
'దేవదాసు' చిత్రంతో వెండితెరపై హీరోయిన్‌గా అడుగు పెట్టిన సన్నజాజి ఇలియానా. వరుస సినిమాలతో తెలుగులో హవా చూపిన ఈ భామ 'దేవుడు చేసిన మనుషులు' చిత్రం తర్వాత బాలీవుడ్‌కు వెళ్లిపోయారు. హిందీ సినిమాలు చేస్తూ అక్కడే సెటిలయ్యారు. సుదీర్ఘ విరామం తర్వాత 'అమర్ అక్బర్ ఆంటోని'తో టాలీవుడ్‌లో రీఎంట్రీ ఇచ్చినా పెద్ద ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆమె బాలీవుడ్‌లోనే అవకాశాలు వెతుక్కుంటోంది. తాజాగా ఆమె 'అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ' అనే రొమాంటిక్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌లో ఇలియానా గాయపడ్డారు. (చదవండి: రీ ఎంట్రీకి రెడీ అయిన తనుశ్రీ దత్తా..!)
ఆమె అరచేతికి స్వల్ప గాయమైంది. దీనికి సంబంధించిన రెండు ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. "ఒక రొమాంటిక్ కామెడీ సినిమా షూటింగ్‌లో ఎవరైనా గాయపడతారా?" అని నవ్వుతూ సరదాగా రాసుకొచ్చారు. మరో ఫొటోలో "ఐయామ్ ఫైన్" అని తెలిపారు. ఇక ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం "అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ"లో హీరో రణ్‌దీప్ హుడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. హర్యానా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో వర్ణ వివక్షపై పోరాడే యువతి పాత్రలో ఇలియానా కనిపిస్తారు. ఇలియానా నటించిన ‘ముబారకాన్’ సినిమాకు కథ–స్క్రీన్‌ప్లేను అందించిన బల్వీందర్ సింగ్ జంజ్వా ఈ చిత్రంతో దర్శకునిగా మారుతున్నారు. (చదవండి: నేనెప్పుడూ పర్ఫెక్ట్‌గా ఉండాలనుకోలేదు)
Comments
Please login to add a commentAdd a comment