
ఇలియానా పోర్చుగీసు అమ్మాయి. ముంబైలో ఉంటోంది. ఆండ్రూ నీబోన్ ఆస్ట్రేలియా అబ్బాయి. ఇండియాలో ఉంటున్నాడు. ఇద్దరూ కలిసి కొంతకాలంగా ఫ్రీ బర్డ్స్‌లా ఎక్కడబడితే అక్కడ ఎగురుతూ కనిపిస్తున్నారు. ఊహు.. ఫ్రీ బర్డ్స్ కాదు. లవ్ బర్డ్స్! ఊహూ.. లవ్ బర్డ్స్ కూడా కాదు. లవింగ్ కపుల్! కపుల్ అంటే? అయ్య బాబోయ్ ఇలియానా పెళ్లయిపోయిందా? అలా గుండెలు బాదేసుకోకండి బాయ్స్! ఇలియానాకు, ఆండ్రూకీ పెళ్లి అయిందో లేదో కానీ, అయినట్లే కనిపిస్తోంది. ఏం కనిపిస్తోంది? ఇలియానా ఇన్‌స్టాగ్రామ్‌లో.. ఆండ్రూపై ఆమె చూపిస్తున్న లవ్ కనిపిస్తోంది.
అఫెక్షన్ కనిపిస్తోంది. భార్యాభర్తలు తప్ప ఇంకెవరూ ఇంత దగ్గరగా ఉండరు కనుక.. కాగల వివాహకార్యం ఆల్రెడీ ఎక్కడో, ఎప్పుడో జరిగినట్టే ఉందని బాలీవుడ్ ఊహిస్తోంది. ఊదరగొడుతోంది. ఆండ్రూ మంచి ఫొటోగ్రాఫర్. సినిమాటోగ్రాఫర్ కూడా చూపించలేనంత అందంగా ఇలియానాను షూట్ చేశాడు. ఆ ఫొటోలే ఇప్పడు ఇలియానా ఇన్‌స్టాగ్రామ్ నుండి విడుదల అవుతున్నాయి. వాటిని చూసి షాక్ తినేవాళ్లు తింటున్నారు. జెలసీ ఫీల్ అయ్యేవారు ఫీల్ అవుతున్నారు. ‘కోతి మొహం’ అనేవాళ్లు అంటున్నారు. ఎవరిదట కోతి మొహం!! కుళ్లుమోతులు ఏమైనా అంటారు. పట్టించుకోకండి.