కార్మికుల జీవితాలతో సంఘాల చెలగాటం
Published Sat, Aug 6 2016 12:33 AM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM
రెబ్బెన(ఆదిలాబాద్) : కొన్ని కార్మిక సంఘాల నాయకులు సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని హెచ్‌ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్‌అహ్మద్ అన్నారు. శుక్రవారం బెల్లంపల్లి ఏరియా పరిధి డోర్లి–1 గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడు తూ గుర్తింపు సంఘంగా ఉన్న టీబీజీకేఎస్ వారసత్వపు ఉద్యోగాలు, సకల జనుల సమ్మె కాలానికి వేతనం ఇప్పిం చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సమ్మె కాలాన్ని స్పెషల్ క్యాజువల్ లీవ్‌గా పరిగణించి వేతనం మంజూరు చేయాలని ఆదేశిస్తే గుర్తింపు సంఘం కావాల నే అడ్డుకుందన్నారు. వారసత్వపు ఉద్యోగాలను కోల్పోయిన సమయంలోనే అన్ని సంఘాలు ఏకమై సమ్మె నోటీసు ఇస్తే ఆనాడే ఉద్యోగాలు తిరిగి వచ్చి ఉండేవని, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ నాయకులు మెడికల్ బోర్డు లో పైరవీల కోసమే రాకుండా చేశారని ఆరోపించారు. ఆ తర్వాత టీబీజీకేఎస్ నాయకులు బోర్డులో పైరవీలు ప్రారంభించటంతోనే సంఘం రెండుగా చీలి పోయిందని చెప్పారు. సమస్యలపై నిర్భయంగా పోరాడినందుకే హెచ్‌ఎం ఎస్ నాయకులపై సస్పెన్షన్లు, పోలీసు కేసులు వంటి చర్యలు చేపట్టారని అన్నారు. సమావేశంలో మణిరాంసిం గ్, అబ్దుల్ ఖాదర్, ఓజియార్, రాజన ర్సు, అంజనేయులు గౌడ్, శ్రీనివాస్‌రె డ్డి, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement