
తమిళసినిమా: బాలీవుడ్ సుందరీమణులు దక్షిణాది చిత్రాల్లో నటించడానికి ఆసక్తి చూపడంతో పాటు, ఇక్కడ నిలదొక్కుకోవాలని ఆశపడుతున్నారు. అలా ఇలియానా, తాప్సీ, హన్సిక వంటి హీరోయిన్లు ఇక్కడ రాణించిన వారే. అయితే ఇటీవల బాలీవుడ్ బ్యూటీల తాకిడి ముఖ్యంగా కోలీవుడ్‌లో తగ్గిందనే టాక్ వినిపించినా, వారి దిగుమతి మాత్రం జరుగుతూనే ఉంది. అలా అన్యాసింగ్ అనే వర్ధమాన బాలీవుడ్ నటి తాజాగా దక్షిణాదికి పరిచయం అవుతోంది. బాలీవుడ్‌లో లెక్స్ టాలియానిస్, ఖైదీ బ్రాండ్ చిత్రాల్లో నటించిన ఈ జాణ ఇప్పుడు ఒకే చిత్రంతో తెలుగు, తమిళ భాషల్లో పరిచయం కానుంది.
ఇంతకు అట్టకత్తి దినేశ్ హీరోగా తిరుడన్ పోలీస్, ఉల్‌కుత్తు చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు కార్తీక్ రాజా తాజాగా ద్విభాషా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సందీప్‌కిషన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా బాలీవుడ్ బ్యూటీ అన్యాసింగ్ నటిస్తోంది. ఇప్పటికే ఒక షూటింగ్ ఒక షెడ్యూల్‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్రం సూపర్ నేచురల్ ఎంటర్‌టెయినర్‌గా ఉంటుందని దర్శకుడు పేర్కొన్నారు. అన్ని వర్గాల వారిని అలరించే విధంగా చిత్రం ఉంటుందని, హీరోయిన్ పాత్రకు ఒక పెక్యులర్ నటి అవసరం అవడంతో అన్యాసింగ్ బాగుంటుందని ఆమెను ఎంపిక చేసినట్లు చెప్పారు. ఇందులో నటుడు కరుణాకరన్ హాస్య పాత్రలో నటిస్తున్నారు. నటి అన్యాసింగ్‌ను తమిళ, తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment