
మీరు ఇలియానాను ఫాలో అవుతున్నారా? అంటే ఆమె సినిమాలను, యాక్టింగ్‌ను అని కాదు. సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అవుతున్నారా? అయితే తప్పకుండా ఆండ్రూ నీబోన్‌ని మీరు చాలాసార్లు చూసి ఉంటారు. అతనొక మంచి ఫొటోగ్రాఫర్. ఇలియానా కొద్దికాలంగా పోస్ట్ చేస్తున్న ప్రతీ ఫొటో అతను తీసిందే అయి ఉంటుంది. లేదా వీరిద్దరూ కలిసి ఆ ఫొటోలో ఉంటారు. మొన్న ఆండ్రూ బర్త్‌డే సందర్భంగా ఒక ఫొటో పోస్ట్ చేసి, ‘హ్యాపీ బర్త్‌డే మై లవ్’ అంది ఇలియానా.
అంతవరకు బాగుంది. అంతకుముందు ఎప్పుడో చేసిన ఒక పోస్ట్‌లో బాయ్‌ఫ్రెండ్ అని అంటుంది. అంతకు చాలా ముందు చేసిన ఒక పోస్ట్‌లో ‘హబ్బీ’ (హజ్బండ్‌కి ముద్దుపేరు) అని పిలుచుకుంటుంది. ‘వీరిద్దరికీ ఇప్పటికే పెళ్లైపోయిందా?’ ఇది అందరికీ అప్పట్నుంచీ ఉన్న అనుమానం. ఆమెనే అడిగిస్తే పోతుంది కదా అని అడిగేశారు కొంతమంది. ‘అది పర్సనల్. పర్సనల్ లైఫ్ చాలా బాగుంది. ప్రొఫెషనల్ లైఫ్ లాగే!’ అంటుంది ఇలియానా. అంటే అతను హబ్బీనా? బాయ్‌ఫ్రెండా? ఇలియానే చెప్పాలి ఇంకెప్పుడైనా!
Comments
Please login to add a commentAdd a comment