అది ఇప్పట్లో జరగదు! | ‘Happy Ending’ not the end of my career: Ileana D’Cruz | Sakshi
Sakshi News home page

అది ఇప్పట్లో జరగదు!

Published Sun, Mar 27 2016 11:39 PM | Last Updated on Sun, Sep 3 2017 8:41 PM

అది  ఇప్పట్లో   జరగదు!

అది ఇప్పట్లో జరగదు!

షూటింగ్స్ లేనప్పుడు మీరేం చేస్తారు? అని ఇలియానాని అడిగితే... ‘ఇంటి పనులు చేస్తా’ అని చెబుతారు. గిన్నెలు కడగడం, వాషింగ్ మిషన్ ఉన్నప్పటికీ చేత్తో బట్టలు ఉతకడం వంటివన్నీ చేస్తారట. ఇలాంటి పనులు చేయడానికి మనుషులు ఉన్నప్పటికీ పనిగట్టుకుని ఇలియానా చేయడానికి కారణం ఉంది. దాని గురించి ఈ గోవా బ్యూటీ చెబుతూ - ‘‘సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టే ముందు, షూటింగ్ స్పాట్‌లో మినహా ఎక్కడ ఉన్నా నా పనులు నేనే చేసుకోవాలని ఒట్టేసుకున్నా. ఆర్టిస్ట్‌గా చేయడమంటే అందరి మీదా ఆధారపడటమే అని నా ఫీలింగ్. హెయిర్ స్టైల్‌కి ఒకరు, మేకప్ చేయడానికి ఇంకొకరు, కాస్ట్యూమ్స్ కోసం ఒకరు, మేకప్ టచప్ కోసం ఒకరు.. ఇలా చాలామంది స్టాఫ్ ఉంటారు. వద్దనుకున్నా వాళ్ల మీద ఆధారపడాల్సిందే. ఎవరి మీదా ఆధారపడకుండా మన పనులు మనం చేసుకోగలిగేది ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే.

ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ఇంట్లో ఉన్నప్పుడు క్లీనింగ్, కుకింగ్ వంటివన్నీ నేనే చేస్తా. ఆ క్షణాల్లో నేనో సెలబ్రిటీని అనే విషయాన్ని కూడా మర్చిపోతాను. అది చాలా హాయిగా ఉంటుంది’’ అన్నారు. ఆ సంగతలా ఉంచితే.. హిందీలో ఆమె నటించిన ‘హ్యాపీ ఎండింగ్’ విడుదలై ఏడాదిన్నర పైనే అయ్యింది. ఈ గ్యాప్‌లో ఆమె అక్కడ వేరే సినిమాలు ఒప్పుకోలేదు. దాంతో ఇలియానా కెరీర్ ఎండ్ అయ్యిందని చాలామంది ఫిక్స్ అయ్యారు. అది తప్పని నిరూపిస్తూ.. ఈ మధ్యే ‘రుస్తుమ్’ అనే చిత్రంలో నటించడానికి అంగీకరించారామె. ‘‘నా కెరీర్ అయి పోయిందను కున్నారేమో.. అది ఇప్పట్లో జరగదు’’ అని ఇలియానా పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement