ఈ హీరోయిన్ ఎవరో తెలుసా? | heroine turns more skinny for her next movie | Sakshi
Sakshi News home page

ఈ హీరోయిన్ ఎవరో తెలుసా?

Published Sat, Jul 23 2016 12:52 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM

heroine turns more skinny for her next movie

హైదరాబాద్:

చక్కనమ్మ చిక్కినా బాగానే ఉంటుందని అంటారు. కానీ, మరీ సలు గుర్తుపట్టలేనంతగా తయారైతే మాత్రం దాదాపు చూడటమే కష్టం అవుతుంది. ప్రస్తుతం టాలీవుడ్లో అవకాశాలు దొరక్క.. బాలీవుడ్ బాట పట్టిన సన్నసుందరి ఇలియానా ఇలాగే ఉంది. అక్షయ్ కుమార్తో కలిసి చేస్తున్న రుస్తుం సినిమా కోసం ఆమె తయారైన తీరు చూసి అభిమానులే ఆశ్చర్యపోతున్నారు.

అసలు ఈ ఫొటోలో ఉన్నది ఇల్లీబేబీయేనా కాదా అని అనుమాన పడుతున్నారు. ముఖం పీక్కుపోయి, దవడలు లోపలకు వెళ్లి, భుజం ఎముకలు బయటపడి.. ఒకరకంగా చెప్పాలంటే చూడటానికి అందవికారంగా తయారైందీ గోవా బ్యూటీ. ఎందుకిలా చేస్తోందని ప్రేక్షకులకు అనుమానం వస్తుందని.. ముందుగానే ఆ ఫొటోను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చెయ్యడమే కాక.. ఆ విషయాన్ని ట్విట్టర్లోనూ పోస్ట్ చేసింది. కొత్త సినిమాలో తన లుక్ ఎలా ఉంటుందో అందరికీ చెబుతానని, ఆ పిచ్చి ఫొటోలను కూడా అందరికీ పంచుతానని చెప్పింది. ఈ ఫొటోలు చూసి ఏం చేయాలో తెలియక అభిమానులు తల పగలగొట్టుకుంటున్నారట.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement