
జాకీచాన్‌తో ఇలియానా!
యాక్షన్ సూపర్‌స్టార్ జాకీచాన్‌తో ఇలియానా నటించనున్నారా? ప్రస్తుతం బాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తున్న వార్త ఇది. జాకీ చాన్ తాజా చిత్రం ‘కుంగ్ ఫూ యోగా’ ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే. భారత్-చైనా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాకీ చాన్ సరసన హీరోయిన్‌గా నటించడానికి ఇలియానాను తీసుకున్నారని సమాచారం. స్టాన్లీ టాంగ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో ఓ కీలక పాత్ర కోసం సోనూ సూద్‌ను ఎంపిక చేశారు.
వాస్తవానికి ఇందులో ఓ కీలక పాత్రకు ఆమిర్ ఖాన్‌ను, కథానాయిక పాత్రకు కత్రినా కైఫ్‌లను తీసుకోవాలనుకున్నారట, డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో వారిద్దరూ ఈ ప్రాజెక్టును తిరస్కరించాల్సి వచ్చింది. ఆ తర్వాత హృతిక్ రోషన్‌ను తీసుకోవాలనుకున్నారు. అదీ కుదర్లేదు. మరి.. ఆ పాత్రకే సోనూ సూద్‌ని తీసుకున్నారా? అని తెలియాల్సి ఉంది. కత్రినా కైఫ్‌ని అనుకున్న పాత్రకు మాత్రం ఇలియానాని తీసుకున్నారట. ఇదిలా ఉంటే.. గతంలో ‘ద మిత్’ చిత్రంలో జాకీ సరసన మల్లికా శెరావత్ జాకీచాన్‌తో నటించారు. ఒకవేళ ఇప్పుడీ చిత్రంలో ఆయన సరసన ఇలియానా జతకడితే, అప్పుడు జాకీ చాన్ జాకీ సరసన నటించే రెండో భారతీయ నటి ఇలియానానే అవుతారు.