నేనెలా ఉండాలో ఎవరైనా చెబితే... | When someone tries to tell me how I shld live my life says ileana | Sakshi
Sakshi News home page

నేనెలా ఉండాలో ఎవరైనా చెబితే...

Published Mon, Apr 17 2017 2:06 PM | Last Updated on Tue, Sep 5 2017 9:00 AM

నేనెలా ఉండాలో ఎవరైనా చెబితే...

నేనెలా ఉండాలో ఎవరైనా చెబితే...

ముంబై :
తాను ఎలా ఉండాలో ఎవరైనా చెబితే తనకు తెగ చిరాకని మండిపడుతోంది హాట్ బ్యూటీ ఇలియానా. దక్షిణాదిలో మంచి స్థాయికి చేరుకున్న హీరోయిన్లు ఇక్కడ అవకాశాలను కాలదన్నుకుని బాలీవుడ్‌ మోహంతో అక్కడ అవకాశాల కోసం నానా తంటాలు పడుతుండడం చూస్తునే ఉన్నాం. బాలీవుడ్‌లో ప్రవేశించిన అతి కొందరు నటీమణులే సక్సెస్‌ అయ్యారు. అదీ కొన్ని చిత్రాలకే పరిమితం. మరి కొందరు ఒకటి రెండు చిత్రాలతోనే సరిపెట్టుకున్నారు. అలా టాలీవుడ్‌లో ఒక వెలుగు వెలిగిన నటి ఇలియానా దక్షిణాది అవకాశాలను వదులుకొని, బాలీవుడ్‌ రంగప్రవేశం చేసింది. అక్కడ తొలి చిత్రం బర్ఫీ చిత్రం ఈ గోవా సుందరికి మంచి పేరునే తెచ్చి పెట్టింది. దీంతో అక్కడ తన భవిష్యత్‌ ఉజ్వలమేనని కలలు కనేసింది కూడా.

అయితే ఈ అమ్మడు ఐదేళ్లలో ఐదు హిందీ చిత్రాలను మాత్రమే చేసింది. ఆ తరువాత బాలీవుడ్‌ ఇలియానా పక్కన పెట్టేసింది. దీంతో ఎక్కడ పారేసుకున్నానో అక్కడే వెతుక్కోవడానికి ప్రయత్నాలు మొదలెట్టిందని సమాచారం. అందుకు ఇలియానా ఎంచుకున్న విధానం ఎప్పుడూ ఏదో ఇక సంచలన చర్యలతో వార్తల్లో ఉండడం. చాలా మంది వాడుకునే ట్రిక్కే ఇది.

ఇలియానా తన బాయ్‌ఫ్రెండ్‌ తీసిన ఫొటోలను ఇంటర్నెట్‌లో పోస్ట్‌ చేయడం, సెక్స్‌ గురించి మాట్లాడడం లాంటి చీప్‌ ట్రిక్కులను పాటిస్తోంది. ఇలాంటివి ఈ నాజూకు అమ్మడిని వార్తల్లోకెక్కిస్తున్నాయి గానీ, అవకాశాలు మాత్రం రావడంలేదు.  ఈ భామ ఇటీవలే ఈత దుస్తులతో కూడిన ఫొటోలను, బాత్ రూం టబ్లో దిగిన నగ్న ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆఫర్ల కోసం మరీ ఇంతలా చీప్ ట్రిక్లను వాడాలా అంటూ కొందరు నెటిజన్లు ఘాటుగానే స్పందించారు. అయితే ఇప్పుడు ఇలియానా మిడిల్ ఫింగర్ చూపిస్తూ దిగిన ఓ ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది. తన లైఫ్ తన ఇష్టమని, తనకు నచ్చినట్టే ఉంటానని అంటోంది. ఎవరైనా తాను ఎలా ఉండాలో చెప్పాలని ప్రయత్నిస్తే..అని ఓ క్యాప్షన్ పెట్టి ఈ ఫోటోను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement