South Film Producer Council Banned Ileana From Doing South Films, Reasons Inside - Sakshi
Sakshi News home page

Ileana South Films Ban: ఇలియానాపై నిషేధం.. 10 ఏళ్ల తర్వాత బయటపడ్డ అసలు నిజం!

Published Sat, Feb 11 2023 11:50 AM | Last Updated on Sat, Feb 11 2023 2:45 PM

South Film Producer Council Ban Ileana - Sakshi

తొలి సినిమా ‘దేవదాస్‌’తోనే అటు ఫిల్మ్‌ ఇండస్ట్రీని, ఇటు యూత్‌ని తనవైపుకు తిప్పుకుంది ఇలియానా. రెండో సినిమా పోకిరితో స్టార్‌ హీరోయిన్‌ అయింది. ఆ తర్వాత ఇలియానా వెనక్కి తిరిగి చూడలేదు. తెలుగులో వరుస సినిమాలు చేస్తూ.. అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్‌గా అవతరించింది. సౌత్‌లో కెరీర్‌ మంచి పీక్స్‌లో ఉన్నప్పుడే తన మకాంని బాలీవుడ్‌కి మార్చింది. అక్కడ వరుస సినిమాలు చేసినప్పటికీ.. ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. అయినా కూడా మళ్లీ సౌత్‌ ఇండస్ట్రీ వైపు చూడలేదు.  2018లో అమర్‌ ఆక్బర్‌ ఆంటోనీ తర్వాత ఇలియానా తెలుగు తెరపై కనిపించలేదు.

అయితే బాలీవుడ్‌పై ఉన్న మోజుతోనే ఇలియానా సౌత్‌ ఇండస్ట్రీని పక్కకి పెట్టిందని అంతా అనుకున్నారు. కానీ ఆమె కావాలని సౌత్‌ సినిమాలకు దూరంగా వెళ్లలేదట. సౌత్‌ ఫిల్మ్‌ ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ ఇలియానాపై నిషేదం విధించిందట. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఈ నిజం ఇప్పుడు బయటకు వచ్చింది. ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమా సమయంలోనే ఇలియానా ఓ కోలీవుడ్‌ సినిమా చేసేందుకు ఒప్పుకుంది. కోలీవుడ్‌ నిర్మాత నటరాజ్‌.. విక్రమ్‌ హీరోగా నందం అనే మూవీ ప్లాన్‌ చేశాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఇలియానాను తీసుకున్నారు. ఆమెకు రూ.40 లక్షలు కూడా అడ్వాన్స్‌ ఇచ్చాడట. అయితే అనుకొని కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది.

దీంతో అడ్వాన్స్‌ డబ్బులు తిరిగి ఇవ్వమని నిర్మాత అడిగితే.. దానికి ఇలియానా నిరాకరించిందట. కావాలంటే మరో సినిమాలో నటిస్తాను కానీ డబ్బులు మాత్రం తిరిగి ఇవ్వనని తెగేసి చెప్పిందట. దీంతో సదరు నిర్మాత నడిగర్‌ సంఘంతో పాటు సౌత్‌ ఫిల్మ్‌ ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ని ఆశ్రయించారట. వారు కూడా చెప్పిన వినకపోవడంతో.. డబ్బులు తిరిగి ఇచ్చే వరకు ఇలియానాను సౌత్‌ సినిమాల్లో తీసుకోకూడదని నిర్ణయించుకున్నారట. అందుకే ఇలియానా తెలుగు సినిమాలకు దూరమైనట్లు తెలుస్తుంది. అయితే ఇటీవల ఈ సమస్యను ఇలియాన పరిష్కరించుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆమె సౌత్‌ సినిమాల్లో నటిస్తుందనే ప్రచారం టీటౌన్‌లో గట్టిగా వినిపిస్తోంది. మరి ఈ గోవా బ్యూటీ ఏ హీరోతో రీఎంట్రీ ఇస్తుందో చూడాలి. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement