Selfhi
-
మంచు కొండల్లో క్లిక్!
వీళ్లిద్దరూ తల్లీకూతుళ్లా? అక్కాచెల్లెళ్లా? అనే డౌటు శ్రీదేవి, ఆమె పెద్ద కూతురు జాన్వీని చూసినప్పుడు కలగడం సహజం. ఫిఫ్టీ ప్లస్ ఏజ్‌లో ఉన్న శ్రీదేవి టీనేజ్‌లో ఉన్న తన కూతురికి అక్కలానే కనిపిస్తారు. ఆ రేంజ్లో ఫిజిక్‌ని మెయింటైన్ చేస్తున్నారామె. తన ఇద్దరు కూతుళ్లు జాన్వీ, ఖుషీలను దాచి దాచి పెంచలేదు శ్రీదేవి. తల్లితో పాటు ఈ కూతుళ్లిద్దరి దర్శనాలు కూడా బాగానే దొరికాయి. కానీ, దాదాపు ఏడాదిన్నరగా జాన్వీ కెమెరాలకు చిక్కడం లేదు. దానికి కారణం అమెరికాలో చదువుకుంటోంది. వీలున్నప్పుడల్లా కూతురి దగ్గరికి వెళ్లి వస్తుంటారు శ్రీదేవి, ఆమె భర్త బోనీకపూర్. ప్రస్తుతం శ్రీదేవి అక్కడే ఉన్నారు. మరి.. బోనీ కూడా వెళ్లారో లేదో తెలియదు కానీ, శ్రీదేవి మాత్రం కూతురితో కలిసి దిగిన సెల్ఫీలో కనిపించారు. ఈ తల్లీకూతుళ్లిద్దరూ సరదాగా మంచుకొండల్లో విహరించినట్లున్నారు. ఆ సందర్భంగా కూతురితో శ్రీదేవి దిగిన సెల్ఫీ ఇప్పుడు హల్చల్ చేస్తోంది. టీనేజ్‌లో శ్రీదేవి ఎంత అందంగా ఉండేవారో ఇప్పుడు జాన్వీ కూడా అంతే అందంగా ఉంది కదూ. చూడబోతుంటే తల్లిలానే జాన్వీలో కూడా మంచి హీరోయిన్ మెటీరియల్ ఉందనిపిస్తోంది. కూతుళ్లు సినిమాల్లోకి వస్తానంటే బోనీ, శ్రీదేవి కాదనరు. ఈ విషయాన్ని పలుమార్లు స్పష్టం చేశారీ దంపతులు. సో.. చదువు ముగిశాక జాన్వీ అరంగేట్రం కావడం ఖాయమే అని కొందరి ఊహ. -
ఒక్క సెల్ఫీ చాలు!
స్టయిలిష్ విలన్‌గా దూసుకెళుతున్నజగపతిబాబు ఇప్పుడు నిర్మాతగానూ మారాలనుకుంటున్నారు. తన తండ్రి స్థాపించిన జగపతి పిక్చర్స్‌ను పునఃప్రారం భించి మళ్లీ సినిమాలు నిర్మించ డానికి సన్నాహాలు చేస్తున్నారు. అంతే కాకుండా, సినిమా రంగం లోకి అడుగుపెట్టాలనుకునేవాళ్ల కోసం ‘క్లిక్సినీకార్ట్’ అనే వెబ్ సైట్‌ను ప్రారంభించారు. సోమవారం హైదరాబాద్‌లో దాసరి నారాయణరావు ఈ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. దాసరి మాట్లాడుతూ- ‘‘ సినిమాలు తీయాలనుకునే వారు, నటించాలనుకునేవారు పరిశ్రమలోకి వచ్చి మోసపోతున్నారు. ఇకమీద ఎవరికీ ఏ శ్రమ లేకుండా జగపతిబాబు మంచి ఐడియాతో ముందుకొచ్చారు. కొత్తవారితో సినిమా తీయాలనుకునే వారికి ఈ వెబ్సైట్ ఉపయోపడుతుంది’’ అన్నారు. ‘‘మా నాన్నగారు నిర్మాతైనా, నేను సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి కష్టాలుపడ్డా. ఏ నేపథ్యం లేకుండా వచ్చిన వాళ్ల పరిస్థితి ఏమిటన్న ఆలోచనతో దీన్ని ప్రారంభించా. ఓ సెల్ఫీ తీసుకుని ఈ పోర్టల్‌లో రిజిస్టరైతే చాలు. రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీ’’ అని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ ఐ.టి. సెక్రటరీ జయేశ్ రంజన్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
అప్పుడు అవి తప్ప ఏమీ ఉండవు..!
మంచి మాట ఎవరు చెప్పినా బాగానే ఉంటుంది. అందగత్తెలు చెబితే మరీ మరీ బాగుంటుంది. ఇప్పుడు ఇలియానా చెప్పిన మాటలు నిజంగా మంచివే. ఈ బ్యూటీ చెప్పడంవల్ల చాలా చాలా మంచి మాటల్లా అనిపిస్తాయి. ఇటీవల ఇలియానా ఇండొనేసియాలోని బాలీ వెళ్లారు. అక్కడి బీచ్‌కి సమీపంలో ఉన్న ఐదు నక్షత్రాల హోటల్లో బస చేశారు. హోటల్ లాన్ నుంచి బీచ్ కనపడుతుంది. లాన్లో ఉన్న ఈత కొలనులో ఈత కొట్టి, పక్కనే ఉన్న కుర్చీలో రిలాక్సయి, సెల్ఫీ తీసుకున్నారు ఇలియానా. బికినీలో ఇలియానా తీసుకున్న ఆ సెల్ఫీ ఫొటోలు ఓ రేంజ్లో హల్చల్ చేస్తున్నాయి. ‘‘స్కిన్ ట్యాన్ (ఎండలకు నల్లబడటం) అయ్యింది. ఈ ట్యాన్‌ని మిస్సయిపోతున్నా’’ అని బాలీ నుంచి తిరుగు ప్రయాణం అయినప్పుడు ఇలియానా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ - ‘‘మన దేహం ఏ బొమ్మా గియ్యని ఖాళీ కాన్వాస్ లాంటిది. పుట్టేటప్పుడు బర్త్ మార్క్స్ తప్ప ఆ కాన్వాస్‌పై ఏమీ ఉండవు. పెరిగేకొద్దీ మచ్చలు, ముడతలు వద్దన్నా వచ్చేస్తాయి. గాయాల తాలూకు ఆనవాళ్లు మిగిలిపోతాయ్. ఈ ప్రపంచంలో మనం బతికాం అనడానికి ఇవే ఆనవాళ్లు. మనం బతికున్నంత కాలం శాశ్వతంగా నిలిచిపోయే వీటిని ప్రేమించాలి’’ అన్నారు.