతూ చీప్ ట్రిక్స్‌తో పోరాటం చేస్తుండడం విమర్శలకు తావిస్తోంది. సాక్షి, తిరుపతి: రాజంపేట పార్లమెంటు టీడీపీ ఇన్చార్జిగా శ్రీనివాసులురెడ్డి నియమాకం అయ్యాక, ఆ పార్టీ ఉన్నతికి కృషి చేస్తున్నట్లుగా కలరింగ్ ఇవ్వడంలో సఫలీకృతులయ్యారు. టీడీపీ శ్రేణులను ఉత్తేజపర్చేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ వ్యక్తిగత ఆరోపణలతో కూడిన దూషణలకు దిగారు. క్రమం తప్పకుండా టీడీపీ నిరాధార ఆరోపణలు చేయడం పరిపాటిగా మారింది. దీనిపై మంత్రి పెద్దిరెడ్డి వర్గీయుల నుంచి ఆవేదన వ్యక్తమైంది. ఆరోపణలు రుజువు చేయాలని, లేదంటే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్సీపీ శ్రేణుల నుంచి డిమాండ్ వ్యక్తమైంది. ఈ క్రమంలో శ్రీనివాసులురెడ్డిని ప్రశ్నిస్తే జీర్ణించుకోలేక ఆయన ఉద్రిక్తత ఘటనను ప్రేరేపితం చేశారని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. తంబళ్లపల్లెలో ఉనికి కనుమరుగు ఎన్నికల తర్వాత తంబళ్లపల్లె నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఉనికి కరువైంది. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పాలన కారణంగా టీడీపీ జవసత్వాలను కోల్పోయింది. ఈక్రమంలో టీడీపీ ఇన్చార్జి శంకర్‌యాదవ్ సైతం బెంగళూరులో స్థిరపడ్డారు. జీవం లేని పార్టీకి ఊపు తేవాలనే తలంపుతో ఏకంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. శుక్రవారం టీడీపీ నాయకులు పర్యటనను దృష్టిలో ఉంచుకుని కొంతమంది వ్యక్తులు మంత్రి పెద్దిరెడ్డి కుటుంబంపై చేస్తున్న ఆరోపణలు రుజువు చేయాలి, లేదంటే క్షమాపణ చెప్పాలంటూ నినదించారు. రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు ముందుగా దాడికి సిద్ధమైనట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడిస్తున్నారు. టీడీపీ చర్యలను ప్రతిఘటించారు. ఆపై అక్కడ నిర్మాణంలో ఉన్న ఇటుకలను ఇరుపక్షాలు విసురుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. దీనిపై రాష్ట్రస్థాయి టీడీపీ నేతలు దుష్ఫ్రచారం చేయడం మొదలుపెట్టారు. స్వల్ప ఘటనలు సైతం తమకు అనుకూలంగా మల్చుకొని ఆర్భాటపు యాగీ చేయ డం టీడీపీ వంతైంది. కట్టడి చేసిన పోలీసులు అంగళ్లు వద్ద ఉద్రిక్తత పరిస్థితులను నియంత్రించడంలో పోలీసు యంత్రాంగం సఫలీకృతమైంది. ఇరు పార్టీల రాస్తారోకోతో ట్రాఫిక్ నిలిచిపోయింది. మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి సమయస్ఫూర్తితో వ్యవహరించి, ఇరువర్గాలను శాంతింపజేశారు. ముందస్తుగా చట్టపరమైన చర్యలు చేపట్టారు. కాగా, తెలుగుదేశం పార్టీ ప్రధాన నాయకులంతా పోలీసు వ్యవస్థనే టార్గెట్ చేస్తూ ఆరోపణలు గుప్పించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. -
టీడీపీ అబద్ధాల పుస్తకం
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురద జల్లడంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అన్ని అడ్డదార్లూ తొక్కుతోంది. పెయిడ్ ఆర్టిస్టులతో దుష్ప్రచారం సాగిస్తోంది. ఇది చాలదన్నట్టు ‘చలో ఆత్మకూరు’ పేరుతో ఓ పుస్తకాన్ని ప్రచురించింది. ఈ పుస్తకంలో అన్ని అబద్ధాలు, అవాస్తవాలే ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా 8 మంది టీడీపీ నేతలు హతమయ్యారని పుస్తకంలో పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో టీడీపీ నేత తాడిబోయిన ఉమాయాదవ్ హత్య, మాచర్ల నియోజకవర్గం విజయపురి సౌత్‌కు చెందిన కొల్లి దుర్గాప్రసాద్, ప్రకాశం జిల్లా చినగంజాంలో పద్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకోడానికి వైఎస్సార్సీపీ నేతలే కారణమని ఈ పుస్తకంలో ప్రస్తావించారు. కానీ, వాస్తవాలు మాత్రం మరోలా ఉన్నాయి. టీడీపీ కార్యకర్త కాకపోయినా... మాచర్ల నియోజకవర్గం విజయపురి సౌత్‌కు చెందిన కొల్లి దుర్గాప్రసాద్ జూలైలో ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి నివాసానికి సమీపంలో ఉండే వేరే కుటుంబంతో వివాదం చోటు చేసుకుంది. ప్రత్యర్థి వర్గం వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో మనస్తాపానికి గురైన దుర్గాప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడు. నిజానికి దుర్గాప్రసాద్ టీడీపీ కార్యకర్త కాదు. గత ప్రభుత్వ హయాంలోనే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరాడు. తోడికోడలితో గొడవ వల్ల ఆత్మహత్య ప్రకాశం జిల్లా చినగంజాం మండలం రుద్రమాంబపురంలో జూన్ 25న పద్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. తోడికోడలు పాపమ్మతో ఆమెకు విభేదాలున్నాయి. జూన్ 25న వారిద్దరి మధ్య గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన పద్మ ఆత్మహత్య చేసుకుంది. తాడిబోయిన ఉమాయాదవ్, కొల్లి దుర్గాప్రసాద్, పద్మ మరణాలతో వైఎస్సార్సీపీకి ఎలాంటి సంబంధం లేదు. ఇదే తరహాలో మిగిలిన ఐదు మంది హత్యల వెనుక వైఎస్సార్సీపీ ప్రమేయం ఏమాత్రం లేదు. వ్యక్తిగత గొడవలు, కుటుంబ కలహాల వల్ల జరిగిన హత్యలు, ఆత్మహత్యలకు టీడీపీ రాజకీయ రంగు పులుముతుండడం గమనార్హం. పనితీరు నచ్చకే విధుల నుంచి తొలగింపు వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక పల్నాడు ప్రాంతంలో ఆరుగురు టీడీపీ కార్యకర్తలను ఉద్యోగాల నుంచి తొలగించారని టీడీపీ ‘చలో ఆత్మకూరు’ పుస్తకంలో ప్రచురించి ప్రచారం చేస్తోంది. నిజానికి వారి పనితీరు బాగోలేకపోవడం వల్ల సదరు కాంట్రాక్టు సంస్థ విధుల నుంచి తొలగించింది. నిందితులంతా టీడీపీ వర్గీయులే మంగళగిరిలో జూన్ 25న టీడీపీ నేత, మాజీ రౌడీ షీటర్ తాడిబోయిన ఉమాయాదవ్ హత్యకు గురయ్యాడు. ఉమాయాదవ్, అదే పట్టణానికి చెందిన టీడీపీ నాయకుడు ఏనుగు కిశోర్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఉమాయాదవ్ జూలై 8న వైఎస్సార్సీపీలోకి చేరాలని నిర్ణయించుకున్నాడు. ఉమాయాదవ్ రాజకీయంగా బలపడతాడనే ఉద్దేశంతో అతడిని ఏనుగు కిశోర్ హత్య చేయించాడు. ఈ కేసులో పోలీసులు జూలై 10న 13 మందిని అరెస్టు చేశారు. వీరందరూ టీడీపీకి చెందినవారే కావడం గమనార్హం. -
సదా వార్తల్లో వ్యక్తి
ఇటీవల ఎన్నికల్లో చంద్రబాబుకి తిప్పుకో లేని ఎదురుదెబ్బ తగిలింది. ఫలితాలు వచ్చీ రాగానే ఏ మాత్రం అధైర్య పడకుండా తిరిగి ప్రతిపక్ష గళంతో తెరపైకి వచ్చారు. ప్రభుత్వ పక్షాన్ని పూర్తిగా ఎండకట్టి, ఎడారిగా మార్చేద్దా మని బాబు తన సొంత సైన్యంతో, సొంత మీడియాతో రంగ ప్రవేశం చేశారు. ఆ ప్రయత్నం ఏ మాత్రం పండకపోగా, గజం నేల ఎండకపోగా రాష్ట్రంలో నదులన్నీ ఒక్క పెట్టున ఉప్పొంగాయి. కరువు తీరా వర్షాలు పడ్డాయ్. మళ్లీ నదులు పొంగాయి. శ్రీశైలం, సాగర్ గేట్లు పూర్తిగా ఎత్తెయ్యాల్సి వచ్చింది. ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రానికి నీళ్లు వదలాల్సి వచ్చింది. ప్రభుత్వా నికి నీళ్లని నిర్వహించడం ఏ మాత్రం తెలియదని తెలుగు దేశం బురదజల్లే ప్రయత్నం చేసింది. కొద్ది రోజుల క్రితం ఏ డ్యాములున్నాయో ఇప్పుడూ అవే ఉన్నాయ్. అప్పుడు జలశక్తి శాఖలో ఏ అధికారులున్నారో, ఇప్పుడూ వాళ్లే ఉన్నారు. సీఎం మారేసరికి పాత అధికారులంతా మంత్రం వేసినట్టు తెలివితక్కువ వారైపో యారా? నాలికలకి వేపరసం పూసుకుని మాట్లా డితే మంచిది కాదు. వరద రాజకీయం ఆశించి నంతగా రక్తికట్టక పోయేసరికి అవన్నీ కట్టిపెట్టి, మళ్లీ ‘పరబ్రహ్మ పరమేశ్వర’ అంటూ కొత్త నాట కానికి తెరతీశారు. పల్నాటి కథకి రంగం సిద్ధం చేశారు. గ్రామాలలో కక్షలు, కార్పణ్యాలు లేకుండా ఉండవు. చిన్నచిన్న తగువులు గొడవలై చినికిచినికి గాలివానలై బీభత్సాలవడం మనకి తెలుసు. చంద్రబాబుకి ఒక మానసిక రుగ్మత ఉందని విశ్లేషకులు చెబుతుంటారు. ఆయన నిత్యం వార్తల్లో ఉండాలి. నాలుగు రోజులు మొదటి పేజీకి ఎక్కకపోతే వెలిసిపోతానని ఆయనకు బెంగ, భయం. ఏదీ లేకపోతే పర్వతా రోహకుడి గెటప్‌లో ఏదో ఒక హిమాలయ శిఖరం ఎగ బాకేందుకు నడుం కడతారని ఒక మనో విశ్లేషకుడు చమత్కరించాడు. పవర్లో ఉండి ఇన్నాళ్లూ అలసిపోయి ఉన్నారు. జనం ఆ సానుభూతితోనే ఆయనకు సెలవు ఇచ్చారు. వయసు మీద పడింది. అందుకని కనీసం ఓ ఏడాదిపాటు ఇంటిపట్టున ఉండి, వేళకు తిని, టైమ్‌కి నిద్ర పోయి బ్యాటరీని రీచార్జ్ చేసుకుంటే మంచిదని పెక్కురి అభిప్రాయం, కానీ ప్రజాసేవ నించి క్షణకాలం కూడా బాబు విశ్రమించలేదు. అదీ దురదృష్టం. మొన్న వరదల్లో చిక్కుకున్న కృష్ణలంకల్ని పరామర్శించడానికి వెళ్లాను. బంధువులున్నారు. అక్కడ పీకల లోతు నీళ్లలో ఉండి కూడా, ‘నాయనా మొత్తం బాబు జనం కృష్ణా నదిలో చాలా లోతుకుపోయి మరీ ఇసుక లాగే శారు. ఆ పూడికతీతవల్ల వరద కొంచెం శాంతంగా ఉంది’ అంటూ హాస్యమాడారు. ఇంకో టర్మ్ టీడీపీ పాలనలో ఉంటే కృష్ణా బేసిన్లో పెట్రోలు పొంగిపొర్లేది. బాబులు చాలా లోతుకి వెళ్లారని ఓ సీనియర్ ఇంజనీరు బాధపడ్డారు.బాబు ఇలా అయిన దానికి కాని దానికి ప్రెస్మీట్లు పెట్టి, వరద బురదని, పల్నాటి చిల్లర రాళ్లని రూలింగ్ పార్టీమీద విసిరి ఆనందపడటం కంటే ఇంకో పనికొచ్చే పని చేయకూడదా? అని గ్రామాల్లో పెద్దలు అనుకుంటున్నారు. చేతిలో ‘హెరిటేజ్’ సంస్థ ఉంది. అందులో అన్నీ గోడౌన్ల నిండా ఉంటాయ్. నీళ్లు కలవని పాలుంటాయ్. శుద్ధమైన పాలు కలవని నీళ్లుంటాయ్. పాలపొడి పొట్లాలుంటాయ్. పందిళ్లకి కాసిన కూరలుం టాయ్. పప్పులూ, ఉప్పులూ కావల్సినన్ని. ఎటొచ్చీ నాలుగు గ్యాస్ బండలు సంపాయిస్తే ప్రతి లంకకి బాబు పండుగ భోజనం అందించ వచ్చు. ఒక ‘పంట్’ మీద అన్నీ పెట్టుకువెళితే లంక ఆనందిస్తుంది 1945లో మోతీలాల్ నెహ్రూకి ఎంత ఐశ్వర్యం ఉందంటే–భారతీయు లందరికీ (33 కోట్లు) సంవత్సరం పాటు చక్కని భోజనం పెట్టేంత! అలాగే ఇప్పుడు బాబు పూను కుంటే ఈ లంకల్ని వరద తీసేదాకా పోషించ లేడా? గలడు అంటోంది ప్రజ. పైగా కావల్సి నంత పబ్లిసిటీ! ‘వట్టి మాటలు కట్టి పెట్టోయ్! గట్టి మేల్ తలపెట్టవోయ్’ ఇది మన రాష్ట్ర స్లోగన్. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
అవకాశాల కోసం అర్ధనగ్నంగా..
ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలన్న సామెత తెలిసినా కొందరు దాన్ని ఆచరించలేరు. దక్షిణాదిలో మంచి స్థాయికి చేరుకున్న హీరోయిన్లు ఇక్కడ అవకాశాలను కాలదన్నుకుని బాలీవుడ్ మోహంతో అక్కడ అవకాశాల కోసం నానా తంటాలు పడుతుండడం చూస్తునే ఉన్నాం. బాలీవుడ్లో ప్రవేశించిన అతి కొందరు నటీమణులే సక్సెస్ అయ్యారు. అదీ కొన్ని చిత్రాలకే పరిమితం. మరి కొందరు ఒకటి రెండు చిత్రాలతోనే సరిపెట్టుకున్నారు. అలా టాలీవుడ్లో ఒక వెలుగు వెలిగిన నటి ఇలియానా దక్షిణాది అవకాశాలను వలదని, బాలీవుడ్ రంగప్రవేశం చేసింది. అక్కడ తొలి చిత్రం బర్ఫీ చిత్రం ఈ గోవా సుందరికి మంచి పేరునే తెచ్చి పెట్టింది. దీంతో అక్కడ తన భవిష్యత్ ఉజ్వలమేనని కలలు కనేసింది కూడా. అయితే అనుకున్నవన్నీ జరిగితే అది జీవితం ఎందుకవుతుంది. అమ్మడు ఐదేళ్లలో ఐదు హిందీ చిత్రాలను మాత్రమే చేసింది. ఆ తరువాత బాలీవుడ్ ఇలియానా పక్కన పెట్టేసింది.దీంతో ఎక్కడ పారేసుకున్నానో అక్కడే వెతుక్కోవడానికి ప్రయత్నాలు మొదలెట్టిందని సమాచారం. అందుకు ఇలియానా ఎంచుకున్న విధానం ఎప్పుడూ ఏదో ఇక సంచలన చర్యలతో వార్తల్లో ఉండడం. చాలా మంది వాడుకునే ట్రిక్కే ఇది. ఇలియానా తన బాయ్‌ఫ్రెండ్‌తో దిగిన ఫొటోలను ఇంటర్నెట్లో పోస్ట్ చేయడం, సెక్స్ గురించి మాట్లాడడం లాంటి చీప్ ట్రిక్కులను పాఠిస్తోంది. ఇలాంటివి ఈ నాజూకు అమ్మడిని వార్తల్లోకెక్కిస్తున్నాయి గానీ, అవకాశాలు మాత్రం రావడంలేదు. దీంతో చివరి ప్రయత్నంగా ఈ భామ ఈత దుస్తులతో కూడిన ఫొటోలను, పూర్తి నగ్న ఫొటోలను ఇంటర్నెట్కు విడుదల చేసింది. తను బాత్రూమ్ టబ్‌లో నగ్నంగా స్నానం చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాల్లో హల్చల్ చేస్తున్నాయి. మరి అవన్నా ఇలియానాకు అవకాశాలను అందిస్తాయే లేక వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదన్న చింతకు గురవుతుందో చూడాల్సిందే. -
జడ్పీ పీఠం కోసం టీడీపీ రాజకీయం
-
టీడీపీ అధికార దాహం
-
హైడ్రామా..!
సాక్షి ప్రతినిధి, కడప: పులివెందుల పేరు ఉచ్ఛరించగానే వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ప్రజానీకం గుర్తిస్తారు. అందుకు కారణం 1978 నుంచి 2011 వరకూ వరుసగా 11సార్లు ఆ కుటుంబ సభ్యులే అక్కడ ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అంతటి ప్రజాదరణ ఉన్న ఆ ప్రాంతంలో సంచలనాల కోసం కొంతమంది నేతల చీప్‌ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. వీటిని నియంత్రించాల్సిన పోలీసు యంత్రాంగం విఫలమవుతుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలు ఏవైనా సరే పులివెందులలో ఏకపక్ష ఫలితాలు ఉత్పన్నం అవుతుంటాయి. ప్రజామద్దతు వైఎస్ కుటుంబానికి అపారంగా ఉండటమే ఇందుకు కారణం. అయితే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి పులివెందుల వార్తల్లోకి ఎక్కుతునే ఉంది. పులివెందులలో మొనగాళ్లు ఉన్నారని పలువురు చర్చించుకోవాలనే తలంపు అక్కడి నేతలలో కొందరికి ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. గురువారం జరిగిన ఘటన ఇందుకు దర్పం పడుతోంది. పులివెందుల క్రిష్టియన్లైన్లో ఘర్షణ తలెత్తింది. ఇరువర్గాలు ఆస్పత్రికి చేరుకున్నాయి. వారివారి వర్గీయులను పరామర్శించేందుకు నేతలు ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడ ప్రత్యక్షంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా పోలీసు అధికారులు చూస్తుండిపోవడం పలువురిని ఆశ్చర్యచకితుల్ని చేస్తోంది. నాడు సతీష్...నేడు మధు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2005లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారు. ఆసందర్భంగా తెలుగుదేశం పార్టీ పులివెందులలో పోటీ చేసింది. ఎన్నికల్లో ఎటూ ఓటమి తప్పదని భావించిన తెలుగుదేశం పార్టీ ఎన్నికల బరినుంచి తప్పుకుంటున్నామని, అధికార దుర్వినియోగం పరాకాష్టే అందుకు కారణమని టీడీపీ నేత సతీష్‌రెడ్డి హంగామా చేశారు. పోలీస్‌స్టేషన్‌లో చొక్కా వదలి బనియన్‌తో నిరశన వ్యక్తం చేస్తూ వ్యక్తిగత ఫోకస్‌కు ప్రాధాన్యతనిచ్చారు. ఆనాటి నుంచి అవకాశం చిక్కినప్పుడల్లా నాయకులు ఇదేరకంగా ప్రవర్తిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే టీడీపీ నేత తూగుట్ల మధు గురువారం హల్చల్ చేసినట్లు సమాచారం. పులివెందుల సర్కిల్ ఇన్స్పెక్టర్ సమక్షంలోనే తే ల్చుకుందాం.. రండి అంటూ కవ్వింపు చర్యలకు పాల్పడటం వెనుక ఆంతర్యం ఇట్టే పసిగట్టవచ్చు. అయితే అటువంటి ఘటనలను నియంత్రించాల్సిన పోలీసు అధికారులు నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరించడంపై పలువురు తీవ్రంగా తప్పుబడుతున్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులు సంయమనంతో వ్యవహరించడంతో ఎలాంటి ఘటనలు ఉత్పన్నం కాలేదు. వాస్తవానికి పులివెందులలో తూగుట్ల మధు స్థాయి అతి చిన్నది, అలాంటిది కవ్వింపు చర్యలకు పాల్పడటం వెనుక ఆంతర్యం వ్యక్తిగతంగా ఫోకస్ కావడమేని పలువురు పేర్కొంటున్నారు. పోలీసు యంత్రాంగం నిష్పక్షపాతంగా ఎన్నికల నియమావళికి లోబడి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. -
తెలుగు తమ్ముళ్ల పైత్యానికి పరాకాష్ట
-
చౌక సినిమాలు