1 ప్రముఖ నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి రాసిన రచనల్లో సినిమాగా వచ్చిన మొదటి నవల ఏది?
ఎ) మీనా బి) రాధాకృష్ణ సి) సెక్రటరీ డి) అగ్నిపూలు
2 సులోచనారాణి నవలా చిత్రాల్లో ఎక్కువగా నటించిన తెలుగు హీరో ఎవరో కనుక్కోండి?
ఎ) ఎన్టీఆర్ బి) కృష్ణ సి) చిరంజీవి డి) అక్కినేని నాగేశ్వరరావు
3 ‘ఇడియట్’ సినిమా హీరోగా రవితేజకు, దర్శకుడిగా పూరి జగన్నాథ్‌కు మైల్‌స్టోన్ లాంటిది. కానీ మొదట ఆ సినిమాను కన్నడ భాషలో తీశారు పూరి. ఆ సినిమా ద్వారా పరిచయమైన హీరో ఎవరో తెలుసా?
ఎ) ఉపేంద్ర బి) శివ రాజ్‌కుమార్ సి) పునీత్ రాజ్‌కుమార్ డి) సుదీప్
4 సులోచనారాణి రాసిన ‘గిరిజా కల్యాణం’ నవల ఆధారంగా రూపొందిన ‘గిరిజా కల్యాణం’ చిత్రంలో హీరోయిన్‌గా నటించిందెవరు?
ఎ) జయసుధ బి) జయప్రద సి) వాణిశ్రీ డి) జయలలిత
5 బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సంజు’. ఈ చిత్రంలో టైటిల్ రోల్ చేస్తోన్న హీరో ఎవరు?
ఎ) రణ్‌బీర్ కపూర్ బి) అర్జున్ కపూర్ సి) షాహిద్ కపూర్ డి) సంజయ్ కపూర్
6 తేజ దర్శకత్వంలో వచ్చిన ‘జయం’ సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు నితిన్. కానీ ఆ సినిమాలో మొదట హీరోగా అనుకున్నది నితిన్‌ని కాదు. మరి ఆ హీరో ఎవరయ్యుంటారు?
ఎ) ప్రభాస్ బి) అల్లు అర్జున్ సి) ఉదయ్ కిరణ్ డి) గోపీచంద్
7 నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి ఈ నటుని అసలు పేరు. ఎవరా నటుడు?
ఎ) కల్యాణ్ చక్రవర్తి బి) శ్రీకాంత్ సి) జేడీ చక్రవర్తి డి) రామ్‌కీ
8 దర్శకురాలు నందినీ రెడ్డి తన కొత్త ప్రాజెక్టును వైజయంతి మూవీస్‌లో చేస్తున్నారు. ఆ చిత్రంలో హీరో ఎవరో తెలుసా?
ఎ) నానీ బి) నాగశౌర్య సి) విజయ్ దేవరకొండ డి) దుల్కర్ సల్మాన్
9 అల్లు అర్జున్ సరసన ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలో ఓ హీరోయిన్‌గా కేథరిన్ థెరిస్సా నటించారు. మరో హీరోయిన్ ఎవరు?
ఎ) దిశా పాట్ని బి) ఇలియానా సి) అమలా పాల్ డి) మన్నారా చోప్రా
10 65వ జాతీయ చలనచిత్ర అవార్డ్సులో ‘బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇన్ తెలుగు’ అవార్డును సొంతం చేసుకున్న చిత్రమేదో చెప్పుకోండి చూద్దాం?
ఎ) శతమానం భవతి బి) ఘాజీ సి) పెళ్లి చూపులు డి) బాహుబలి
11 యద్దనపూడి సులోచనారాణి అమెరికాలోని ఏ రాష్ట్రంలో స్వర్గస్తులైనారోతెలుసా?
ఎ) టెక్సాస్ బి) డల్లాస్ సి) కాలిఫోర్నియా డి) వాషింగ్టన్
12 ‘గంగోత్రి’ నుండి ‘నా పేరు సూర్య–నా ఇల్లు ఇండియా’ వరకు హీరోగా అల్లు అర్జున్ ఎన్ని చిత్రాల్లో నటించారో తెలుసా? (అతిథి పాత్రలు కాకుండా)
ఎ) 18 బి) 24 సి) 26 డి) 21
13 కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘స్వాతిముత్యం’ సినిమాలో హీరోయిన్ రాధిక. ఆ సినిమా హిందీ రీమేక్ ‘ఈశ్వర్’లో నటించిన హీరోయిన్ ఎవరో కనుక్కోండి?
ఎ) రాధిక బి) రాధ సి) గీత డి) విజయశాంతి
14 íహీరోలు సిక్స్ ప్యాక్ చేయడం కామన్. అలాంటిది కమెడియన్‌పాత్రలతో పైకొచ్చిన ఈ నటుడు సిక్స్ ప్యాక్ చేశారు. ఎవరతను?
ఎ) ‘వెన్నెల’ కిశోర్ బి) శ్రీనివాసరెడ్డి సి) సునీల్ డి) అలీ
15 రీసెంట్‌గా ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ అహూజాను పెళ్లాడిన బాలీవుడ్ నటి ఎవరో తెలుసా?
ఎ) ప్రియాంకా చోప్రా బి) సోనమ్ కపూర్ సి) అనుష్కా శర్మ డి) కత్రినా కైఫ్
16 సులోచనా రాణి సెక్రటరీ నవలను అదే పేరుతో సినిమాగా తీశారు డి. రామానాయుడు. అక్కినేని, వాణిశ్రీల కాంబినేష లో ఆయన ఈ చిత్రాన్ని ఏ దర్శకునితో నిర్మించారో తెలుసా?
ఎ) ఎ.కోదండ రామిరెడ్డి బి) కె.యస్.ప్రకాశ్‌రావు సి) కె.రాఘవేంద్రరావు డి) ప్రత్యగాత్మ
17 ‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోని హీరో కాకముందు ఓ శాఖలో మంచి టెక్నీషియన్. ఏ శాఖలో ఆయన పని చేశారో తెలుసా?
ఎ) ఫైట్ మాస్టర్ బి) సింగర్ సి) సంగీత దర్శకుడు డి) ఎడిటర్
18 ‘మీనా’ చిత్రదర్శకురాలెవరో కనుక్కోండి? చిన్న క్లూ: దర్శకురాలిగా ఆమెకది మొదటి సినిమా
ఎ) సావిత్రి బి) జమున సి) అంజలీ దేవి డి) విజయ నిర్మల
19 ఈ ఫొటోలోని చిన్నారి ఎవరు?
ఎ) అనుష్క బి) త్రిష సి) ఆలియాభట్ డి) సమంత
20 పై స్టిల్‌లో ఉన్న ప్రముఖ నటుడెవరో తెలుసా?
ఎ) రేలంగి బి) రాజనాల సి) పధ్మనాభం డి) రమణా రెడ్డి
మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి!
సమాధానాలు
1) ఎ 2) డి 3) సి 4) బి5) ఎ 6) బి 7) సి 8) సి 9) సి 10) బి 11) సి
12) డి 13) డి 14) సి 15) బి 16) బి 17) సి 18) డి 19) ఎ 20) ఎ
నిర్వహణ: శివ మల్లాల
Comments
Please login to add a commentAdd a comment