
రవితేజ, ఇలియానా
థియేటర్‌లోకి రావడానికి టైమ్ ఫిక్స్ చేసుకున్నారు రవితేజ. శ్రీను ౖవైట్ల దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తోన్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. ఇందులో ఇలియానా కథానాయికగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా హైదరాబాద్‌లో సాంగ్ చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా యూనిట్ నెక్ట్స్ షెడ్యూల్‌ను యూఎస్‌లో స్టార్ట్ చేయనుంది. ఈ నెల 20న మొదలయ్యే ఈ షెడ్యూల్ దాదాపు 40 రోజులకుపైగా జరుగుతుందట.
ఈ షెడ్యూల్‌తో ఈ సినిమా చిత్రీకరణ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుందని సమాచారం. రవితేజ మూడు పాత్రల్లో కనిపిస్తారని కొందరు, లేదు రవితేజ క్యారెక్టర్‌లోనే త్రీ షేడ్స్ ఉంటాయని మరికొందరు అంటున్నారు. మరి.. ఈ సినిమాలో రవితేజ ఒక్కరిగా వస్తారా? లేక ముగ్గురిలా అలరిస్తారా? అనేది తెలియాలంటే కాస్త టైమ్ పడుతుంది. ఈ సినిమాను సెప్టెంబర్ 28న రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోందని టాక్. తరుణ్ అరోరా, అభిమన్యుసింగ్, ‘వెన్నెల’ కిశోర్ తదితరులు నటిస్తోన్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment