అప్పుడు అవి తప్ప ఏమీ ఉండవు..! | Ileana D'Cruz tells about her birth marks! | Sakshi
Sakshi News home page

అప్పుడు అవి తప్ప ఏమీ ఉండవు..!

Published Mon, Mar 14 2016 11:00 PM | Last Updated on Sun, Sep 3 2017 7:44 PM

అప్పుడు అవి తప్ప ఏమీ ఉండవు..!

అప్పుడు అవి తప్ప ఏమీ ఉండవు..!

మంచి మాట ఎవరు చెప్పినా బాగానే ఉంటుంది. అందగత్తెలు చెబితే మరీ మరీ బాగుంటుంది. ఇప్పుడు ఇలియానా చెప్పిన మాటలు నిజంగా మంచివే. ఈ బ్యూటీ చెప్పడంవల్ల చాలా చాలా మంచి మాటల్లా అనిపిస్తాయి. ఇటీవల ఇలియానా ఇండొనేసియాలోని బాలీ వెళ్లారు. అక్కడి బీచ్‌కి సమీపంలో ఉన్న ఐదు నక్షత్రాల హోటల్‌లో బస చేశారు. హోటల్ లాన్ నుంచి బీచ్ కనపడుతుంది. లాన్‌లో ఉన్న ఈత కొలనులో ఈత కొట్టి, పక్కనే ఉన్న కుర్చీలో రిలాక్సయి, సెల్ఫీ తీసుకున్నారు ఇలియానా. బికినీలో ఇలియానా తీసుకున్న ఆ సెల్ఫీ ఫొటోలు ఓ రేంజ్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ‘‘స్కిన్ ట్యాన్ (ఎండలకు నల్లబడటం) అయ్యింది. ఈ ట్యాన్‌ని మిస్సయిపోతున్నా’’ అని బాలీ నుంచి తిరుగు ప్రయాణం అయినప్పుడు ఇలియానా పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ - ‘‘మన దేహం ఏ బొమ్మా గియ్యని ఖాళీ కాన్వాస్ లాంటిది. పుట్టేటప్పుడు బర్త్ మార్క్స్ తప్ప ఆ కాన్వాస్‌పై ఏమీ ఉండవు. పెరిగేకొద్దీ మచ్చలు, ముడతలు వద్దన్నా వచ్చేస్తాయి. గాయాల తాలూకు ఆనవాళ్లు మిగిలిపోతాయ్. ఈ ప్రపంచంలో మనం బతికాం అనడానికి ఇవే ఆనవాళ్లు. మనం బతికున్నంత కాలం శాశ్వతంగా నిలిచిపోయే వీటిని ప్రేమించాలి’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement