
ఇలియానా
అవును.. ఇంతకీ ఇలియానాకి పెళ్లి అయిందా? లేదా? అనేదే ప్రస్తుతం ఇలియానా ఫ్యాన్స్ మదిలో మెదులుతున్న అతి పెద్ద ప్రశ్న. క్రిస్మస్ సందర్భంగా ఇలియానా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన తన ఫొటో కింద ‘ఫొటో బై హబ్బీ’ అనే క్యాప్షనే ఈ ప్రశ్నలన్నింటికీ దారి తీసింది. ‘ఇంతకీ మీకు పెళ్లి అయిందా? లేదా?’ అని ఇలియానాను అడిగితే ‘‘పోస్ట్‌లో మీరేం చూశారో అదే.
సోషల్ మీడియాలో గ్రేట్ థింగ్ ఏంటంటే వాళ్లు ఎంత వరకు తెలుసుకోవచ్చో అంతవరకే తెలుసుకోవచ్చు. పెళ్లి నా పర్శనల్ విషయం. దాని గురించి దాయాల్సింది ఏమీ లేదు. అలాగే కొట్టిపారేయాల్సిందీ కూడా ఏం లేదు. మీరెన్ని అడిగినా నేను చెప్పాలనుకున్నదే చెబుతా’’ అని క్వశ్చన్‌ను క్వశ్చన్‌మార్క్ లాగానే ఉంచేశారు ఇలియానా. బ్యూటీ విత్ బ్రెయిన్ అని ఇలాంటి అమ్మాయిలనే అంటారామో. అసలు విషయం చెప్పకుండా తికమకలో పడేయడం ఇలాంటి వాళ్లకే చెల్లుతుంది.