rustom movie
-
లీగల్ చర్యలకు సిద్ధం: ట్వింకిల్ ఖన్నా
సాక్షి, ముంబై: నటి, బాలీవుడ్ అగ్రహీరో అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా లీగల్ చర్యలకు సిద్ధమైపోయింది. రుస్తుం సినిమాలో అక్షయ్ ధరించిన దుస్తులను వేలానికి ఉంచిన విషయం తెలిసిందే. ఈ సంగతి తెలిసిన ఓ అధికారి ట్వింకిల్ ఖన్నాకు ట్వీటర్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. ‘నీ భర్త సినిమాలో ధరించిన కాస్టూమ్ మాత్రమే. అది యూనిఫామ్ కాదు. సైనికాధికారుల భార్యలు తమ భర్తల దుస్తులను వేలం వేయాలని చూడరు. అది చాలా గౌరవంతో కూడుకున్నది... ఒకవేళ యూనిఫామ్ పేరిట నువ్వు పిచ్చి వేషాలేస్తే నిన్ను కోర్టుకి లాగుతా. మా యూనిఫామ్‌ను తాకాలని చూస్తే నీ ముఖం పగలకొడతా’ అంటూ సందేశం పెట్టాడు. ఆయన లెఫ్టినెంట్ కల్నల్ సందీప్ అహ్లావట్గా తర్వాత నిర్ధారణ అయ్యింది. ఇక ఈ విషయాన్ని ట్వింకిల్ ఖన్నా ట్విటర్లో ప్రస్తావించారు. బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని.. భౌతిక దాడులకు పాల్పడతామన్నందుకు ఆయనపై లీగల్ చర్యలు తీసుకుంటానని ఆమె తెలిపారు. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్‌కుమార్ కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘రుస్తుం’.. ఫ్రైడేస్ ఫిలిం వర్క్ పతాకంపై టీనూ సురేష్ దేశాయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నౌకాదళ అధికారి ‘రుస్తుం పావరి’ దేశం కోసం పోరాడిన అంశం నేపథ్యంతో చిత్రం రూపొందింది. రెండేళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద రూ. 124 కోట్లు సాధించి విజయం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రంలో అక్షయ్ ధరించిన దుస్తులని వేలం వేశారు. 20 వేల నుండి ప్రారంభమైన ఈ వేలం శుక్రవారం సాయంత్రానికి 3 కోట్లకి చేరింది. మే 26 సాయంత్రం 9.30ని.లకి వేలం ముగియనుంది. వచ్చిన మొత్తాన్ని జంతువుల సంరక్షణ కోసం పనిచేసే ఓ ఎన్జీవోకు అక్షయ్ విరాళంగా ఇవ్వనున్నాడు. And this response to @mrsfunnybones ill advised idea to auction the Rustom costume comes from one of the finest men in uniform I know- Lt Col Sandeep Ahlawat. pic.twitter.com/lwDXuG0CLm — Sandeep (@SandeepUnnithan) 28 April 2018 As a society do we really think it’s all right to threaten a woman with bodily harm for trying to raise funds for a charity by auctioning a uniform used in a movie,a piece of film memorabilia ? I will not retaliate with violent threats but by taking legal action! #JaiHind https://t.co/OF7e5lTHel — Twinkle Khanna (@mrsfunnybones) 29 April 2018 -
ఇలియానా సినిమాకు బంపర్ వసూళ్లు!
చాలా రోజుల నుంచి సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న గోవా బ్యూటీ ఇలియానా.. ఎట్టకేలకు బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ మంచి హిట్ సంపాదించింది. తన భర్త అక్షయ్ కుమార్‌కు ద్రోహం చేసి.. తర్వాత మళ్లీ పశ్చాత్తాపంతో అతడి పంచన చేరిన భార్యగా ఆమె, తన శత్రువును చంపేసి కూడా ఆ హత్య కేసు నుంచి తెలివిగా బయటపడిన నేవీ అధికారి పాత్రలో అక్షయ్ కుమార్ నటించిన రుస్తుం సినిమా నాలుగు వారాల్లో 127 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ముందునుంచే హిట్ టాక్ సంపాదించుకున్న రుస్తుం సినిమాకు విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి. మొదటి వారం రూ. 90.90 కోట్లు, రెండోవారం 26.11 కోట్లు, మూడోవారం 7.71 కోట్లు, నాలుగోవారం 2.4 కోట్లతో మొత్తం రూ. 127.13 కోట్ల వసూళ్లను కేవలం భారతదేశ మార్కెట్లోనే సాధించిందని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. ఇటీవలి కాలంలో మొదటి వారంలోనే అత్యధిక వసూళ్లు వస్తున్నాయన్న విషయాన్ని కూడా ఈ సినిమా మరోసారి నిరూపించింది. మొత్తం వసూళ్లలో సింహభాగం దాదాపు 91 కోట్ల రూపాయలు మొదటివారంలోనే రావడం గమనార్హం. #Rustom Week 1: ₹ 90.90 cr Week 2: ₹ 26.11 cr Week 3: ₹ 7.71 cr Week 4: ₹ 2.41 cr Total: ₹ 127.13 cr. India biz. SUPER HIT! — taran adarsh (@taran_adarsh) 9 September 2016 -
ఈ హీరోయిన్ ఎవరో తెలుసా?
హైదరాబాద్: చక్కనమ్మ చిక్కినా బాగానే ఉంటుందని అంటారు. కానీ, మరీ సలు గుర్తుపట్టలేనంతగా తయారైతే మాత్రం దాదాపు చూడటమే కష్టం అవుతుంది. ప్రస్తుతం టాలీవుడ్లో అవకాశాలు దొరక్క.. బాలీవుడ్ బాట పట్టిన సన్నసుందరి ఇలియానా ఇలాగే ఉంది. అక్షయ్ కుమార్‌తో కలిసి చేస్తున్న రుస్తుం సినిమా కోసం ఆమె తయారైన తీరు చూసి అభిమానులే ఆశ్చర్యపోతున్నారు. అసలు ఈ ఫొటోలో ఉన్నది ఇల్లీబేబీయేనా కాదా అని అనుమాన పడుతున్నారు. ముఖం పీక్కుపోయి, దవడలు లోపలకు వెళ్లి, భుజం ఎముకలు బయటపడి.. ఒకరకంగా చెప్పాలంటే చూడటానికి అందవికారంగా తయారైందీ గోవా బ్యూటీ. ఎందుకిలా చేస్తోందని ప్రేక్షకులకు అనుమానం వస్తుందని.. ముందుగానే ఆ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చెయ్యడమే కాక.. ఆ విషయాన్ని ట్విట్టర్లోనూ పోస్ట్ చేసింది. కొత్త సినిమాలో తన లుక్ ఎలా ఉంటుందో అందరికీ చెబుతానని, ఆ పిచ్చి ఫొటోలను కూడా అందరికీ పంచుతానని చెప్పింది. ఈ ఫొటోలు చూసి ఏం చేయాలో తెలియక అభిమానులు తల పగలగొట్టుకుంటున్నారట. I finally get to talk about my look in the film!!!!!! N share these mad bts photos with u all!… https://t.co/WNrn9UbL7u — Ileana D'Cruz (@Ileana_Official) 23 July 2016